S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/25/2017 - 02:59

లక్నో, డిసెంబర్ 24: ట్రిపుల్ తలాక్‌ను రద్దుచేయడానికి ఉద్దేశించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపిఎల్‌వి) ఆదివారం ఇక్కడ డిమాండ్ చేసింది.

12/25/2017 - 02:58

ముంబయి, డిసెంబర్ 24: అన్నివిధాలా సమస్యలమయం, ఒత్తిడిమయంగా మారిన ఆధునిక పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే యోగా ఒక్కటే సరైన మార్గమని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు ఆదివారం నాడిక్కడ స్పష్టం చేశారు. యోగా చేయడం అన్నది కేవలం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉద్దేశించిందే తప్ప, ఇందులో మతపరమైన ఉద్దేశంకాని, భావనకానీ ఏమీ లేదని ఉద్ఘాటించారు.

12/25/2017 - 02:19

చెన్నై, డిసెంబర్ 24: దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్‌కె నగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం అధికార అన్నాడిఎంకెకు ఆశనిపాతంలా పరిణమించింది. ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అన్నాడిఎంకె బహిష్కృత నాయకుడు టిటివి దినకరన్ తన సమీప ప్రత్యర్థిగా దాదాపు 40వేల ఓట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించారు.

12/25/2017 - 01:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: పీక్ సీజన్,పండుగ సమయాలలో అదనపు చార్జీలను వసూలు చేయడంతో సహా,రద్దీ తక్కువ ఉండే రైల్లు,మార్గాలలలో ప్రయాణికులకు రాయితీలు ఇచ్చేందకు రైల్వేమంత్రిత్వాశాఖ కసరత్తు మొదలుపెట్టింది.విమానయానశాఖ తరహాలో ఈ మేరకు డైనమిక్ ప్రైసింగ్ విధానం రైలేశాఖలో ప్రవేశపెట్టల్సిన అవసరం ఉందని సీనియర్ రైల్వే అధికారులు,బోర్డు సభ్యులతో ఇటివల రైల్వేమంత్రి పియూష్ గోయల్ సమావేశం అయిన సందర్భంగా ఈ ప్రతిపాదనపై ఒ

12/24/2017 - 03:49

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఆర్‌జేడీ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతిపైన, ఆమె భర్తపైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ అభియోగంపై చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రత్యేక న్యాయస్థానంలో జడ్జి ఎన్‌కే మల్హోత్రా ఎదుట ఈడీ తరఫున హాజరైన న్యాయవాది నితీశ్ రాణా ఈ చార్జిషీట్‌ను శనివారం దాఖలు చేశారు.

12/24/2017 - 03:41

నిజామాబాద్, డిసెంబర్ 23: తిరుపతి - నిజామాబాద్ మధ్య రాకపోకలు సాగించే రాయలసీమ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి శివారులో శనివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ఈ ప్రమాదం బారి నుండి సురక్షితంగా బయటపడగలిగారు.

12/24/2017 - 01:46

బిహార్‌లో 950 కోట్ల రూపాయల దాణా కుంభకోణం 1996లో వెలుగు చూసింది. 2000లో బిహార్ నుంచి కొత్తగా ఏర్పడిన ఝార్ఖండ్ రాష్ట్రానికి 39 దాణా కేసులను బదిలీ చేశారు (మొత్తం దాఖలైన కేసులు 61). ఈ కుంభకోణానికి సంబంధించి 20 ట్రక్కుల్లో డాక్యుమెంట్లు సిబిఐ కోర్టుకు తరలించారు.

12/24/2017 - 01:45

రాంచి, డిసెంబర్ 23: దాణా కుంభకోణం కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని ఆర్‌జెడి సీనియర్ నాయకుడు రఘువంశ్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ కేసులో ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు దోషిగా ప్రకటించిన విషయం విదితమే. తీర్పు వెలువడిన అనంతరం కోర్టు బయట రఘువంశ ప్రసాద్ విలేఖరులతో మాట్లాడుతూ ఈ తీర్పుపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.

12/24/2017 - 01:44

జమ్ము, డిసెంబర్ 23: కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ మరోసారి తూట్లు పొడిచింది. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా కెరి సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్ద భారత సైనికులపై పాక్ బలగాలు శనివారం కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆర్మీ మేజర్ సహా ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగిన ఈ కాల్పుల్లో మరొకరు గాయపడినట్టు భారత సైనికదళం అధికారి ధ్రువీకరించారు.

12/24/2017 - 01:43

అమృత్‌సర్, డిసెంబర్ 23: భారత-పాక్ సరిహద్దు నుంచి అక్రమ చొరబాటుకు యత్నించిన ఓ వ్యక్తిని బీఎస్‌ఎఫ్ సైనికులు హతమార్చారు. భారత భూ భాగంలోని అజ్నాలా వద్ద శనివారం ఉదయం పాక్‌కు చెందిన చొరబాటు దారుడు ప్రవేశిస్తుండగా బిఎస్‌ఎఫ్ 70వ బెటాలియన్ సైనికులు కాల్పులు జరిపారు. 65 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి సైనికులు చేసిన హెచ్చరికలను ఖాతరు చేయలేదు. సైనికులు వారిస్తున్నప్పటికీ ఆ వ్యక్తి చొరబాటుకు యత్నించాడు.

Pages