S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/06/2018 - 02:42

బెంగళూరు, మార్చి 5: త్రిపుర ఎన్నికల ఫలితాల ప్రభావం కర్నాటకపై పడబోదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ‘మోదీ ప్రభంజనం’ ఎక్కడా లేదన్నారు. కొద్ది నెలల్లో కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ఈశాన్య రాష్ట్రాల్లోని తాజా ఎన్నికల ఫలితాల ప్రభావం కర్నాటకపై పడుతుందన్న మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తుతున్న తరుణంలో సిద్దరామయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

03/06/2018 - 02:40

షిల్లాంగ్, మార్చి 5: మేఘాలయలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటూ గవర్నర్ గంగాప్రసాద్ నుంచి తనకు ఆహ్వానం అందిందని ఎన్‌పిపి అధ్యక్షుడు కన్రాడ్ సంగ్మా సోమవారం నాడిక్కడ వెల్లడించారు. కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం మంగళవారం ఉదయం 10.30కు జరుగుతుందని వెల్లడించిన ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే సంఖ్యాబలం తమకు ఉండటం వల్లే గవర్నర్ తనకు ఆహ్వానం పలికారని తెలిపారు.

03/06/2018 - 02:40

న్యూఢిల్లీ, మార్చి 5: భారత రక్షణ దళాల ఆయుధ ప్రదర్శన-2018ను ఏప్రిల్ 11నుంచి 14 వరకూ చెన్నైలోనిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసిన రక్షణ దళాల మంత్రిత్వ శాఖ, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించి స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యం, విదేశాలకు ఎగుమతి చేస్తున్న రక్షణ పరికరాలను ప్రదర్శించనున్నట్టు పేర్కొంది.

03/06/2018 - 02:37

కోహిమా, మార్చి 5:ఎన్నికల ముందు తమతో పొత్తు కుదుర్చుకున్న ఎన్‌డిపిపితోనే కలిసి నాగాలాండ్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ సోమవారం నాడిక్కడ స్పష్టం చేసింది. గత పదిహేనేళ్లుగా మద్దతిస్తున్న నాగాపీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్)కు మద్దతిచ్చేది లేదని తేల్చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే.

03/06/2018 - 02:36

న్యూఢిల్లీ, మార్చి 5: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపాదించిన తృతీయ ఫ్రంట్ గురించి దేశ రాజధాని ఢిల్లీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెసేతర, బీజేపీ యేతర తృతీయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలన్న చంద్రశేఖరరావు ప్రతిపాదనను పలు ప్రతిపక్షాలు ఆహ్వానిస్తున్నాయి.

03/06/2018 - 02:34

అగర్తల, మార్చి 5: పాతికేళ్ల వామపక్ష కోటను కుప్పకూల్చి త్రిపురలో అధికారం చేపట్టిన బీజేపీ మంగళవారం శాసన సభా పక్ష నేతను ఎన్నుకోబోతోంది. బీజేపీ శాసన సభాపక్ష నేతలు, తమ మిత్రపక్షమైన ఐపీఎఫ్‌టీతో సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.అయితే తమకు మంత్రివర్గంలో గౌరవనీయ స్థాయి కల్పించాలని ఈ గిరిజన మిత్ర పక్షం ఇప్పుడే డిమాండ్లు మొదలు పెట్టింది.

03/06/2018 - 02:34

కోల్‌కతా, మార్చి 5: భారతదేశం అత్యంత సవాళ్లతో కూడిన సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మతతత్వ ధోరణులను ఎదుర్కోవడానికి లౌకిక ప్రజాస్వామ్య శక్తులు విస్తృత స్థాయిలో చేతులు కలపాల్సిన అవసరం ఎంతో వుందని ఆయన స్పష్టం చేశారు.

03/06/2018 - 02:05

న్యూఢిల్లీ, మార్చి 5: ప్రత్యేక హోదాతోసహా విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా ఆంధ్రా ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని ఆరోపిస్తూ ఢిల్లీలోని సంసద్ మార్గ్ పోలీసు స్టేషన్లో ఆంధ్రా కాంగ్రెస్ నాయకులు కేసు పెట్టారు.

03/06/2018 - 02:04

న్యూఢిల్లీ, మార్చి 5: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు నిరసన తెలిపారు.

03/06/2018 - 01:55

న్యూఢిల్లీ, మార్చి 3: ఐదు కోట్ల ఆంధ్రుల న్యాయమైన హక్కు ప్రత్యేక హోదా... అన్న నినాదాలతో దేశ రాజధాని ఢిల్లీ మార్మోగిపోయింది. సోమవారం వైఎస్‌ఆర్‌సీపీ సంసంద్ మార్గ్‌లో ‘ప్యాకేజీతో మోసం చేయొద్దు... ప్రత్యేకహోదా మన హక్కు’ అన్న నినాదంతో చేపట్టిన మహాధర్నాకు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

Pages