S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/21/2019 - 04:18

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై తుండ్లా జంక్షన్ స్టేషన్ వద్ద బుధవారం రాళ్లతో దాడి చేశారు. రాళ్ళదాడిలో విండోప్యానల్ దెబ్బతిందని అధికారులు వెల్లడించారు. రెండు నెలల వ్యవధిలో రాళ్లదాడి జరగడం ఇది మూడోసారి. ఈనెల 17 నుంచి సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతున్నారు. అంతకు ముందు అంటే డిసెంబర్‌లో ఢిల్లీ-ఆగ్రా మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లతో దాడి చేశారు.

02/21/2019 - 04:17

జమ్ము, ఫిబ్రవరి 20: పుల్వానా ఉగ్రవాది దాడికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వంద మంది డోగ్రా కాశ్మీర్ యువకులను వెంటనే విడుదల చేయాలని జమ్ము ప్రొవిన్స్ పీపుల్స్ ఫోరం డిమాండ్ చేసింది. దాదాపు వంద మంది యువకులను పోలీసులు నిర్బంధించారన్నారు. వీరంతా అమాయకులని, దేశ భక్తితో ధర్నా చేస్తుంటే పోలీసులు అదుపులోకి తీసుకుని ఇంతవరకు వదిలిపెట్టలేదన్నారు.

02/21/2019 - 04:16

చిత్రాలు.. బెంగళూరులోని యెలహంక ఎయిర్‌బేస్‌లో బుధవారం ప్రారంభమైన ఏరో ఇండియా 2019 ఎయిర్ షోను తిలకించడానికి భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు. విన్యాసాలు ప్రదర్శిస్తున్న లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజాస్, ఇతర యుద్ధ విమానాలు.

02/21/2019 - 04:13

బెంగళూరు, ఫిబ్రవరి 20: భారతదేశంలోని వైమానిక, రక్షణ పరికరాల తయారీ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఇందులో పెట్టుబడులు పెట్టి, భాగస్వాములు కావడానికి పెట్టుబడిదారులు పెద్దయెత్తున ముందుకు రావాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆహ్వానం పలికారు. బెంగళూరులోని యెలహంక ఎయిర్‌బేస్‌లో బుధవారం ఎయిర్‌షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

02/21/2019 - 04:59

న్యూఢిల్లీ: ఉగ్రవాదం నిర్మూలనకు ఇరుదేశాలు ఉమ్మడిగా పోరాడాలని సౌదీ అరేబియా, భారత్ ప్రకటించాయి. బుధవారం ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌లు సమావేశమై ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇరువురు నేతలు ఉభయ దేశాలు అభివృద్ధి కోసం అనుసరించాల్సిన వ్యూహాత్మక అంశాలను చర్చించారు.

02/21/2019 - 03:59

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: పాకిస్తాన్‌ను పొగడ్తలతో ముంచెత్తిన సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ను మన ప్రధాని నరేంద్రమోదీ విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలకడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉగ్రవాదానికి పురిటి గడ్డ పాకిస్తాన్‌ను ఆకాశానికి ఎత్తేసిన సౌదీ రాజుకు ఇంత మర్యాద చేయడం మోదీకి తగదన్నారు.

02/21/2019 - 01:14

న్యూఢిల్లీ/హైదరాబాద్, ఫిబ్రవరి 20: విద్యా వ్యవస్థ ఇక కొత్తరూపు సంతరించుకోనుంది. నాణ్యమైన విద్యను అందించేందుకుగాను తరగతి గదుల్లో ‘ఆపరేషన్ డిజిటల్ బోర్డు’లను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఢిల్లీలో బుధవారం ప్రారంభించారు.

02/21/2019 - 00:42

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: పుల్వామా దాడి కారణంగా పాకిస్తాన్‌తో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వారం పది రోజులు ఆలస్యం కావచ్చునని ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి ఆఖరు వారం లేదా మార్చి మొదటి వారంలో విడుదల కావచ్చునని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చెప్పటం తెలిసిందే.

02/20/2019 - 17:22

న్యూఢిల్లీ: లండన్‌లో అక్రమాస్తుల కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. లండన్‌లో ఆస్తుల కొనుగోలుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసును వాద్రా ఎదుర్కొంటున్నారు. వాద్రా ఇవాళ సెంట్రల్ ఢిల్లీలో జామ్‌నగర్ హౌస్‌లో ఉన్న ఈడీ కార్యాలయానికి తన లాయర్లతో కలిసి వచ్చారు.

02/20/2019 - 17:21

న్యూఢిల్లీ:అయోధ్య కేసు విచారణ ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతుంది. ఈ కేసు విచారణకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగొయ్ రంజన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటైంది. అయితే ఈ న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ బాబ్డే సెలవుపై వెళ్లటంతో గత నెల 29న ప్రారంభంకావాల్సిన విచారణ వాయిదా పడింది. జస్టిస్ బాబ్డే సెలవు ముగించుకుని రావటంతో ఈ కేసు విచారణ 26 నుంచి చేపట్టనున్నారు.

Pages