S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/25/2019 - 01:40

న్యూఢిల్లీ, జనవరి 24: దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్శిటీల్లోని ఉద్యోగాల భర్తీకి రిజర్వేషన్ అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీరని అన్యాయం చేస్తోందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

01/25/2019 - 04:55

గుంతకల్లు: నరేంద్ర మోదీ సారధ్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాలుగేళ్లలో పలు రైల్వే ప్రాజెక్టులు వేగవంతమయ్యాయని రైల్వేశాఖ సహాయ మంత్రి రాజెన్ గోహెన్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని వివిధ ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవానికి గురువారం విచ్చేసిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వచ్చే బడ్జెట్‌లో రైల్వేకు రూ. 3,670 కోట్లు కేటాయించనున్నారన్నారు.

01/25/2019 - 04:54

న్యూఢిల్లీ:సీబీఐకి కొత్త సారథిని నియమించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన గురువారం జరిగిన ఉన్నతాధికార ఎంపిక కమిటీ ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయింది. సీబీఐ సారథిని ఖరారు చేసేందుకు ఈ కమిటీ వచ్చేవారం మళ్లీ సమావేశమయ్యే అవకాశం ఉంది. గత మూడు నెలలుగా సంక్షోభ వాతావరణం నెలకొనడం వల్ల సీబీఐకి పూర్తి స్థాయి సారధి లేకుండా పోయిన విషయం తెలిసిందే.

01/25/2019 - 01:07

చిత్రం..నవీ ముంబయిలోని సాయనాథ్ స్కూల్‌లో గణతంత్ర దినోత్సవం కోసం సైకిల్‌పై విన్యాసాలను ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థులు.

01/25/2019 - 01:06

చిత్రం..గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనేందుకు ముందు, గురువారం
శ్రీనగర్‌లో నిర్వహించిన ఫుల్ డ్రెస్ రిహార్సల్‌లో పాల్గొన్న మహిళా పోలీస్ బృందం.

01/25/2019 - 01:01

న్యూఢిల్లీ, జనవరి 24: సియాచిన్ అంటేనే మంచుకొండ. వెన్నులో వణుకుపుట్టించే మంచు ముద్ద. అలాంటి అతి శీతల వాతావరణంలో సైనికులు ఏలా పనిచేస్తున్నారు? మైనస్ 50 డిగ్రీల వాతావరణంలో కూడా ఎలా మనుగణ సాధించగలుగుతున్నారు? అంతూపంతూలేని రీతిలో ఒకదాని తరువాత ఒకటిగా ఉండే హిమశిఖరాలపై ఎలా పనిచేయగలుగుతున్నారన్నది ఓ మిస్టరీనే.

01/25/2019 - 00:58

గుంతకల్లు, జనవరి 24: దేశంలో కొత్త రైల్వేజోన్ల ఏర్పాట్లు ఇప్పట్లో సాధ్యం కాదని రైల్వేశాఖ సహాయమంత్రి రాజెన్ గోహెన్ అన్నారు. గుంతకల్లులో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రతి ప్రాంతంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ప్రజల నుండి పెద్దఎత్తున అభ్యర్థనలు వస్తున్నాయన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు రైల్వేజోన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్నారు. ప్రజల అంచనాలు ఎక్కువగా ఉంటాయన్నారు.

01/25/2019 - 00:41

సూళ్లూరుపేట, జనవరి 24: అంతరిక్ష పరిశోధనలో ఇస్రో మరో విజయాన్ని చేకూర్చుకుంది. పీఎస్‌ఎల్‌వీ సీ-44 రాకెట్‌ద్వారా గురువారం రాత్రి 11.37 నిమిషాలకు రెండు ఉపగ్రహాలను విజయవంతంగా రోదసిలోకి తీసుకెళ్లింది. వీటిలో ఒకటి మైక్రోశాట్ ఆర్‌కాగా, రెండోది విద్యార్థులు రూపొందించిన కలాంశాట్. వీటిలో మైక్రో శాట్ భూతలానికి సంబంధించిన ఛాయా చిత్రాలను పంపేందుకు ఉద్దేశించింది. రెండోది కమ్యునికేషన్ ఉపగ్రహం.

01/25/2019 - 00:44

రాష్ట్రీయ బాలల పురస్కారాల ప్రదానోత్సవం అనంతరం ఓ చిన్నారితో ముచ్చటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ

01/25/2019 - 00:20

న్యూఢిల్లీ, జనవరి 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని లోక్‌సభ ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పాటు చేయాలనుకున్న మహాకూటమి కుప్పకూలుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. లోక్‌సభతోపాటు నాలుగైదు రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని కాంగ్రెస్ విధాన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Pages