S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/23/2017 - 01:08

గాంధీనగర్, డిసెంబర్ 22: గుజరాత్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల వరకూ సీఎంగా వ్యవహరించిన విజయ్ రూపానీకే మళ్లీ సీఎం పదవిని కట్టబెట్టాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. మొన్నటి వరకూ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నితిన్ పటేల్‌కు మరలా అదే పదవి దక్కింది.

12/22/2017 - 04:21

ద 2007 మే: కేంద్ర టెలికాం మంత్రిగా ఏ రాజా బాధ్యతల స్వీకారం
ద 2007 ఆగస్టు: 2జీ స్పెక్ట్రం లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ మొదలు
ద 2007 సెప్టెంబర్ 25: దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 1 తేదీని నిర్ణయిస్తూ టెలికాం శాఖ ప్రెస్‌నోట్
ద 2007 అక్టోబర్ 1: 46 కంపెనీల నుంచి టెలికాం శాఖకు 575 దరఖాస్తులు
ద 2007 నవంబర్ 2: లైసెన్సులు సజావుగా కేటాయించాలంటూ రాజాకు ప్రధాని మన్మోహన్ లేఖ

12/22/2017 - 04:16

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: తెలంగాణ, మహారాష్టల్రో భూ జలాల పరిరక్షణ రంగంలో మంచి ఫలితాలను సాధించాయని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కితాబిచ్చారు. గడ్కరీ గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భూ జలాల పరిరక్షణ అంశంపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల మూలంగా భూ జలాల పరిరక్షణ బాగా జరిగిందన్నారు.

12/22/2017 - 04:01

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: వైవాహిక జీవితంలో వివాదాలకు సంబంధించి ఎన్‌ఆర్‌ఐ భర్తలపై ఫిర్యాదుల సంఖ్య పెరుగుతోందని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ గురువారం రాజ్యసభలో చెప్పారు. ప్రవాస భారతీయులైన భర్తలపై వారి జీవిత భాగస్వాములు చేస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వం అన్ని కోణాల్లో దృష్టి సారిస్తోందన్నారు.

12/22/2017 - 04:00

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: అఖిల భారత సర్వీసులకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రైవేటు సంస్థల్లో డిప్యుటేషన్‌పై పనిచేయించాలని పార్లమెంటు స్థాయి సంఘం సిఫార్సు చేసింది. పాలనాపరమైన అనుభవం, నైపుణ్యం పెంపొందించుకునేందుకు ఇది ఉపకరిస్తుందని కమిటీ అభిప్రాయపడింది.

12/22/2017 - 04:00

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం మొదటిసారి గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరీ నదుల అనుసంధాన కార్యక్రమం చేపట్టిందని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. గడ్కరీ గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భూగర్భ జలాల పరిరక్షణకు సంబంధించిన ఒక ప్రశ్నకు బదులిస్తూ ఈవిషయం చెప్పారు.

12/22/2017 - 03:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ట్రిపుల్ తలాక్ బిల్లు శుక్రవారం పార్లమెంటులో చర్చకు రానుంది. ముస్లిం మహిళల వైవాహిక జీవితానికి రక్షణ కల్పిస్తూ, అకారణంగా భర్త విడాకులు ఇవ్వడాన్ని నిరోధిస్తూ కేంద్రం ముమ్మారు తలాక్ బిల్లును రూపొందించింది.

12/22/2017 - 03:59

జయలలిత ప్రాతినిధ్యం వహించిన తమిళనాడులోని ఆర్‌కెనగర్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక గురువారం ప్రశాంతంగా జరిగింది. ఓ పోలింగ్ బూత్ వద్ద ఓటేసేందుకు బారులు తీరిన జనం

12/22/2017 - 03:57

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: దేశ రాజధానిలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లోని అధికారులు రెండుగా చీలీపోయారు. ఢిల్లీలో పనిచేసే ఉద్యోగులు దశిత, అగ్రవర్ణాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నెల 17న తనకు పదోన్నతి దక్కకుండా కొందరు అధికారులు అడ్డుకున్నారని భవన్‌లోని దళిత ఉద్యోగి ఆనందరావు ఆవేదన వ్యక్తం చేశారు.

12/22/2017 - 03:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చేసేందుకు ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిఖ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, కాగ్ అధినేత వినోద్ రాయ్, ఇతర బీజేపీ నాయకులు చేసిన కుట్రను 2జి కుంభకోణంపై సీబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు బైటపెట్టిందని కాంగ్రెస్ ఆరోపించింది.

Pages