S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/07/2018 - 23:29

కాటమరాయుడు చిత్రం తరువాత -శృతిహాసన్ స్క్రీన్‌మీద కనిపించింది లేదు. నిర్మాతలు ఆమె కాల్షీట్ల కోసం అడుగుతున్నా -ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదట. నవంబర్‌లో విడుదల కానున్న ‘శెభాష్ రాయుడు’ చిత్రంలో శృతి కనిపించనుంది. మళ్లీ 2020లో వచ్చే బాలీవుడ్ చిత్రం తప్ప, శృతి చేస్తున్న చిత్రాలేమీ లేవు. ఇందుకు కారణం -శృతి ట్రాక్ మార్చుకుందని అంటున్నారు.

10/07/2018 - 23:41

సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం మహర్షి. మహేష్ కెరీర్‌లో 25వ సినిమా కావడంతో, ప్రాజెక్టుని ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. మూడో షెడ్యూల్ కోసం మళ్లీ యూనిట్ అమెరికా వెళ్లనుంది.

10/07/2018 - 23:27

యు టర్న్ చిత్ర ఫలితం సమంతలో గొప్ప మార్పు తెచ్చినట్టుంది. అందుకే -లేడీ ఓరియెంటెడ్ చిత్రాల విషయంలో యు టర్న్ తీసుకున్నానని చెబుతోంది. తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సమంత -మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలు చేసి కొత్త ఇమేజ్ సాధించాలని అనుకుంది. వైవాహిక జీవితంలోకి వచ్చేసింది కనుక -స్టార్ హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ఒకింత తటాపటాయించింది.

10/07/2018 - 23:14

బాలీవుడ్ హాట్ భామ దీపికా పదుకొనె మరోసారి మహిళా ప్రాధాన్యమున్న చిత్రానికి సిద్ధమవుతోంది. ఇటీవలే పద్మావతిగా మెప్పించి, బాక్సాపీస్ వద్ద సంచలన విజయం అందుకున్న దీపిక, నటిగానేకాదు గ్లామర్ విషయంలోనూ తనకు తానే సాటి అని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది. కొత్త ప్రాజెక్టులో భాగంగా పద్మావతికి పూర్తి వైవిధ్యమైన చిత్రంలో లేడీ డాన్ పాత్ర పోషించేందుకు రెడీ అవుతోందన్నది ఇండస్ట్రీ టాక్. ఆ డాన్ ఎవరో కాదు..

10/07/2018 - 23:36

భారతీయ సినిమాకు బయోపిక్ పీవర్ పట్టుకుంది. సినిమా చరిత్రలో బయోపిక్ ఓ ట్రెండ్‌గా మారుతోంది. ప్రేక్షకుల అభిరుచి మేరకు దిగ్గజాలను తెరకెక్కించే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. నిజ జీవిత పాత్రలతో వస్తోన్న సినిమాలను ప్రేక్షకులు అక్కును చేర్చుకుంటుండటంతో, ట్రెండ్‌ను కంటిన్యూ చేసేందుకు మేకర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు.

10/07/2018 - 23:32

దేవదాస్ టీం హ్యాపీగా ఉంది. నాగార్జున, నాని కలిసి నటించిన ‘దేవదాస్’ మంచి టాక్‌తో నడుస్తుండటమే ఆ హ్యాపీకి కారణం. వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందిన చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. దేవదాస్ సక్సెస్ మీట్‌లో నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ ‘పరిశ్రమలో హీరోలనే నమ్ముకున్నా. వాళ్లవెంటే నడిచాను. వైజయంతీ సంస్థ విజయబావుటాలో వాళ్లదే అగ్రభాగం. అందుకే హీరోలను అభిమానించే నిర్మాతగా..

10/07/2018 - 23:30

ఆడియన్స్ కోరుకుంటున్న వైవిధ్యం వెనుక టాలీవుడ్ పరుగులు తీస్తోంది. భిన్నమైన, ప్రయోగాత్మక సినిమాలకు ఆడియన్స్ సక్సెస్ రేటింగ్ ఇస్తున్నారు. సినిమా ఎలా వున్నా, ఫైనల్‌గా సాధించిన వసూళ్లను బట్టే సక్సెస్ రేట్‌ని లెక్కించడం మామూలే. ఎవరెలాంటి సినిమా తీశారన్నది కాదు -హిట్టయ్యిందా లేదా? వసూళ్లు భారీగా ఉన్నాయా లేదా? నిర్మాతకు ఎంత మిగిలిం? ఈ ప్రశ్నలకు రెస్పానే్స ఫైనల్ రిజల్ట్.

10/05/2018 - 20:21

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రం షూటింగ్ తుది దశకు చేరింది. ఇటీవల విడుదలైన చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో, చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఇక చిత్రం ఆడియో విడుదల వేడుకను 6న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరుపనున్నారని సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి వుంది.

10/05/2018 - 20:20

మహిళలు కొన్ని తరహా సమస్యలు సమర్థంగా ఎదుర్కోడానికి ‘మీ టూ’లాంటి ఉద్యమ స్ఫూర్తి మన దేశంలోనూ రావాలంటోంది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజల్. విదేశాల్లో ‘మీ టూ’ పోరాటం పదునుదేరుతోన్న విషయం తెలిసిందే. విడుదలకు సిద్ధమవుతున్న ‘హెలికాప్టర్ ఈలా’లో ఓ వైవిధ్యమైన అమ్మ పాత్రను పోషించింది కాజోల్. ప్రస్తుతం ఆ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.

10/05/2018 - 20:18

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రం షూటింగ్ తుది దశకు చేరింది. ఇటీవల విడుదలైన చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో, చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఇక చిత్రం ఆడియో విడుదల వేడుకను 6న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరుపనున్నారని సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి వుంది.

Pages