S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/25/2019 - 12:33

రోహతక్: హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్‌వాద్రాకు అక్రమంగా భూములు కేటాయించారని హుడాపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా హుడా ఇంట్లోనూ, హర్యానా, ఢిల్లీ పరిసర ప్రాంతాలు దాదాపు 30 చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

01/25/2019 - 12:32

విజయవాడ: కృష్ణాజిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు అత్యాచారం చేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానోపాధ్యాయుడు ఆ బాలికను గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఆ చిన్నారి ఏడుస్తూ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయటంతో వారు ఆసుపత్రికి తీసుకువెళ్లగా బ్లీడింగ్ ఆగకపోవటంతో మూడు కుట్లు వేశారు.

01/25/2019 - 12:31

న్యూఢిల్లీ: విద్యార్థులు తయారుచేసిన కలాంశాట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్తవ్రేత్తలకు ప్రధాని మోదీ అభినందించారు. ఆయన ట్విట్టర్‌లో తన సందేశాన్ని పంపిస్తూ మైక్రోగ్రావిటీ పరీక్షల కోసం ఇస్రో చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఇదిలావుండగా గురువారం రాత్రి ఇస్రో పీఎల్‌ఎల్‌వీ-సీ44 రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను రోదసీలోకి విజయవంతంగా ప్రయోగించిన విషయం విదితమే.

01/25/2019 - 04:23

అమేధీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సంపూర్ణ బలంతో ఎన్నికలు వెళ్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు. అమేధీలో రెండు రోజుల పర్యటన వచ్చిన ఆయన గురువారం ఓ బహిరంగ సభలో ప్రసంగించారు. తన సోదరి ప్రియాంక గాంధీ రాకతో యూపీలో పార్టీ బలోపేతమవుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో పార్టీ బలపడడంతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంపూర్ణ బలంతో వెళ్తామని రాహుల్ వెల్లడించారు.

01/25/2019 - 02:12

న్యూఢిల్లీ, జనవరి 24: తొలుత ఆయనో ఉగ్రవాది.. తర్వాత తాను తప్పుడు మార్గంలో పయనిస్తున్నానని తెలుసుకున్నాడు. దేశానికి సేవ చేయడానికి సైన్యం ఒకటే మార్గమని నిర్ణయించుకున్నాడు. దానికోసం శ్రమించి సైన్యంలో చేరి ఉగ్రమూకలతో జరిపిన పోరులో అమరుడయ్యాడు.

01/25/2019 - 02:01

గుర్గావ్, జనవరి 24: ఇక్కడ 65వ సెక్టార్‌లోని ఉల్లావాస్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలిపోయి ఆరుగురు కూలీలు దుర్మరణం చెందారు.

01/25/2019 - 01:58

జాయ్‌నగర్, జనవరి 24: కాంగ్రెస్ హయాంలో కంటే రాష్ట్రానికి ఎక్కువ నిధులే ఇచ్చామని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో గురువారం బీజేపీ నిర్వహించిన ర్యాలీలో మంత్రి ప్రసంగించారు. గత యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి లక్ష కోట్లు కేటాయిస్తే, 14 ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల మేరకు 2.80 లక్షల కోట్లు ఇవ్వడం జరిగిందని అన్నారు.

01/25/2019 - 01:55

న్యూఢిల్లీ, జనవరి 24: రైల్వే శాఖలోని సుమారు మూడు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మోదీ ప్రభుత్వం చేసిన ప్రకటన మరో జిమ్మిక్కు అని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం విమర్శించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేస్తూ రైల్వే శాఖలాగే పలు ప్రభుత్వ శాఖల్లో లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని సైతం భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

01/25/2019 - 01:46

న్యూఢిల్లీ, జనవరి 24: దేశ జనాభాలో 70 శాతం ఉన్న మహిళలు, శిశువుల సంక్షేమం, బాగోగులను చూసే బాధ్యత మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ ఉందని, ఈ శాఖ కత్తిమీద సవాలుతో కూడినదని కేంద్ర మంత్రి మేనకా గాంధీ అన్నారు. గురువారం ఇక్కడ జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, తమ శాఖ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వాటి ఫలాలను మహిళలు, శిశువులకు అందిస్తోందన్నారు.

01/25/2019 - 01:42

న్యూఢిల్లీ, జనరి 24: ఢిల్లీలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో, మళ్లీ వాయు కాలుష్యం పెరిగింది. ప్రస్తుతం వాయు కాలుష్యం తీవ్రత హెచ్చుగా ఉందని, మంచి వాతావరణం స్థాయి లేదని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం సూచిక 328 నమోదైంది.

Pages