S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/22/2017 - 03:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు గురువారం రాజ్యసభలో తీవ్రనిరాశ ఎదురైంది. రాజ్యసభలో తొలిసారి మాట్లాడాలనుకున్న సచిన్‌కు ప్రతిపక్షాల గందరగోళం మధ్య కుదర్లేదు. క్రీడామైదానంలో వీరవిహారం చేసే టెండూల్కర్ పెద్దల సభలో గోల్డెన్ డక్ అయ్యారు. 2012లో సచిన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. అడపాదడపా తప్ప సభకు హాజరుకారంటూ సచిన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.

12/22/2017 - 03:51

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యులు గురువారం వరుసగా ఐదోరోజు కూడా రాజ్యసభను స్తంభింపజేశారు. లోక్‌సభలో గంటన్నర సేపు గొడవ చేసిన అనంతరం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా సభనుంచి వాకౌట్ చేశారు.

12/22/2017 - 04:02

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో మాజీ టెలికం మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపి కనిమొళి సహా నిందితులంతా నిర్దోషులని సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును ‘నిజాయితీకి ధ్రువపత్రం’గా కాంగ్రెస్ పార్టీ భావించరాదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పుపై తాను ఏమీ మాట్లాడడని, 2జీ కేటాయింపుల తీరుపైనే తాను వ్యాఖ్యానిస్తానని అన్నారు.

12/22/2017 - 03:18

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ప్రముఖ తెలుగు రచయిత దేవీప్రియ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన రచించిన ‘గాలి రంగు’ కవితా సంపుటికి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. కేంద్ర సాహిత్య అకాడమీ ఏటా ఇస్తున్న అవార్డులను ఢిల్లీలో గురువారం ప్రకటించింది. మొత్తం 24 భాషల్లో ఉత్తమ రచనలను పురస్కారాలకు ఎంపిక చేసింది.

12/22/2017 - 03:16

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: సంచలనాత్మక 2జీ స్పెక్ట్రం లైసెన్స్‌ల కేటాయింపు కుంభకోణంలో 19 మంది నిందితులను సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడంపై సవాల్ చేస్తామని ఈడీ ప్రకటించింది. దీనికి సంబంధించి మనీలాండరింగ్ అత్యంత తీవ్రమైన నేరమని పేర్కొన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాలు స్వతంత్ర దర్యాప్తుద్వారా తాము సేకరించిన వివరాలను కోర్టు పారేయజాలదని వ్యాఖ్యానించాయి.

12/22/2017 - 03:16

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: దేశ వ్యాప్తంగా రాజకీయ అలజడి రేకెత్తించిన 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణం కేసులో సీబీఐ కోర్టు గురువారం సంచలన తీర్పును వెలువరించింది. మాజీ టెలికం మంత్రి ఏ రాజా, రాజ్యసభ సభ్యురాలు కనిమోళి సహా మొత్తం 19 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.

12/22/2017 - 01:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ పేర్కొన్నారు. గురువారం పార్లమెంట్‌లో ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు నేతృత్వంలో విభజన చట్టంలో పేర్కొన్న ఉక్కు పరిశ్రమల ఏర్పాటు అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

12/22/2017 - 01:53

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయాలను వెంటనే ఏర్పాటు చేయాలని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్లమెంట్‌లో ప్రస్తావించారు. రాయలసీమలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

12/22/2017 - 00:46

సూళ్లూరుపేట, డిసెంబర్ 21: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సన్నాహం చేస్తోంది. నాలుగు నెలల విరామం అనంతరం పిఎస్‌ఎల్‌వి ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టుతున్నట్లు ఇస్రో వర్గాల సమాచారం. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుంచి వచ్చే ఏడాది జనవరి 10న పిఎస్‌ఎల్‌వి-సి 40 రాకెట్ ప్రయోగించేందుకు శాస్తవ్రేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.

12/22/2017 - 00:38

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: నల్గొండ జిల్లాలోని కొండమల్లెపల్లిలో హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ (సిపిసిఆర్‌ఐ) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెంటర్ ఏర్పాటుపై సిపిసిఆర్‌ఐ ఒక ప్రకటన విడుదల చేసిందని టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వెల్లడించారు.

Pages