S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/09/2018 - 01:19

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: తెలంగాణలో ఊహించని విధంగా వచ్చిన ఎన్నికలను ఎదుర్కొనేందుకు భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారని తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఢిల్లీలో శనివారం బీజేపీ పదాధికారుల, వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల సమావేశం జరిగింది.

09/09/2018 - 00:58

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: వచ్చే ఏడాది 2019 ఎన్నికలు పూర్తయ్యే వరకు బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ రథ సారథిగా అమిత్ షానే కొనసాగుతారు. వాస్తవానికి అమిత్ షా అధ్యక్షుడిగా పదవీ కాలం వచ్చే ఏడాది జనవరితో ముగుస్తుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీ సంస్థాగత ఎన్నికలను నిలిపివేయనున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో, ఇప్పుడున్న టీంతోనే బీజేపీని నడిపిస్తారు.

09/08/2018 - 16:44

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చత్తీస్‌గఢ్‌లోని మహేంద్రగఢ్‌లో నీటి ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనం అల్లాడిపోతున్నారు. రోడ్లపై నడుము లోతు నీళ్లు నిలిచి ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో సైతం వర్షాలు కురుస్తున్నాయి.

09/08/2018 - 12:54

చెన్నై : తన తండ్రిని హత్య చేసిన మమ్మల్నిరాహుల్‌ గాంధీ క్షమించారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ఈ విషయం గురించి ఆమె ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థతో ఉత్తరాల ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ఆమె.. ‘ఇప్పటికే నా జీవితంలో చాలా కష్టాలను భరించాను. ఇక మిగిలిన ఈ జీవితాన్ని నా కుమార్తెతో సంతోషంగా గడపాలనుకుంటున్నాను.

09/08/2018 - 12:53

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో పెట్రో ధరలు మరింత భగ్గుమన్నాయి. లీటరు పెట్రోలు ధర రూ. 80కి చేరుకుంది. శనివారం పెట్రో ధరల్లో మార్పులు చేసుకున్న నేపధ్యంలో లీటరుకు 39 పైసలు పెరిగి రూ. 80.38కి చేరుకుంది. అలాగే డీజిల్ 44 పైసలు పెరిగి రూ. 72.51కి చేరుకుంది. చెన్నైలో పెట్రోలు రూ. 83.54, డీజిల్ 76.64కు చేరుకుంది.

09/08/2018 - 12:51

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో అచబల్లో ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు మరోసారి పోలీసులపై మెరుపుదాడికి దిగారు. ఈ ఘటనలో లష్కరే తొయిబాకి చెందిన ఓ ఉగ్రవాదిని హతమవ్వగా... పోలీస్ సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి.

09/08/2018 - 12:50

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను నిదానంగా, పూర్తిస్థాయిలో నాశనం చేస్తోందని కాంగ్రెస్‌నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. పెద్ద నోట్ల రద్దు, యువతకు ఉద్యోగాలు కల్పించకపోవడంతో రాష్ట్రాలలో నేరాలు పెరిగాయని అన్నారు. జిఎస్‌టి, మేక్‌ ఇన్‌ ఇండియా, స్టాండ్‌ అప్‌ ఇండియా పథకాలపై జాతీయ స్థాయిలో చర్చకు పిలుపునిచ్చారు.

09/08/2018 - 12:38

ముంబయి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వైస్ ప్రెశిడెంట్ సిద్దార్ధ్ కిరణ్ సంఘ్వీ బుధవారం నుంచి అదృశ్యమయ్యారు. ఆయన తన భార్య, కుమారుడితో మలబార్ హిల్స్ ప్రాంతంలో ఉంటున్నారు. బుధవారం ఆఫీసు నుంచి బయలుదేరి ఇంటికి రాలేదు. ఆయన కారు అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించింది. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

09/08/2018 - 12:37

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లోని కోలాహోయ్ మంచునదిలో కూరుకుపోయి ఇద్దరు పర్వతారోహకులు చనిపోయారు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మొత్తం పదిమంది పర్వతారోహకులు ఇక్కడకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ముగ్గురు లోయలో పడిపోయారు. ఈ ప్రమాదంలో నవీన్ జిలానీ, ఆదిల్ షా అనే వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు.

09/08/2018 - 06:14

న్యూఢిల్లీ: రాష్ట్రంలో శాసన సభ ఎన్నికల నిర్వహణ సంసిద్ధత గురించి అధ్యయనం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సీనియర్ అధికారుల బృందం తెలంగాణకు వెళుతుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర ఎన్నికల సంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హా అధ్యక్షతన సీనియర్ అధికారుల బృందం ఈనెల 11 తేదీ మంగళవారం హైదరాబాదుకు వెళుతుంది.

Pages