S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/21/2019 - 05:02

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యంలో కాశ్మీర్ లోయలోని కాశ్మీరీ విద్యార్థులపై ఎలాంటి దాడులు జరగలేదని, వారు నిశ్చితంగా ఉండవచ్చునని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ స్పష్టం చేశారు. పుల్వామా సంఘటనలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారని, ఈ దాడి నేపథ్యంలో కాశ్మీర్ విద్యార్థులకు ఎలాంటి భయం అవసరం లేదని తెలిపారు.

02/21/2019 - 04:29

చిత్రం.. న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజనాథ్ సింగ్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్న భారత్‌లో అమెరికా రాయబారి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా

02/21/2019 - 04:28

భవానిపట్న (ఒడిసా), ఫిబ్రవరి 20: గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదం విషయంలో ‘బుజ్జగింపు విధానం’ అమలు చేయడం వల్లే ఉగ్రవాదం పెరిగిపోయిందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. కేవలం నరేంద్రమోదీ పాలనలో మాత్రమే భారత్ ప్రజలు సురక్షితంగా ఉండి శాంతిసౌభాగ్యాలతో జీవిస్తారని ఆయన ఉద్ఘాటించారు.

02/21/2019 - 04:26

న్యూఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీ) కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరైన వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా. ప్రియాంక గాంధీ భర్త, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి బావ అయిన వాద్రా మనీ లాండరింగ్, విదేశాల్లో అక్రమ ఆస్తులు కలిగి ఉండడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు

02/21/2019 - 04:24

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: పర్యావరణ పరిరక్షణకు ఆచరణాత్మక ఆలోచనలతో ముందుకు రావాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఇక్కడ పిలుపునిచ్చారు. సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా కాలుష్యకారకాలపై ఉద్గారాలను తగ్గించ వచ్చని ఆయన ఉద్ఘాటించారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో పర్యావరణానికి పెను సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు.

02/21/2019 - 04:22

భువనేశ్వర్, ఫిబ్రవరి 20: చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఒడిసాలో బుధవారం నుంచి నిర్వహించ తలపెట్టిన నిరవధిక ఆందోళనను చిట్‌ఫండ్ బాధితులు విరమించారు.

02/21/2019 - 04:21

ఇటానగర్, ఫిబ్రవరి 20: అరుణాచల్ ప్రదేశ్ 33వ ఆవిర్భావ దినోత్సవంలో ముఖ్యమంత్రి పేమా ఖండూ శాసన సభ్యులకు క్లాస్ తీసుకున్నారు. ‘రాష్ట్భ్రావృద్ధి కోసం శాసన సభ్యులు టీమ్‌వర్క్‌తో పనిచేయాలి. మీ మైండ్‌సెట్ మారకపోతే జనం మరచిపోతారు’అని సీఎం హెచ్చరించారు. అభివృద్ధికి సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాలని ఆయన పిలుపునిచ్చారు.

02/21/2019 - 04:20

లక్నో, ఫిబ్రవరి 20: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీలో కలసి తాము పనిచేసేందుకు సిద్ధం కావడంతో దీనిని సహించలేక భారతీయ జనతా పార్టీ ఆందోళన చెందుతోందని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి విమర్శించారు.

02/21/2019 - 04:20

చండీగఢ్, ఫిబ్రవరి 20: జలియన్‌వాలా బాగ్ మారణకాండ ఉదంతంపై బ్రిటిష్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కోరుతూ పంజాబ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. మంత్రి బ్రహ్మ మొహీందర్ ఈ ప్రతిపాదన చేస్తూ బిల్లును ప్రవేశ పెటాటరు. పార్టీలకు అతీతంగా అందరూ దీనిని సమర్థించాలని కోరారు.

02/21/2019 - 04:18

కోల్‌కతా, ఫిబ్రవరి 20: జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ఖండించిన పాపానికి ఓ విద్యార్థినికి ఫేస్‌బుక్‌లో నరకం చూపిస్తున్నారు. ఈనెల 15న పుల్వామాలో జైషే ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించారు. ఉగ్రవాదులు దుశ్చర్యలు 12వ తరగతి విద్యార్థినిని తీవ్రంగా కలచివేసింది. మారణకాండను ఖండిస్తూ, ఇలాంటి సంఘటనల వల్ల కశ్మీరీలు కష్టాలు పడుతున్నారని ఆమె పోస్టు చేసింది.

Pages