S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/05/2018 - 04:42

శ్రీనగర్, మార్చి 4: కశ్మీర్‌లోని సోపియన్ జిల్లాలో, ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మిలిటెంట్‌తో సహా నలుగురు మరణించారు. భద్రతా దళాలకు చెందిన మొబైల్ వెహికిల్ చెక్‌పోస్టు (ఎంవిఈపి), సోపియన్ లోని పోహన్ వద్ద ఒక కారును ఆపాలని కోరింది. కారు ఆగకపోగా అందులోంచి కాల్పులు మొదలయ్యాయి.

03/05/2018 - 03:55

అగర్తలా, మార్చి 4: త్రిపురలో పాతికేళ్ల సిపీఐ(ఎం) నాయకత్వంలోని లెఫ్ట్‌ఫ్రంట్ కంచుకోట బీటలువారింది. అప్రతిహతంగా సాగిన వామపక్ష పాలనకు పూర్తిగా తెరపడింది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానమైన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-ఐపీఎఫ్‌టి కూటమి అనితర విజయం సాధించటంతో లెఫ్ట్‌ఫ్రంట్ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది.

03/05/2018 - 03:51

న్యూఢిల్లీ, మార్చి 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్‌లో సోమవారం ‘మహాధర్నా’ నిర్వహించనుంది. పార్లమెంట్ రెండవ దఫా బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ధర్నాకు పిలుపిచ్చింది. ఆ పార్టీకి చెందిన నాయకులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.

03/05/2018 - 03:23

న్యూఢిల్లీ, మార్చి 4: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను రూ.12,600 కోట్ల మేరకు మోసగించిన వ్యవహారం విదేశాలకు కూడా విస్తరించినట్టు కనిపిస్తుండటంతో అన్ని రకాల అవినీతి కార్యకలాపాలకు సంబంధించి అవసరమైన అన్ని నియంత్రణా చర్యలు తీసుకుంటామని మారిషస్ హామీ ఇచ్చింది. ఫైనాన్షియల్ సర్వీస్ కమిషన్ (ఎఫ్‌ఎస్‌సీ) ఆఫ్ మారిషస్..

03/05/2018 - 04:58

షిల్లాంగ్, మార్చి 4: మేఘాలయలో రాజకీయ సీన్ మారిపోయంది. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినప్పటికీ మిత్రులను కూడగట్టడంలో విఫలం అయంది. అదే సమయంలో ఎన్‌పీపీ అధ్యక్షుడు కొన్రాడ్ సంగ్మా మేఘాలయ గవర్నర్‌ను కలిసి తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఆయన గవర్నర్ గంగాప్రసాద్‌ను కలసి, తనకు 34 మంది ఎమ్మెల్యేల మద్దతున్నదని చెప్పారు.

03/05/2018 - 02:48

న్యూఢిల్లీ, మార్చి 4 : సబార్డినేట్ సర్వీసుల్లో నియామకాల కోసం 2017 ఫిబ్రవరి 21న నిర్వహించిన పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేయాలని స్ట్ఫా సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) నిర్ణయించింది. లీకేజీలపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ భాజపా ఎంపీ మనోజ్ తివారీ నేతృత్వంలో ఆందోళనకారులు ఎస్సెస్సీ ఛైర్మన్ అషిమ్ ఖురానాకు వినతిపత్రం సమర్పించారు.

03/05/2018 - 03:46

బెంగళూరు, మార్చి 4: ఈశాన్య భారత ప్రజలు విద్వేష రాజకీయాలను తిరస్కరించడం ద్వారా భాజపాకు ఏకగ్రీవంగా ఓటు చేసి అధికారాన్ని అప్పగించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

03/05/2018 - 02:37

న్యూఢిల్లీ, మార్చి 4: సోమవారం నుండి తిరిగి ప్రారంభమవుతున్న పార్లమెంటు బడ్జెట్ మలి సమావేశాల్లో పీఎన్‌బీ కుంభకోణాన్ని లేవనెత్తటం ద్వారా ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని కడిగిపారేసేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతుంటే, అధికార పక్షం మాత్రం ఈశాన్య రాష్ట్రాల్లో సాధించిన ఘనవిజయంతో ప్రతిపక్షాలను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఎత్తులు వేస్తోంది.

03/04/2018 - 04:02

న్యూఢిల్లీ, మార్చి 3: ప్రధాని నరేంద్ర మోదీ, వియత్నాం అధ్యక్షుడు ట్రన్ డాయ్ క్వాంగ్ రెండు దేశాల మధ్య కీలకమైన రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారంపై చర్చలు జరిపారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ వద్ద ప్రధాని, వియత్నాం అధ్యక్షుడిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శనివారం జరిపిన చర్చల్లో అణువిద్యుత్ రంగం వీరి చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది.

03/04/2018 - 03:55

న్యూఢిల్లీ, మార్చి 3: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టివేశారు. ఈ 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం బోఫోర్స్ తరహాలో మసకబారుతుందన్న అభియోగాలను ఆమె తిరస్కరించారు. బోఫోర్స్ శతఘు్నల ఒప్పందానికి, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి మధ్య ఏ రకమైన పోలికా లేదని తేల్చి చెప్పారు.

Pages