S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/23/2017 - 02:40

చెన్నై, డిసెంబర్ 22: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై వాస్తవాలు తెలుసుకునేందుకు ఏర్పాటైన విచారణ సంఘం అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి వికే శశికళకు, అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ రెడ్డికి సమన్లు జారీ చేసింది. జయలలిత మరణంపై అనేక సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో నిజానిజాలు తెలుసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం విచారణ సంఘాన్ని నియమించిన సంగతి తెలిసిందే.

12/23/2017 - 02:39

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో నడుస్తున్న ‘జాతీయ పోషకాహార పథకం’ ద్వారా లబ్ధి పొందుతున్న పిల్లలకు ‘ఆధార్’ నమోదు తప్పనిసరి అని కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ సహాయ మంత్రి వీరేంద్ర కుమార్ లోక్‌సభలో తెలిపారు. ప్రభుత్వం అందజేసే రాయితీలు, సేవలు, ఇతర ప్రయోజనాలకు ‘ఆధార్’ కార్డు కచ్చితమైన గుర్తింపులా పనిచేస్తుందన్నారు.

12/23/2017 - 02:46

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: నిందితులంతా నిర్దోషులని తేలిన 2జీ స్పెక్ట్రమ్ కేసులో సిబిఐ పరిశోధన అంతా గజిబిజిగా సాగిందని, ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేశారా? అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రశ్నించింది. 2జీ కేసులో కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, డిఎంకే ఎంపీ కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా సిబిఐ ప్రత్యేక కోర్టు ప్రకటించడంతో ప్రజల్లో అనేక సందేహాలు కలుగుతున్నాయని ‘ఆప్’ నేతలు పేర్కొన్నారు.

12/23/2017 - 02:37

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ కాంగ్రెస్ సభ్యులు చేసిన నినాదాలతో శుక్రవారం కూడా రాజ్యసభ కార్యకలాపాలు కొనసాగలేదు. మన్మోహన్ సింగ్‌కు క్షమాపణలు చెప్పే అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య ఒక అంగీకారం కుదరనంత వరకు రాజ్యసభను వాయిదా వేయటం మంచిదని ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు.

12/23/2017 - 02:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: తెలంగాణలో అతిపెద్ద గిరిజన పండగ మేడారం జాతరకు జాతీయ గుర్తింపునివ్వాలని తెలంగాణ బీజేపీ శాఖ కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది.శుక్రవారం నాడు తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు కె.

12/23/2017 - 02:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోయ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చడం నిజమైన గిరిజనులకు అన్యాయం చేయాడమేనని ఆదివాసీ అధికార్ మంచ్ (ఏఆర్‌ఎం) మండిపడింది. ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీని ఆ పదవి నుంచి వెంటనే తొలగించాలని మంచ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బోయలను ఎస్టీగా చేర్చడంపై జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఏఆర్‌ఎం శుక్రవారం ఫిర్యాదు చేసింది.

12/23/2017 - 01:48

జైపూర్ (రాజస్థాన్), డిసెంబర్ 22: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు పాకిస్తాన్ వత్తాసు పలకడం మానివేస్తేనే ఆ దేశంతో శాంతిచర్చలకు అవకాశం ఉంటుందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తేల్చిచెప్పారు. అయితే, పాకిస్తాన్ వైఖరి చూస్తుంటే ఆ దేశం నిజంగా శాంతి చర్చలను కోరుకుంటున్నట్లు లేదన్నారు.

12/23/2017 - 01:39

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: బీజేపీ అబద్ధాల పుట్ట. ఆ పార్టీ పునాదులే అబద్ధాలపై నిలబడి ఉన్నాయంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెద్దఎత్తున దాడికి దిగారు. కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై పెద్దఎత్తున మాటల దాడికి దిగారు.

12/23/2017 - 01:10

ముంబయి, డిసెంబర్ 22: కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు పెద్ద ఊరట లభించింది. ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణంలో ఆయనను ప్రాసెక్యూట్ చేయాల్సిందిగా మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్‌రావు గత ఏడాది ఇచ్చిన ఆదేశాలు చెల్లబోవని బాంబే హైకోర్టు శుక్రవారం తీర్పు ప్రకటించింది.

12/23/2017 - 01:09

జైపూర్ (రాజస్థాన్) , డిసెంబర్ 22: భారత-పాక్ సరిహద్దులోని థార్ ఎడారిలో సదరన్ కమాండ్ ‘హమేషా విజరుూ’ పేరిట నిర్వహించిన సైనిక విన్యాసాలను భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ శుక్రవారం వీక్షించారు. మన సైనిక సామర్థ్యాన్ని శత్రుదేశానికి తెలిసే విధంగా, నిరంతర అప్రమత్తతను చాటేందుకు ఈ విన్యాసాలను నిర్వహించారు. అధునాతన ఆయుధాలను వినియోగించడంలో మన సైనికులు ముందంజలో ఉన్నారని రావత్ ప్రశంసించారు.

Pages