S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/07/2018 - 02:47

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ‘భారత్ కీ వీర్’ పథకానికి ఇచ్చే విరాళాలకు ఆదాయపన్ను మినహాయింపుఉంటుందని కేంద్రం ప్రకటించింది. తీవ్రవాదులతో జరిగే పోరులో మరణించే సైనికుల కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో భారత్ కీ వీర్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ తదితరులు ప్రారంభించారు.

09/07/2018 - 02:41

పాట్నా/్భపాల్/జైపూర్, సెప్టెంబర్ 6: ఉత్తర భారతదేశంలో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎస్సీ,ఎస్టీ చట్టం సవరించడాన్ని నిరసిస్తూ వివిధ సంఘాలు గురువారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో పలు రాష్ట్రాల్లో రైల్‌రోకో, రాస్తారోకోలు జరిగాయి. అనేక పట్టణాల్లో వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. బిహార్‌లో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు.

09/07/2018 - 02:14

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: మాజీ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూను విమర్శించటంతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని బఫూన్ అంటూ విమర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పెద్ద జోకర్ అని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా దుయ్యబట్టారు. గురువారం కుంతియా విలేఖరులతో మాట్లాడుతూ ఒక బఫూన్ మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాగలుగుతారని స్పష్టం చేశారు.

09/07/2018 - 01:11

న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభ రద్దయిన నేపథ్యంలో శుక్రవారం జరుగుతున్న కేంద్ర ఎన్నికల సంఘం సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రావత్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో తెలంగాణ శాసనసభ ఎన్నికల గురించి కూడా చర్చించనున్నట్లు తెలిసింది. తెలంగాణ అసెంబ్లీ రద్దుకు సంబంధించిన అధికారిక సమాచారం గురువారం రాత్రి కేంద్ర ఎన్నికల సంఘానికి చేరుతుందని భావిస్తున్నారు.

09/07/2018 - 00:56

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: నియంతలా వ్యవహరించే కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితిని బొందపెట్టి గోరీ కట్టించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రశేఖరరావుకు పోయేకాలం వచ్చింది కాబట్టే శాసనసభను రద్దు చేసుకున్నాడని ఆయన అన్నారు.

09/06/2018 - 13:47

న్యూఢిల్లీ: పటేల్‌ కులస్థులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తే పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి(పీఏఏఎస్‌) నాయకుడు హార్దిక్‌ పటేల్‌ గత 12రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం హార్దిక్‌తో చర్చలు ప్రారంభించకపోతే ఆయన మంచినీళ్లు కూడా తాగడం ఆపేస్తారనిసమితి కన్వీనర్‌ మనోజ్‌ పనరా హెచ్చరించారు.

09/06/2018 - 13:35

న్యూఢిల్లీ:స్వలింగ సంపర్కంపై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. స్వలింగ సంపర్కం నేరం కాదని అత్యున్నత న్యాయస్థానం తీర్పులో పేర్కొంది.స్వలింగ సంపర్కం నేరమని పేర్కొన్న ఐపీసీ సెక్షన్‌ 377ను కొట్టివేస్తూ 4-1 మెజార్టీతో ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది.

09/06/2018 - 12:32

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంలో ఇటీవల చేసిన సవరణలను నిరసిస్తూ పలు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం భారత్ బంద్ జరుగుతుంది. ఈ బంద్ వల్ల ఉత్తరాదిని ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. బీహర్‌లో నిరసనకారులు రైళ్లను నిలిపివేశారు. యూపీ, మధ్యప్రదేశ్‌లలో దిష్టిబొమ్మల దహనం చేపట్టారు. బీహర్‌లో ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలు, పెట్రోల్ పంపులు మూసివేశారు. మధ్యప్రదేశ్, యూపీ, జార్ఖండ్‌లలో బంద్ జరిగింది.

09/06/2018 - 12:31

న్యూఢిల్లీ: ఇకపై విద్యార్థులకు సీబీఎస్‌ఈ భారం తగ్గించనున్నారు. ఈ మేరకు విస్తత్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఒకటి నుంచి 12వ తరగతి వరకు సిలబస్ భారం 12 నుంచి 15 శాతం వరకు తగ్గించనున్నామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు. మార్చేబోయే సిలబస్‌కు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ తుది మెరుగులు దిద్దుతుందన్నారు.

09/06/2018 - 04:48

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో గుట్కా కుంభకోణం అధికార పార్టీ పునాదులను కదిలిస్తోంది. ఈ స్కామ్‌కు సంబంధించి రాష్ట్ర మంత్రి, పోలీస్ ఉన్నతాధికారి అయిన డీజీపీ, మాజీ డీజీపీ గృహాలపై సీబీఐ దాడులు నిర్వహించడం సంచలనం కలిగించింది.

Pages