S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/21/2018 - 02:52

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటిసారి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై కాంగ్రెస్ సహా మొత్తం ఏడు ప్రతిపక్షాలు ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడుకు శుక్రవారం ఇచ్చిన అభిశంసన నోటీసు అంత సులభంగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదు. అభిశంసన తీర్మానాన్ని లోక్‌సభ సభ్యులైతే వంద మంది, రాజ్యసభ సభ్యులైతే యాభై మంది ఎంపీలు సంతకం చేయవలసి ఉంటుంది.

04/21/2018 - 02:51

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా శుక్రవారం ఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహించిన ఎన్‌ఎస్‌యుఐ, డియుఎస్‌యు కార్యకర్తలు

04/21/2018 - 02:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ప్రభుత్వ పథకాలు అమలుచేస్తూ వాటి ఫలాలు ప్రజలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. పరిపాలన నిర్మాణం, సమర్థవంతమైన సేవలు అందిస్తున్నామా అన్నదానిపై ఐఏఎస్‌లు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఇక్కడ జరిగిన సివిల్ సర్వీస్ అధికారుల సమావేశంలో ఉప రాష్టప్రతి మాట్లాడుతూ పథకాల సమర్ధవంతంగా అమలుచేయాలని అన్నారు.

04/21/2018 - 01:49

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: యువతను తీవ్రవాదం వైపువెళ్లకుండా చూడడం, ఇప్పటికే ఆ ఉచ్చులో ఉన్న వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం ద్వారా జమ్మూకాశ్మీర్ శాంతిని పాదుగొల్పవచ్చని సైన్యం స్పష్టం చేసింది. దీని కోసం సమష్టికృషి జరగాలని అప్పుడే హింసను పారదోలి, తుపాకీ సంస్కృతి రూపుమాపవచ్చని పేర్కొంది.

04/21/2018 - 01:17

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: తెరాస అస్తవ్యస్థ పాలనపై కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమంలో భాగంగా నిర్వహిస్తున్న బస్సు యాత్రకు పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ హాజరవుతారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. అలాగే, తెరాస సర్కారుపై పోరాటం చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లను ప్రత్యేకంగా అభినందించారన్నారు.

04/21/2018 - 00:58

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను అభిశసించాలంటూ ఏడు పార్టీలు ఉపరాష్టప్రతి, రాజ్యసభ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడుకు శుక్రవారం అభిశంసన నోటీసును అందజేశాయి.

04/20/2018 - 16:57

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేడి శుక్రవారంనాడు వరుస నామినేషన్లతో ఊపందుకుంది. పలువురు ప్రముఖులు నామినేషన్లు వేశారు. జనతాదళ్ (సెక్యులర్) నేత హెచ్.డి.కుమారస్వామి రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. రామనగర, చన్నపట్న నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన నామినేషన్ పత్రాలను ఆయన రిటర్నింగ్ అధికారికి అందజేశారు.

04/20/2018 - 16:36

కేరళ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కతువా చిన్నారి అత్యాచార ఘటనపై ఆందోళనలు కొనసాగుతునే ఉన్నాయి. ఈనేపథ్యంలో ఈ చిన్నారి బొమ్మను గీచిన పాలక్కాడకు చెందిన ఓ చిత్రకారిణి ఇంటిపై ఆందోళనకారులు రాళ్లతో దాడిచేశారు. ఈ చిత్రం తమ మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు.

04/20/2018 - 16:35

కర్నాటక: కర్నాటక ఎన్నికల్లో ముఖ్యమంత్రి చాముండేశ్వరిదేవి నుంచి పోటీ చేసేందుకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.

04/20/2018 - 16:48

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజిందర్ సచార్ కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. వయోభారం వల్ల తలెత్తిన సమస్యలతో ఆయన వారం రోజులుగా ఆసుపత్రి చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూవారు. హక్కుల కార్యకర్తగా ప్రసిద్ధి చెందిన సచార్ ముస్లింల ఆర్థిక, రాజీకయ, సామాజిక అంశాలపై ఆయన ప్రధాని మన్నోహన్ సింగ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

Pages