S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/18/2018 - 16:11

చెన్నై: మహిళా విలేకరి పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించినందుకు తమిళనాడు గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌ క్షమాపణలు కోరారు. నిన్న సాయంత్రం విలేకరుల సమావేశంలో బన్వారీలాల్‌ ఓ మహిళా జర్నలిస్ట్‌ చెంపపై తాకి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై బన్వారీలాల్‌ స్పందించారు. ‘మీరు మంచి ప్రశ్న అడిగారు, అందుకే ప్రశంసాపూర్వకంగా చెంపపై తాకాను. నిన్ను నా మనవరాలిగా అనుకున్నాను.

04/18/2018 - 13:56

జమ్మూకాశ్మీర్: దేశంలో కతువా వంటి ఘటనలు జరగటం దురదృష్టకరమని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఆయన కట్రాలోని మాతా వైష్ణోవిదేవి యూనివర్శిటీలో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నదని అన్నారు. మన కుమార్తెలు క్రీడల్లోనూ, వివిధ రంగాల్లో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నారని అన్నారు.

04/18/2018 - 13:54

బెంగళూరు: తనను చంపటానికి కుట్ర చేశారని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హేగ్డే చేసిన ఆరోపణలపై కర్నాటక ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. కర్ణాటకలో ప్రయాణిస్తున్న కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హేగ్డే కాన్వాయ్‌లోని వాహనాన్ని మంగళవారం రాత్రి ఓ ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొన్న విషయం విదితమే. దీనిపై హేగ్డే స్పందిస్తూ తనను చంపటానికి కుట్ర చేశారని, ఆ ప్రయత్నం విఫలమైందని ట్విట్టర్ ద్వారా ఆరోపించారు.

04/18/2018 - 04:37

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయు డు తనంతటతానే ఎన్‌డీఏ నుంచి తప్పుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలోని 80శాతం టీడీపీతో పొత్తు వద్దని స్పష్టంగా చెప్పారని ఆయన వెల్లడించారు.

04/18/2018 - 04:27

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కాపు వర్గానికి చెందిన నాయకుడిని నియమించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజులలో ఒకరికి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి లభించవచ్చునని అంటున్నారు. కంభంపాటి హరిబాబు మంగళవారం అధ్యక్ష పదవికి రాజీనామా చేయటం తెలిసిందే.

04/18/2018 - 04:22

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: తెలంగాణలో ఈఎస్‌ఐ ఆస్పత్రుల ఏర్పాటుకు సహకారం అం దించాలని కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్‌కు రాష్ట్ర హోం, కార్మిక శా ఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి విజ్ఞప్తి చేశా రు. మంగళవారం గంగ్వార్‌తో నాయిని సమావేశమయ్యారు.

04/18/2018 - 01:57

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చేలా, విభజన హామీలు అమలు చేసే విధంగా చూడాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేసింది.

04/18/2018 - 01:09

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: బ్యాంకులకు వేలాది కోట్లు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన రత్నాల వ్యాపారి నీరవ్ మోదీ లాంటి వారికి మంచి రోజులు తీసుకురావటం ద్వారా దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను ధ్వంసం చేశారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పెద్దఎత్తున ధ్వజమెత్తారు.

04/18/2018 - 01:08

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: వివిధ రాష్ట్రాల్లో తీవ్ర నగదు కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. దేశంలో అవసరానికి మించిన నగదు చెలామణిలో ఉందని, ఎక్కడైనా నగదు కొరత ఉంటే అది తాత్కాలికమేనని ప్రకటించారు.

04/18/2018 - 00:53

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ఎస్సీ/ఎస్టీలకు మరింత చేరువ కావడానికి భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ యత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ సదుపాయం కల్పించే యోచనలో ఉన్నది. ఈ మేరకు త్వరలోనే ఆర్డినెన్స్‌ను జారీచేసే అవకాశం ఉంది.

Pages