S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/23/2017 - 03:06

శ్రీనగర్, అక్టోబర్ 22: కాశ్మీర్‌లో ఉగ్రవాదులపై భారత బలగాలు ఆధిపత్యం సాధించాయని ప్రభుత్వం ఒకపక్క ప్రకటనలు చేస్తుంటే పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. రాజకీయ కార్యకర్తలు, పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరుపుతున్న వరుస దాడులే ఇందుకు తాజా ఉదాహరణ. 24 గంటల వ్యవధిలో అధికార పిడిపికి చెందిన ఇద్దరు శాసనసభ్యుల ఇళ్లపై ఉగ్రవాదులు దాడులు జరిపి బలగాలకు సవాలు విసిరారు.

10/23/2017 - 03:05

శ్రీనగర్, అక్టోబర్ 22: కుప్వారా జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించాడు. కూంబింగ్ ఆపరేషన్‌లో భాగంగా తనిఖీలు జరుపుతున్న భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులకు దారితీసింది. హంద్వారా ప్రాంతంలోని లాంగెట్ పట్టణంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది మరణించాడనీ, అతన్ని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

10/23/2017 - 03:21

ఘోఘా (గుజరాత్), అక్టోబర్ 22: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. గుజరాత్‌లోని ఘోఘాలో రోల్-ఆన్ రోల్-ఆఫ్(రోరో) ఫెర్రీ సర్వీసులను ఆదివారం ప్రారంభించిన మోదీ గత యుపిఏ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. గుజరాత్ అభివృద్ధిని యుపిఏ ప్రభుత్వం అడ్డుకుందని ఆయన విమర్శించారు. తాను ముఖ్యమంత్రిగా ప్రారంభించిన ప్రాజెక్టులకు వివిధ సాంకేతిక కారణాలు చూపి అడ్డుకున్నారని ఆయన అన్నారు.

10/22/2017 - 02:54

ముంబయి, అక్టోబర్ 21: మహారాష్టల్రోని సంగ్లీ జిల్లాలో ట్రక్కు బోల్తాపడిన సంఘటనలో పది మంది మృతిచెందగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్ర ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సు సౌకర్యం లేకపోవడంతో కొంతమంది కూలీలు రాతి స్లాబ్‌ల లోడ్‌తో వెళుతున్న ట్రక్‌పై ప్రయాణిస్తున్నారని, అందుకే బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. అయితే దీనిపై ఎటువంటి అధికారిక వివరణ వెలువడలేదు.

10/22/2017 - 02:50

బెంగళూరు, అక్టోబర్ 21: కర్నాటకలో మరో వివాదం రాజుకోనుంది. వచ్చేనెల 10న జరగాల్సిన టిప్పూ సుల్తాన్ జయంతి సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య ఇప్పుడే వేడి పుట్టింది. జయంతి కార్యక్రమానికి ఆహ్వానితుల విషయంలో అధికార కాంగ్రెస్, బిజెపి మధ్య వివాదం మొదలైంది. టిప్పూ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఓ ఆహ్వాన పత్రం వేసింది.

10/22/2017 - 02:49

హైదరాబాద్, అక్టోబర్ 21: టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని ఎవరూ వ్యతిరేకించరాదని ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు సొంత పార్టీ నేతలను కోరారు. రేవంత్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ సర్దుకుని పోవాలని ఆయన అన్నారు. తెలంగాణలో టిడిపి లేదు కాబట్టి తమ పార్టీలో చేరాల్సిందిగా తాను రేవంత్‌ను కోరుతున్నానని చెప్పారు.

10/22/2017 - 02:48

లక్నో, అక్టోబర్ 21: విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాలకు అందజేసే ఎక్స్‌గ్రేషియాను రెట్టింపు చేస్తున్నట్లు యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ప్రకటించారు. గతంలో ఈ మొత్తం 25 లక్షలు మాత్రమే ఉండేది. మృతుని కుటుంబానికిచ్చే 20 లక్షలను 40 లక్షలకు పెంచడంతోపాటు అతని తల్లిదండ్రులకు ఇచ్చే ఐదు లక్షలను పది లక్షలకు పెంచుతున్నట్లు ఆదిత్యనాథ్ వివరించారు.

10/22/2017 - 02:46

ఉత్తర భారతంలో శనివారంనాడు ‘్భయ్ దూజ్’ను ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం మొదలైన రెండోరోజున తమ సోదరుల నుదుట తిలకం దిద్ది శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయతీ. ఈ సందర్భంగా మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న తమ సోదరులకు శుభాకాంక్షలు తెలిపేందుకు బారులుతీరిన సోదరీమణులు

10/22/2017 - 02:44

ముంబయి, అక్టోబర్ 21: పదహారేళ్ల బాలికను ఓ యువకుడు అకారణంగా ముక్కు మీద పదే పదే కొట్టిన సంఘటన ముంబయిలోని ఆదర్శనగర్‌లో చోటుచేసుకుంది. ఈ నెల 17 జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను కొట్టిన దృశ్యం సిసిటివిలో రికార్డు కావడంతో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో అదే రోజు హాజరు పరిచారు.

10/22/2017 - 02:43

మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సోదరుడు శుక్రవారం కన్నుమూశారు.
పశ్చిమ బెంగాల్ బీర్‌భూమ్ జిల్లాలోని బోల్‌పూర్‌లో నివాసముండే
పిజుష్ ముఖోపాధ్యాయ ఇంటికి శనివారం చేరుకున్న ప్రణబ్

Pages