S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/08/2018 - 06:11

న్యూఢిల్లీ, సెప్టెంబరు 7: మధ్యప్రదేశ్ తదితర నాలుగు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలతో తెలంగాణ ఎన్నికలు జరుగుతాయని, ఇవి నవంబర్‌లో ఉండవచ్చని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను కేంద్ర ఎన్నికల కమిషన్ చీఫ్ ఓపీ రావత్ ఖండించారు. తాను ఇది వరకే అందరితో మాట్లాడి, షెడ్యూల్‌ను ఖరారు చేసుకున్నానని కేసీఆర్ చెప్పిన మాటను ఆయన తోసిపుచ్చారు. నిజానికి కేసీఆర్ తనతో మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు.

09/08/2018 - 06:10

న్యూఢిల్లీ, సెప్టెంబరు 7: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర ఎన్నికల కమిషనరా అని సీపీఐ నేతలు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీకి ముందుగానే ఎన్నికల షెడ్యూల్‌ను ఆయన ప్రకటించారని ఆరోపిస్తూ ఎన్నికల సంఘానికి సీపీఐ ఫిర్యాదు చేసింది.

09/08/2018 - 04:36

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: రాహుల్ గాంధీతో ఎవరైనా పోటీపడతారా? అంటూ విమర్శకులను కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ ప్రస్తుతం కైలాస్ మానస సరోవర్ యాత్రలో ఉన్న విషయం తెలిసిందే. ఆగస్టు 31న యాత్రకు బయలుదేరిన ఆయన ఆతర్వాత కైలాస పర్వతం వద్ద నిలబడి తీయించుకున్న ఫొటోలను తన ట్విట్టర్‌లో ఉంచారు.

09/08/2018 - 04:34

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకం అద్భుతమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రాస్ గెబ్రియోసిస్ కితాబునిచ్చారు. ఇలాంటి పథకాల ద్వారా అట్టడుగు వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ట్వీట్ చేశారు. ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టిన మోదీని ప్రశంసించారు.

09/08/2018 - 04:48

ఫోటో రైటప్:
==========
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా మహారాష్టల్రోని కరద్‌కు చెందిన పాఠశాల విద్యార్థినులు అక్షరాస్యతా చిహ్నం ఆకారంలో మానవహారంగా ఏర్పడిన దృశ్యం.

09/07/2018 - 23:54

సిలిగురి (పశ్చిమ బెంగాల్) సెప్టెంబర్ 7: పశ్చిమ బెంగాల్‌లో ఉత్తర ప్రాంతంలోని సిలిగురి సమీపంలో మరో పురాతన వంతెన శుక్రవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ ట్రక్ డ్రైవర్ గాయపడ్డారు. మూడు రోజుల వ్యవధిలో ఆ రాష్ట్రంలో ఇలా పాత వంతెనలు కూలిపోవడం ఇది రెండోసారి. దక్షిణ కోల్‌కతాలో సెప్టెంబర్ 4న మజర్హత్ వంతెన కూలిపోయిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా, 24మంది గాయపడిన సంగతి తెలిసిందే.

09/07/2018 - 23:45

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: ఎస్సీ,ఎస్టీ చట్టంపై పార్లమెంట్‌లో చేసిన సవరణల బిల్లు అమలును నిలిపివేస్తూ ఈ పరిస్థితుల్లో స్టే ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఆగస్టు తొమ్మిదిన ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఆగస్టు తొమ్మిదిన పార్లమెంట్‌లో చేసిన సవరణలు సవరించాలని కోరుతూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం విచారణ చేపట్టింది.

09/08/2018 - 04:52

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: వచ్చే ఐదేళ్లలో దేశంలోని మొత్తం వాహనాల సంఖ్యలో 15 శాతం ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువచ్చి కాలుష్యాన్ని తగ్గించడమే కాక, ఇంధన వాడకాన్ని గణనీయంగా తగ్గించాలన్నది తమ ప్రభుత్వ ధ్యేయమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.

09/07/2018 - 23:38

బెంగళూరు, సెప్టెంబర్ 7: సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే హెచ్చరించే సరికొత్త జీపీఎస్ సిస్టం నావిక్ (ఎన్‌ఏవీఐసీ) ఆవిష్కృతమైంది. దేశీయంగానే రూపుదిద్దుకున్న ఈ డివైస్ ఫోన్ నెట్‌వర్క్‌లేని సుదూర సముద్ర ప్రాంతాల్లోనూ అద్భుతంగా ఉపకరిస్తుంది.

09/07/2018 - 23:37

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి గతంలో మాదిరిగా పెద్ద వలసలు లేవని, ఈ రోజు బంగ్లాదేశ్ ప్రజలు సుఖవంతమైన జీవనాన్ని అనుభవిస్తున్నారని బంగ్లాదేశ్ బార్డర్ గార్డింగ్ ఫోర్స్ మేజర్ జనరల్ షాఫీనుల్ ఇస్లాం చెప్పారు. అప్పుడప్పుడు కొన్ని వలసలు ఉంటున్నాయని, వీరంతా ఉమ్మడి సంస్కృతి, కుటుంబ బంధాలతో ఇరు దేశాల మధ్య రాకపోకలు సాగిస్తున్నారన్నారు.

Pages