S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/09/2018 - 02:43

చిత్రాలు..వంట గ్యాస్‌సహా ఇంధన ధరలు విపరీతంగా పెరడాన్ని నిరసిస్తూ
పాట్నాలో ఖాళీ సిలెండర్లతో ప్రదర్శన నిర్వహిస్తున్న ఆర్‌జేడీ మద్దతుదారులు.
* పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ భువనేశ్వర్‌లో భారీ ప్రదర్శన
నిర్వహించిన సీపీఐ కార్యకర్తలు. పెట్రోలు, డీజిల్ ధరలను అదుపు చేయడానికి కేంద్రం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

09/09/2018 - 02:41

శ్రీనగర్, సెప్టెంబర్ 8: పాకిస్తాన్ కొత్త ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ హయాంలో భారత్-పాక్ మధ్య సంబంధాలు మెరుగవుతాయన్న ఆశాభావాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వ్యక్తం చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు షేక్ మహ్మద్ అబ్దుల్లా 36వ వర్థంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగురచేందుకు దివంగత మాజీ ప్రధాని వాజపేయి ఓ ప్రయత్నం చేశారన్నారు.

09/09/2018 - 02:38

చండీగఢ్, సెప్టెంబర్ 8: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై బీజేపీ అధినాయకత్వం వౌనం దాల్చడంపై కాంగ్రెస్ శనివారం మరోసారి మండిపడింది. దేశ భద్రతలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజీపడిపోయిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తీవ్రంగా విమర్శించారు. యుపీఏ హయాంలో భారత వైమానిక దళం ఆమోదం తెలిపిన తరువాతే ఫ్రాన్స్‌తో రాఫెల్ ఒప్పందం చేసుకున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

09/09/2018 - 02:35

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఎయిరో ఇండియా బెంగళూరు నుంచి తరలిపోనుందన్న ఊహా గానాలకు రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం తెరదించింది. ఎయిరో ఇండియా తదుపరి ఎడిషన్ బెంగళూరులోనే జరుగుతుందని స్పష్టం చేసింది. ఆసియాలోనే అతిపెద్ద ప్రదర్శనగా పేరొందిన వైమానిక అంతరిక్ష ప్రదర్శన (ఎయిరో స్పేస్ ఎగ్జిబిషన్) వచ్చే యేడాది ఫిబ్రవరి 20 నుంచి 24 వరకు యధావిధిగా బెంగళూరు వేదికగానే జరుగుతుందని అధికారులు తెలిపారు.

09/09/2018 - 03:48

చెన్నై: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇతర జాతీయ పార్టీల నన్నింటినీ నిర్వీర్యం చేసి దేశం మొత్తాన్ని కాషారుూకరించేందుకు ప్రయత్నిస్తోందని డీఎంకె అధ్యక్షుడు స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు. శనివారం ఇక్కడ జరిగిన పార్టీ కార్యదర్శులు, ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి మాట్లాడారు.

09/09/2018 - 01:54

ముంబయిలో వినాయక చవితి సందడి మొదలైంది. వివిధ ఆకృతుల్లో రూపుదిద్దుకున్న గణనాధులు ముంబయ పురవీధుల్లో ఊరేగింపుగా మండపాలకు బయలుదేరారు. దీంతో ముంబయ నగరంలో శనివారం జరిగిన విగ్రహాల ఊరేగింపు ఏకంగా నిమజ్జనానే్న తలపించింది. భారీ జనసందోహం మధ్య గణపతి బొప్పా మోరియా నినాదాలు హోరెత్తాయ.

09/09/2018 - 01:51

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఉన్నత విద్యా సంస్థల పనితీరును మదింపు వేసి గుర్తింపు ఇచ్చే నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (నాక్), నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ (ఎన్‌బీఏ) సంస్థలను విస్తరించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ చెప్పారు. ఐఐటీ, ఐఐఎంలు, నాక్, ఎన్‌బీఏ సంస్థలు త్వరితగతిన విద్యా సంస్థలకు గుర్తింపు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

09/09/2018 - 01:50

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: జాతీయ పౌర నమోదు (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) లో మన దేశానికి చెందిన ఏ పౌరుడినీ విస్మరించబోమని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. బీజేపీ నాయకుడు సునిల్‌దియోధర్ నెలకొల్పిన మైహోం ఇండియా స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో శనివారం నాడిక్కడ జరిగిన ఈశాన్య రాష్ట్రాల విద్యార్థి మహోత్సవంలో ఆయన ప్రసంగించారు.

09/09/2018 - 01:43

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: తమిళనాడులో రూ.90 కోట్ల బ్యాంకు రుణాల, మనీల్యాండరింగ్ కుంభకోణం కేసులో దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముమ్మరం చేసింది. మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో శనివారంనాడు ఈడీ దాడులు, తనిఖీలు నిర్వహించింది.

09/09/2018 - 01:41

ముంబయి, సెప్టెంబర్ 8: ఇటీవల అరెస్టయిన మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఏడు అనుబంధ సంస్థలకు సంబంధించిన వారని పూణే పోలీసులు చెప్పారు. నిషేధిత మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాల పేరుతో వీరు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పోలీసులు చెప్పారు. గత ఏడాది రాష్ట్రంలో జరిగిన ఎల్గార్ పరిషత్ సమావేశంతో మావోయిస్టు పార్టీకి సంబంధం ఉందన్నారు.

Pages