S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/25/2017 - 03:15

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: పెద్దనోట్లను రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఆందోళన నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నాయి. పెద్దనోట్లను రద్దుచేసి నవంబరు 8నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజు ‘బ్లాక్ డే’గా నిర్వహించాలని విపక్షాలు నిర్ణయించాయి. జిఎస్‌టి అమలు, నోట్ల రద్దు వైఫల్యాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలకు విపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి.

10/25/2017 - 03:11

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సరుూద్ సలాహుద్దీన్‌కు ఎన్‌ఐఏ షాక్ ఇచ్చింది. సలాహుద్దీన్ కుమారుడు సరుూద్ షాహిద్ యూసుఫ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. 2011నాటి ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోతహిస్తూ, నిధులు సమీకరించిన కేసులో యూసుఫ్ నిందితుడిగా ఉన్నాడు. 42 ఏళ్ల షాహిద్ జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖలో జూనియర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు.

10/25/2017 - 03:09

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: కాశ్మీర్ సమస్యకు రాజకీయ పరిష్కారం కనుగొనాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నమ్మశక్యంగా లేదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. రాజకీయ, సామాజిక, ఇతర వర్గాలతో చర్చలు జరిపి పరిష్కార మార్గం సూచించేందుకు ప్రత్యేక మధ్యవర్తిని నియమించటం పబ్లిసిటీ స్టంట్‌గానే అభివర్ణించింది.

10/25/2017 - 03:09

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులపై కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించనుంది. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టిన నేపథ్యంలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షత ఈ సమావేశం జరగనుంది.

10/25/2017 - 03:06

ఉన్నావ్ (యూపీ), అక్టోబర్ 24: భారత వాయుసేనకు చెందిన యుద్ధ, సైనిక రవాణా విమానాలు మంగళవారం ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ హైవేపై దిగి సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి. ఒకదాని వెంట ఒకటిగా సుఖోయ్, మిరేజ్ విమానాలే కాకుండా అత్యంత భారీ సైనిక రవాణా విమానం సి-130జె సైతం ఎక్స్‌ప్రెస్ హైవేపై దిగి వాయుసేన సత్తా చాటింది.

10/25/2017 - 03:02

న్యూఢిల్లీ, అక్టోబరు 24: తెలుగు రాష్ట్రాల్లోని న్యాయమూర్తుల, న్యాయాధికారుల నియామకాలపై కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను ఉమ్మడి హైకోర్టు మార్పులు చేసిందని తెలంగాణ జడ్జీల అసోషియేషన్ సుప్రీం కోర్టుకు తెలిపింది. సుప్రీం కోర్టులో దాఖలైన ఈ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నాజీర్‌లతో కూడిన ధర్మాసనం ముందు మంగళవారం సుదీర్ఘ వాదనలు జరిగాయి.

10/25/2017 - 03:02

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)ను గబ్బర్‌సింగ్ పన్నుగా అభివర్ణించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం మరోసారి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ ప్రజలను అన్ని రకాలుగా ఇక్కట్లపాలుచేసిన జిఎస్‌టి ‘షోలే’ విలన్ గబ్బర్‌సింగ్ టాక్స్ అంటూ సోమవారం విరుచుకుపడ్డారు.

10/25/2017 - 02:26

ఉత్తరాదిలో ఘనంగా జరుపుకునే ఛాత్ పండుగకు వెళ్లే భక్తులతో పాట్నాలోని పర్సాబజార్ రైల్వేస్టేషన్‌లో కిటకిటలాడుతున్న ఓ రైలు. దీపావళి తర్వాత వచ్చే ఈ పండుగ ఈ నెల 27వరకు జరుగుతుంది. బుధవారం ప్రధాన పండుగ కావడంతో స్వగ్రామాలకు వెళ్లేందుకు సీట్లు దొరక్కపోవడంతో ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తున్న దృశ్యం.

10/25/2017 - 01:57

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: తెలంగాణలో చేపట్టిన ఏఐబిపి నీటి ప్రాజెక్టుల బకాయిలు 500 కోట్లు తక్షణం విడుదల చేయాలని కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీని కోరామని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నితిన్ గడ్కరీ మంగళవారం హరీశ్‌తో కలిసి తెలంగాణలో ఏఐబిపి కింద చేపట్టిన 11 ప్రాజెక్టు నిర్మాణ పనులను సమీక్షించారు. ఈ సందర్భంలోనే పెండింగ్ పెట్టిన 500 కోట్లు వెంటనే విడుదల చేయాలని గడ్కరీని హరీశ్ కోరారు.

10/25/2017 - 01:54

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: అత్యంత వివాదాస్పదంగా మారిన గుజరాత్ శాసనసభ ఎన్నికల షెడ్యూలను కేంద్ర ఎన్నికల సంఘం నేడు ప్రకటించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి అచల్ కుమార్ జ్యోతి ఎన్నికల షెడ్యూలు ప్రకటించగానే, ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Pages