S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/25/2017 - 02:08

రోడ్డుమీద విమానం దిగడం అంటేనే పెద్ద సంభ్రమాశ్చర్యం. అలాంటిది భారత వాయుసేన సైతం హెర్క్యులస్ అని ముద్దుగా పిలుచుకునే సి-130జె రవాణా విమానం ఇలా లక్నో ఎక్స్‌ప్రెస్ హైవేమీద దిగి సత్తా చాటింది. సంక్షోభ ప్రాంతాల్లో సహాయ సహకారాలు అందించాల్సి వచ్చినపుడు కనీసం 200మంది సైనికులను మోసుకెళ్లగలిగే ఈ భారీ లోహ విహంగాన్ని అత్యంత సులువుగా హైవేపై దింపేసిన వైనం వాయుసేన తెగువను, చాకచక్యాన్ని చాటింది.

10/25/2017 - 03:19

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించడంపై మరింత స్థిరంగా, కఠినంగా వ్యవహరించాలని భారత్-ఆఫ్గాన్ నిర్ణయించుకున్నాయి. ఒక్కరోజు భారత పర్యటనకు వచ్చిన ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనికి మంగళవారం హైద్రాబాద్ హౌస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామి అయిన భారత్‌తో ఆఫ్గాన్ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపింది.

10/25/2017 - 01:03

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: దేశ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయటం ద్వారా జిడిపి (స్థూల జాతీయ ఉత్పత్తి)ని పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మంగళవారం సాహసోపేత నిర్ణయాలు ప్రకటించింది. వివిధ రంగాల్లో వౌలి క వసతుల పెంపునకు 14 లక్షల కోట్ల రూపాయల పథకాలను ప్రకటించింది.

10/24/2017 - 04:15

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రానికి సూచించాలని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు అఖిల భారత మహిళా కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితదేవ్ నేతృత్వంలో మహిళ కాంగ్రెస్ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సేకరించిన 33లక్షల సంతకాలను వారు రాష్టప్రతికి అందజేశారు.

10/24/2017 - 03:09

ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో సోమవారం పర్యాటక దినోత్సవ ముగింపు వేడుకలను ఢంకా మోగించి ప్రారంభిస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. కేంద్ర టూరిజం మంత్రిత్వ శాఖ ఇతర శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు సోమవారం ముగిశాయ. ఈ సందర్భంగా కళాకారులు వివిధ ప్రదర్శనలు ఇచ్చారు

10/24/2017 - 03:06

అహ్మదాబాద్, అక్టోబర్ 23: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాష్ట్రంలో ప్రధాన ఓటు వర్గమైన పటీదార్ వ్యవహారం బిజెపికి తలపోట్లు తెచ్చిపెడుతోంది. పటేల్ వర్గాన్ని క్యాష్ చేసుకోవడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలు బూమరాంగ్ అవుతున్నాయి.

10/24/2017 - 03:04

గాంధీనగర్, అక్టోబర్ 23: పటీదార్ నేతలతో బేరసారాలు చేస్తున్నారంటూ బిజెపి చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అదేస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఇక్కడ జరిగిన నవసర్జన్ జనదేశ్ మహాసమ్మేళన్‌లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపైనా ఆయన విమర్శల దాడికి దిగారు. ‘గుజరాతీయుల గొంతు నొక్కలేరు, అలాగే కొనలేరు’ అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. ‘మీ దగ్గర బోలెడంత డబ్బు ఉండొచ్చు.

10/24/2017 - 02:59

భువనేశ్వర్, అక్టోబర్ 23: నవీన్ పట్నాయక్ సారథ్యంలోని ఒరిస్సా ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు ప్రకాష్ జావడేకర్ అన్నారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పలుకుబడి రాష్ట్రంలో తగ్గిందని, రాష్ట్రంలో బిజెపి రోజురోజుకూ పుంజుకుంటోందని స్పష్టం చేశారు.

10/24/2017 - 02:58

ఇటానగర్, అక్టోబర్ 23: విధుల నిర్వహణలో నిష్పాక్షికంగా ఉండాలని, రాజకీయ నాయకులు తెచ్చే వత్తిళ్లకు తలవంచి పనిచేయాల్సిన అవసరం లేదని యువ ఐఏఎస్‌లకు అరుణాచల్‌ప్రదేశ్ సిఎం పేమాఖండూ ఉద్బోధన చేశారు. 2016 రాష్ట్ర సివిల్ సర్వీస్ సిబ్బంది శిక్షణా శిబిరాన్ని సోమవారం నాడిక్కడ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన ఆయన ఏ అధికారి నిజాయితీకైనా ధైర్యం కొలమానం కావాలని, అదే అతడి వ్యక్తిత్వాన్ని నిలబెడుతుందని అన్నారు.

10/24/2017 - 02:57

లక్నో, అక్టోబర్ 23: గుజరాత్‌కు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్టు సవాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వెల్లడించారు. కాంగ్రెస్‌తో మిత్రత్వాన్ని కొనసాగిస్తూ, మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతామని సోమవారం స్పష్టం చేశారు. ‘బిజెపి వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చే ఆలోచన మాకు లేదు.

Pages