S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/20/2019 - 13:37

న్యూఢిల్లీ: సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఢిల్లీలోని హైద‌రాబాద్ హౌజ్‌లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల నేత‌లు ద్వైపాక్షిక సంబంధాల‌పై ముచ్చటించారు. ప్రిన్స్ స‌ల్మాన్ మంగ‌ళ‌వారం రాత్రి భార‌త్‌కు వ‌చ్చారు. ప్రోటోకాల్ ప‌క్కన‌పెట్టి మ‌రీ... మోదీ ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు. ప్రిన్స్ స‌ల్మాన్‌ను మోదీ త‌న నివాసానికి కూడా తీసుకువెళ్లారు.

02/20/2019 - 13:05

థానే: థానే షాపింగ్ మాల్ వద్ద చిరుత సంచరించినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. బుధవారం తెల్లవారుజామున ఈ చిరుత షాపింగ్ మాల్ వద్దకు వచ్చి అక్కడ నుంచి మాల్ ప్రహారీ గోడ దూకిందని షాపింగ్ మాల్ మేనేజర్ వెల్లడించారు. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుత తిరుగాడిన ప్రాంతాలను పరిశీలించారు. వసంతవిహార్ నివాస్ ప్రాంతంలో కూడా చిరుత తిరిగినట్లు అధికారులు గుర్తించారు.

02/20/2019 - 13:02

ముంబయి. పూల్వామా ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పట్లో పాకిస్థాన్‌తో దైపాక్షిక సిరీస్ ఆడే ప్రసక్తిలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రపంచకప్ పోటీల్లో పాకిస్థాన్‌తో ఆడే అంశంపై కూడా బీసీసీఐ స్పష్టతనిచ్చింది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు భారత్ నో చెబితే వరల్డ్‌కప్ పోటీల్లో ఆడబోమని బీసీసీఐ తేల్చిచెప్పింది.

02/20/2019 - 13:01

జమ్మూకాశ్మీర్: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో ఎల్‌వోసీ వద్ద భారత బలగాలు భారీగా మోహరించాయి. సరిహద్దు ప్రాంతాల్లో సైన్యం అలెర్ట్ అయింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాక్‌సైన్యం పలుచోట్ల కాల్పులు జరుపుతున్నాయి. మన జవాన్లు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. పూల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది.

02/20/2019 - 12:59

న్యూఢిల్లీ: ఎరిక్సన్ ఇండియా కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్ అధినేత అనిల్ అంబానీకి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎరిక్సన్‌కు నాలుగు వారాల్లోపు రూ.453 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. లేకపోతే మూడు నెలల జైలుశిక్ష తప్పదని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.ఎఫ్ నారీమన్, జస్టిస్ వినీత్ సహరన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.

02/20/2019 - 05:01

న్యూఢిల్లీ: పుల్వానా ఘటనలో పాకిస్తాన్ ప్రమేయం ఉన్నదని చెప్పేందుకు బలమైన ఆధారాలు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని పాక్‌కు తెలియచేసినట్లు కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ చెప్పారు. ఈ ఘటనలో పాక్ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు చూపిస్తే, తమ దేశంలో ఉన్నబాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన విషయం విదితమే.

02/20/2019 - 02:51

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి జరిగిన వంద గంటల్లోనే జైషే మహమ్మద్ కశ్మీర్ విభాగం నాయకత్వాన్ని నిర్మూలించామని లెఫ్టినెంట్ జనరల్ కె.ఎస్.్థల్లాన్ ప్రకటించారు.

02/20/2019 - 02:49

వారణాసి (యూపీ), ఫిబ్రవరి 19: సమాజంలో కులపరమైన అసమానతలను పారద్రోలాలని, అప్పుడు సమసమాజ స్థాపన సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. భక్తి ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన సంత్ రవిదాస్ గొప్ప యోగి పుంగవుడు, సంస్కరణవాది అని ఆయన నివాళులు అర్పించారు. సామాజిక దురాచారాలను తరిమిగొట్టాలని, మానవులంతా ఒక్కటేనన్న లక్ష్యసాధనకు నిరంతరం కృషి చేసిన మహానుభావుడు సంత్ రవిదాస్ అన్నారు.

02/20/2019 - 02:47

వారణాసి, ఫిబ్రవరి 19: రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ సెమీ హైస్పీడ్ రైలుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షాల తీరు అత్యంత గర్హనీయమన్న ప్రధాని ‘మన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను అవమానించేవే’అని దుయ్యబట్టారు.

02/20/2019 - 02:43

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: పుల్వామాలో ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం పూర్తి అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపుతోంది. దీనిలో భాగంగానే నిషేధిత తీవ్రవాద సంస్థ స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమీ)పై దృష్టిపెట్టింది. సిమీకి నిధుల సేకరణ, దాని కార్యకలాపాలపై ఓ కనే్నసి ఉంచాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది.

Pages