S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/22/2017 - 02:41

శ్రీనగర్, అక్టోబర్ 21: జమ్మూకాశ్మీర్‌లోని బారముల్లా జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద పాకిస్తాన్ జవాన్లు కాల్పులతో తెగబడ్డారు. కాల్పుల్లో ఒక ఆర్మీ పోర్టర్ చనిపోగా, బాలిక గాయపడింది. కమల్‌కోటే సెక్టార్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని సైనిక ప్రతినిధి వెల్లడించారు. పాక్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ఆయన అన్నారు. ఎల్‌ఓసి వద్ద పాక్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది.

10/22/2017 - 02:40

హైదరాబాద్, అక్టోబర్ 21: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికిందరాబాద్-దర్బంగా, హైదరాబాద్-రాక్సల్ మధ్య 52 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్ కుమార్ తెలిపారు. సికిందరాబాద్-దర్బంగా మధ్య 36, హైదరాబాద్-రాక్సల్ మధ్య 16 రైళ్లు నడుస్తాయి. సికిందరాబాద్-దర్బంగా ప్రత్యేక రైలు నెం.

10/22/2017 - 02:55

చెన్నై/న్యూఢిల్లీ, అక్టోబర్ 21: తమిళ హీరో విజయ్ నటించిన ‘మెర్సల్’ చిత్రంపై బిజెపి నేతలు చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ ఎండగట్టింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ సీనియర్ నేత పి చిదంబరం బిజెపి నేతల తీరును తప్పుబట్టారు. జిఎస్‌టిని విమర్శిస్తూ మెర్సల్‌లో డైలాగులున్నాయని తమిళ బిజెపి నాయకులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

10/22/2017 - 00:55

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: పర్యావరణ పరిరక్షణ అనేది కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, పౌర సమాజం, పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజల సమష్టి బాధ్యత అని, కేవలం సుప్రీంకోర్టు బాధ్యత కాదని అసోచామ్ పేర్కొంది.

10/21/2017 - 04:00

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అడుగులకు మడుగులు వత్తుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం తీవ్రంగా విమర్శించారు. గుజరాత్ ఎన్నికల తేదీలను ప్రకటించే అధికారం నరేంద్ర మోదీకి ధారదత్తం చేసిందంటూ ట్వీట్లు సంధించారు. ఇసిపై ధ్వజమెత్తుతూ ట్వీట్ల పరంపరం కొనసాగించారు.

10/21/2017 - 03:59

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: షా-జాదా (రాజుగారి పుత్రరత్నం) గురించి ఎవ్వరూ ఏం మాట్లాడొద్దు. నోరు మూసుకుందాం’ అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యంగ్య ట్వీట్లు సంచలనం రేపుతున్నాయి. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జే షా కంపెనీలో అకస్మాత్తుగా పెరిగిన పెట్టుబడుల వ్యవహారం నిగ్గుతేల్చాలంటూ కొంతకాలంగా కాంగ్రెస్ దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే.

10/21/2017 - 03:57

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: సుదూర ప్రాంతం ప్రయాణించే 500 రైళ్ల వేగం త్వరలో పెరగనుంది. ఆమేరకు ప్రయాణికుల సమయాన్ని కనీసం 2గంటల మేర ఆదా చేసేందుకు భారతీయ రైల్వే రంగం సిద్ధం చేసింది. ఈ ప్రణాళికను త్వరలోనే అమల్లోకి తేనున్నట్టు రైల్వే ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ కొత్త ప్రయాణ కాలాన్ని నవంబర్ నుంచి అమల్లోకి తేనున్నట్టు ఆయన వెల్లడించారు.

10/21/2017 - 03:55

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: భారత దేశం తన దౌత్యవేత్తల సంఖ్యను గణనీయంగా పెంచుకోవల్సిన అవసరంతోపాటు విదేశీ సర్వీసుల కోసం ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాల్సింది కూడా ఎంతో ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, విదేశీ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్ చైర్మన్ శశిథరూర్ ఉద్ఘాటించారు.

10/21/2017 - 03:53

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: జెడియు పార్టీ నుంచి ఎన్నికైన శరద్‌యాదవ్, అలీ అన్వర్ అన్సారీలకు పార్లమెంట్ సభ్యత్వ అనర్హత ఫిర్యాదుపై రాజ్యసభ సచివాలయం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. జెడియు మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్, ఎంపీ అన్సారీల రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరతూ ఉపరాష్టప్రతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు గతంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ నేతృత్వంలోని జెడియు నేతలు ఫిర్యాదు చేశారు.

10/21/2017 - 03:52

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: భారత్‌లో వాయు, జల ఇతర కాలుష్యాల కారణంగా మరణిస్తున్నవారి సంఖ్య ఎప్పటికప్పుడు తీవ్రమవుతోంది. 2015లో ఈకారణాల వల్ల రెండున్నర లక్షల మంది మరణించారని, ఈ కాలుష్య జాబితాలో మొదటి స్థానం భారత్‌దేనని తాజాగా వెల్లడైన ఓ అధ్యయనంలో స్పష్టమైంది.

Pages