S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/06/2018 - 01:34

న్యూఢిల్లీ, మార్చి 5: ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దీంతో జైట్లీ, తెదేపా నేతల మధ్య సోమవారం రాత్రి ఏడు గంటలకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి.

03/06/2018 - 01:32

న్యూఢిల్లీ, మార్చి 5: ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌తో తెలుగుదేశం, ముస్లిం రిజర్వేషన్ల డిమాండ్‌తో తెలంగాణ రాష్ట్ర సమితిల నిరసనలతో పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. తెదేపా, తెరాసలతోపాటు కాంగ్రెస్, ఇతర విపక్షాల సభ్యలూ ఉభయ సభల పోడియంలోకి వచ్చి పెద్దపెట్టున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలివ్వటంతో సోమవారం లోక్‌సభ, రాజ్యసభ స్తంభించాయి.

03/05/2018 - 16:39

న్యూఢిల్లీ :విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి, పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ ప్రధాని నరేంద్ర మోదీ బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ ట్వీట్ చేశారు. చిరునవ్వుతో, విశ్వాసంతో ఈ పరీక్షలు రాయాలని విద్యార్థులకు ప్రధాని సూచించారు. ఏదైనా పని చేస్తానని పూనుకుంటే.. సాధించే వరకు వదిలిపెట్టొద్దని విద్యార్థులకు మోదీ సూచించారు.

03/05/2018 - 16:24

న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను శాఖ రూ.3,200 కోట్ల విలువైన కుంభకోణాన్ని గుర్తించింది.కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తుల టీడీఎస్ (మూలం వద్ద పన్ను తగ్గింపు) అకౌంట్లలో అక్రమాలను కనిపెట్టింది. 447 కంపెనీలు తమ ఉద్యోగుల నుంచి పన్నును వసూలు చేసి, తమ సొంత వ్యాపారాల్లోకి మళ్ళించినట్లు తెలుసుకుంది. ఆదాయపు పన్ను శాఖలోని టీడీఎస్ విభాగం ఈ దర్యాప్తును నిర్వహించింది.

03/05/2018 - 16:22

న్యూఢిల్లీ : త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ర్టాల ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ర్టాల్లో తమ పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని విధాలా కృషి చేశామన్నారు. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేక కృతజ్ఞతలు రాహుల్ తెలిపారు. త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ గెలిచిన సంగతి తెలిసిందే. మేఘాలయలో హంగ్ ఏర్పడింది.

03/05/2018 - 16:15

న్యూఢిల్లీ : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ముంబై వెళ్ళి, వైద్య పరీక్షలు చేయించుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. వైద్యుల సలహా మేరకు అవసరమైతే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందని పేర్కొంది. ఈ స్టేట్‌మెంట్‌ను సీఎం వ్యక్తిగత కార్యదర్శి రూపేశ్ కామత్ విడుదల చేశారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో స్వల్ప చికిత్స అనంతరం , ఆయన అమెరికా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది.

03/05/2018 - 16:10

న్యూఢిల్లీ: స్ట్ఫా సెలక్షన్ ప్రశ్నాపత్రల కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు చేస్తుందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుందని ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. విద్యార్థులు తమ ఆందోళన విరమించాలని మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ కూడా ట్వీట్ చేశారు.

03/05/2018 - 16:09

న్యూఢిల్లీ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కోరుతూ ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన ఈరోజు సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీతోనూ, బీజేపీ అద్యక్షుడు అమిత్‌షాతో సమావేశమవుతారు.

03/05/2018 - 16:08

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేస్తున్న వైసీపీ ఎంపీలను పోలీసులు అరెస్టు చేశారు. మేకపాటి, మిధున్‌రెడ్డి తదితర నాయకులందరిని అరెస్టు చేశారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

03/05/2018 - 16:08

న్యూఢిల్లీ: రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. వివిధ అంశాలపై సభ్యులు ఆందోళన చేయటంతో సభను రేపటికి వాయిదా వేయటం జరిగింది. ఏపీకి న్యాయం చేయాలంటూ ప్లకార్డుల ప్రదర్శన. విభజన హామీలు అమలుచేయాలని టిడిపి సభ్యుల ఆందోళన. సభలో ఎంపీల నిరసనలతో సభా కార్యక్రమాలు కొనసాగలేదు. ఒకానొక సందర్భంలో రాజ్యసభ చైర్మన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆందోళన చేస్తున్న కేవీపీ, టీడీపీ ఎంపీలను బుజ్జగించి పంపటం జరిగింది.

Pages