S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/05/2018 - 20:14

బాలీవుడ్ క్రేజీ గాళ్.. ప్రియాంకా చోప్రా త్వరలోనే వివాహం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నిక్‌తో డేటింగ్ చేస్తున్న బక్కపల్చని బ్యూటీ, ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకుని సెటిలవ్వాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టు ఇటీవల బలంగా వినిపిస్తోన్న మాట. ఇదిలావుంటే, ప్రియాంక ఇటు బిజినెస్ ఫీల్డ్‌లోకీ ఎంట్రీ ఇవ్వాలని సన్నాహాలు చేసుకుంటోందట.

10/05/2018 - 20:13

ఈమధ్య ఏ సినిమాలో చూసినా మూతి ముద్దులు ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అవసరం వున్నా లేకున్నా ఈ లిప్ లాక్ సీన్స్ ఆగడంలేదు. దానికితోడు హీరోయిన్ మితిమీరిన గ్లామర్ ఎక్స్‌పోజింగ్, రొమాంటిక్ సీన్స్ సినిమాల్లో కామన్ అయ్యాయి. ఈ ముద్దుల హంగామా బాలీవుడ్ చిత్రాల్లోనే ఎక్కువ. తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ సెటైర్ వేసేశాడు. ఈ విషయంపై బిటౌన్‌లో నానా రచ్చ నడుస్తోంది.

10/05/2018 - 20:12

ఈ జనరేషన్ హీరోల్లో నారా రోహిత్ ట్రాక్ వేరు. అతని రికార్డులూ వేరు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలు చేస్తున్న హీరో నారా రోహిత్ అనిపించుకున్నాడు. తాజాగా వీరభోగ వసంతరాయలు అంటూ స్క్రీన్‌కు వస్తున్నాడు. ఈనెల 26న చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. నారా రోహిత్, శ్రీయసరన్, సుధీర్‌బాబు, శ్రీవిష్ణు కీలక పాత్రధారులు. చిత్రాన్ని ఇంద్రసేన తెరకెక్కిస్తున్నాడు.

10/05/2018 - 20:11

విజయ్ ఆంథోని నటిస్తోన్న తాజా చిత్రం ‘రోషగాడు’. ఈ వైవిధ్యమైన హీరో తొలిసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసరు పాత్ర చేస్తున్నాడు. ఆ చిత్రానికి గణేష్ దర్శకుడు. విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంథోని నిర్మిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ థీమ్‌సాంగ్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేశారు. ‘రోషగాడురా వీడు..

10/05/2018 - 20:10

స్టార్ కమెడియన్ ‘షకలక’ శంకర్ హీరోగా ఎస్‌కె పిక్చర్స్ సమర్పణలో రూపుదిద్దుకున్న చిత్రం ‘శంభో శంకర’. నిర్మాతల్లో ఒకరైన సురేశ్ కొండేటి ఇటీవలే మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్’నూ తెలుగులో ‘జనతా హోటల్’ పేరిట తీసుకొచ్చారు. తాజాగా సురేశ్ కొండేటి మరో రెండు సినిమాలను ప్రకటించాడు. ‘షకలక శంకర్’ హీరోగా మరో సినిమాను తెరకెక్కించనున్నట్టు ప్రకటించాడు.

10/05/2018 - 20:08

కిరాక్ పార్టీ చిత్రం తరువాత యువ హీరో నిఖిల్ నటిస్తున్న చిత్రం ‘ముద్ర’. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో జరుగుతుంది. షెడ్యూల్ తరువాత పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తిచేసి సినిమాను నవంబర్ 8న విడుదల చేయనున్నారు. తమిళ దర్శకుడు టిఎస్ సంతోష్ తరెకెక్కిస్తున్న చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తమిళ్‌లో విజయం సాధించిన ‘కనితన్’ సినిమాకి రీమేక్.

10/05/2018 - 20:07

ఒకప్పుడు సౌత్ స్క్రీన్ దుమ్ములేపిన గ్లామర్ భామ త్రిష గత కొంతకాలం ఎత్తుపల్లాల కెరీర్‌నే సాగిస్తోంది. హిట్టుకి కేరాఫ్ అడ్రెస్‌లాంటి బ్యూటీ కొన్ని రోజులుగా సరైన హిట్ కోసం ఎదురు చూపులు చూస్తోంది. పెద్ద హిట్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని ఆశపడిన త్రిష, హరర్ ట్రెండ్‌ను భుజానికెత్తుకుని మోహిని, నాయకిలాంటి ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కాలేదు.

10/04/2018 - 19:59

అతను కథగా మారితే -కథానాయకుడు. అతనే ఓ చరిత్రయితే -మహానాయకుడు. అనుకున్నట్టే అన్న కథ రెండు భాగాలైంది. పుంఖాను పుంఖాల చరిత్రను పుక్కిట పట్టడం కష్టమే కనుక -యన్టీఆర్ కథను రెండు భాగాలు చేశారు. నందమూరి తారక రామారవు జీవిత కథతో తెరకెక్కిస్తోన్న చిత్రానికి సంబంధించి ‘కథానాయకుడు’, ‘మహానాయకుడి’ పోస్టర్లు విడుదలయ్యాయి.

10/04/2018 - 19:58

బాలీవుడ్ గ్లామర్ భామ ప్రియాంకా చోప్రా పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. దానికి కారణం ఇటీవలే ఆమె బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనస్‌తో కలిసి రాజస్తాన్‌లోని జోధాపూర్, మెహ్రన్‌ఘ్ఢ్ కోటను సందర్శించింది. ప్రియుడితో లిసి కోటను సందర్శించడంతో అక్కడున్న జనాలు ప్రియాంక, నిక్‌ల మధ్య ప్రేమాయణం గురించి చర్చించుకుంటున్నారు.

10/04/2018 - 19:57

విజయ్ దేవరకొండ. ప్రస్తతం టాలీవుడ్ మోస్ట్ సెనే్సషనల్ స్టార్. అతనితో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. మొన్న అర్జున్ రెడ్డి హిట్. నిన్న గీత గోవిందం హిట్. ఆ ఊపులో తాజాగా వస్తోన్న నోటా. తెలుగు తమిళ భాషల్లో శుక్రవారం విడుదలవుతోంది. సక్సెస్ రేస్‌లోవున్న విజయ్ మీడియాతో చిట్‌చాట్.
బాబు బాగా బజీ అనుకుంటా?

Pages