S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/20/2019 - 01:44

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో రూపకల్పనలో భాగంగా ‘అప్నే బాత్-రాహుల్ కే సాత్’ పేరిట ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఏడుగురు చిన్నతరహా పారిశ్రామికవేత్తలతో దేశ రాజధానిలోని ఏపీ భవన్‌లో ‘్భజన్ పే చర్చ’ కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రా భోజనం చేస్తూ పారిశ్రామికవేత్తల నుంచి రంగాల వారీగా ఉన్న సమస్యలు, పరిష్కారాలు, సలహాలు, అభిప్రాయాలను రాహుల్ తెలుసుకున్నారు.

02/20/2019 - 00:56

న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో గెలుపుపై దృష్టి సారించింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఢిల్లీలోని వార్‌రూమ్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ నేతృత్వంలో మంగళవారం జరిగిన సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.

02/20/2019 - 00:31

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ‘ఔర్ ఏక్‌బార్ మోదీ సర్కార్’ (మరోసారి మోదీ సర్కార్) అనే నినాదంతో లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ అధినాయకత్వం తమ లక్ష్య సాధన కోసం రాష్ట్రాల్లో పొత్తుల పరంపర కొనసాగిస్తోంది. సోమవారం మహారాష్టల్రో శివసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ మంగళవారం తమిళనాడులోని అన్నాడీఎంకేతో సీట్ల సర్దుబాటు చేసుకున్నది. ప్రతిపక్షాలతో పోలిస్తే పొత్తుల విషయంలో బీజేపీ వేగంగా ముందుకుపోతోంది.

02/20/2019 - 00:39

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉద్పన్నమవుతున్న వ్యర్థాలవల్ల స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న చర్యలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు ఆథారిటీని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఏన్జీటీ) ఆదేశించింది.

02/19/2019 - 16:41

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ క్యాంటీన్‌కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చారు. రాహుల్‌కి టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ స్వాగతం పలికారు. ఈనెల 22న తిరుపతిలో నిర్వహించనున్న కాంగ్రెస్ భరోసా యాత్రలో రాహుల్ పాల్గొననున్నారు.

02/19/2019 - 16:40

కోల్‌కతా: కోల్‌కతా సిటీ పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్‌ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈమేరకు ఆయనను సీఐడీ ఏడీజీ అండ్ డీఐజీగా పదోన్నతి కల్పించింది. ప్రస్తుతం అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీసు డైరెక్టర్ (శాంతిభద్రతలు)గా విధులు నిర్వహిస్తున్న అనూజ్ శర్మను కోల్‌కతా సీపీగా బదిలీ చేసింది.

02/19/2019 - 13:57

బెంగళూరు: కర్ణాటకలోని యెలహంక ఏయిర్‌బేస్‌లో ‘ఎయిరో ఇండియా-2019’ షో కోసం చేస్తున్న‌ రిహార్స‌ల్స్‌లో అప‌శ్రుతి చోటుచేసుకుంది. సూర్య‌కిర‌ణ్ ఏయిరోబాటిక్స్ టీమ్‌కు చెందిన రెండు జెట్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. ప్రమాదంలో ఓ పైలట్‌ ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు.ఘ‌ట‌న స‌మ‌యంలో ముగ్గురు పైల‌ట్లు జెట్ విమానాల్లో ఉన్న‌ట్లు స‌మాచారం. దుర్ఘటన జరిగిన ప్రాంతమంతా పొగమయమైంది.

02/19/2019 - 13:03

శ్రీన‌గ‌ర్ : ఎవ‌రైనా తుపాకీతో కనిపిస్తే వాళ్ల‌ను వెంట‌నే కాల్చేస్తామ‌ని ఇండియ‌న్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్‌ ఈ ఆదేశాలు జారీ చేసింది. కార్ప్స్ క‌మాండ‌ర్ క‌న్వ‌ల్జిత్ సింగ్ దిల్లాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వార్నింగ్ ఇచ్చారు. గ‌న్ ప‌ట్టుకుని తిరిగేవాళ్ల‌ను రూపుమాపేస్తామ‌న్నారు. పుల్వామా ఫిదాయిన్ దాడి జ‌రిగిన త‌ర్వాత వంద గంట‌ల్లోనే ఆ దాడికి కార‌ణ‌మైన జైషే ఉగ్ర‌వాదుల‌ను హ‌తం చేశామ‌న్నారు.

02/19/2019 - 12:38

పుదుచ్చేరి: గవర్నర్ కిరణ్‌బేడీ తీరును నిరసిస్తూ పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి చేపట్టిన దీక్షను సోమవారం అర్థరాత్రి విరమించారు. ఈ మేరకు గవర్నర్‌తో నాలుగు గంటల సేపు జరిగిన చర్చలలో తమ డిమాండ్లు పాక్షికంగా నెరవేరాయని, అందుకే ధర్నా విరమించినట్లు సీఎం వెల్లడించారు. ఈనెల 20,21న నిర్వహించనున్న జైలుభరో, నిరాహారదీక్షను రద్దుచేశారు.

02/19/2019 - 12:37

బికనేర్: దేశం వెళ్లాల్సిందిగా రాజస్థాన్‌లోని బికనేర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఈ ఉత్తర్వులు రెండు నెలల పాటు అమలులో ఉంటాయని అన్నారు. అలాగే పాకిస్థాన్‌కు చెందినవారికి హోటళ్లు,లాడ్జీలు ఇవ్వరాదని, వారితో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు పెట్టుకోవద్దని అన్నారు. పాకిస్థానీ రిజిస్ట్రేషన్‌తో వున్న సిమ్ కార్డులను కూడా వినియోగించరాదని అన్నారు.

Pages