S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/25/2019 - 00:18

న్యూఢిల్లీ, జనవరి 24: పేపర్ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించే ప్రసక్తే లేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాలకు బదులు పేపర్ బ్యాలెట్ పత్రాలను మళ్లీ ప్రవేశపెట్టాలంటూ పలు ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌ను సునీల్ అరోరా గురువారం తోసిపుచ్చారు. ‘పేపర్ బ్యాలెట్‌ను మళ్లీ ప్రవేశపట్టే ప్రసక్తే లేదు..

01/24/2019 - 17:33

మేఘాలయ: మేఘాలయ మైనింగ్ ఘటనలో 42 రోజుల తరువాత ఒక మృతదేహాన్ని వెలికితీశారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, భారత నేవీ బృందాలు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో ఈ మృతదేహం బయటపడింది. కసన్ దగ్గరలో తూర్పు జైంట్‌హిల్స్ సమీపంలో దీనిని కనుగొన్నారు. మృతదేహాన్న పోస్టుమార్టమ్ కోసం ఆసుప్రతికి తరలించారు.

01/24/2019 - 16:28

రాయబరేలి: 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీని గద్దె దించటమే కాంగ్రెస్ ధ్యేయంగా ముందుకు వెళుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన యూపీలోని తన తల్లి సోనియా నియోజకవర్గమైన రాయబరేలిలో విలేకర్లతో మాట్లాడుతూ చైనా దేశం గంటకు యాభైవేల ఉద్యోగాలు ఇస్తుంటే మనదేశం మాత్రం కేవలం 450 ఉద్యోగాలను మాత్రమే ఇస్తుందని అన్నారు.

01/24/2019 - 16:27

న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరారావు నియామకంపై దాఖలైన పిటిషన్‌పై విచారించే ధర్మాసనం నుంచి జస్టిస్ సిక్రే కూడా వైదొలిగారు. ఆయన కూడా సీబీఐ చీఫ్ డైరెక్టర్ ఎంపిక కమిటీలో సభ్యుడు అయినందున ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ సైతం ఇదే విషయమై వైదొలిగిన సంగతి తెలిసిందే.

01/24/2019 - 13:09

బెంగళూరు: రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తామని కర్ణాటక సీఎం కుమారస్వామి అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానికావాలని తమ పార్టీ కోరుకుంటుందని ఆయన చెప్పారు. ఇందుకోసం తమ పార్టీ కృషిచేస్తుందని అన్నారు. సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకుంటున్న రాహుల్ పరిణితి చెందిన నాయకుడని కితాబునిచ్చారు.

01/24/2019 - 13:07

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కాంగ్రెస్ నేత కె.సుధాకరన్ వివాస్పద వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది కేరళను అతలాకుతలం చేసిన వరదల పున:నిర్మాణ పనులు చేపట్టడంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీఎం పినరయి మాటలు మనిషి కాదు చేతలు మనిషి అని నమ్మాను. కాని ఆయన ఆడవాళ్లకంటే అధ్వాన్నంగా పనిచేస్తున్నారని విమర్శించారు.

01/24/2019 - 17:17

న్యూఢిల్లీ: వీడియోకాన్‌కు ఐసీసీఐ అక్రమంగా రుణాలు మంజూరు చేసిందనే అరోపణలకు సంబంధించి గురువారంనాడు సీబీఐ వీడియోకాన్ ఆఫీసులపై దాడులు నిర్వహించింది. ముంబయిలోని వీడియోకాన్ అధిపతి వేణుగోపాల్ దూత్ కార్యాలయంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. 2012లో వీడియోకాన్ గ్రూపునకు ఐసీఐసీఐ 3250 కోట్ల రుణాలు మంజూరుచేసిన విషయం విదితమే.

01/24/2019 - 13:01

హర్యానా: హర్యానా రాష్ట్రంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలటంతో శిథిలాల కింద 12 మంది చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గురుగ్రామ్ ప్రాంతంలోని ఉల్లావాస్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గురువారం ఉదయం తెల్లవారు జామున సంభవించిన ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి.

01/24/2019 - 04:13

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మేనకోడలు, నేతాజీ రీసెర్చ్ బ్యూరో చైర్‌పర్సన్ అనితా బోస్‌కు డీవీడీ ప్యాక్‌ను అందచేస్తున్న పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేశరీ నాథ్ త్రిపాఠీ. మాజీ గవర్నర్ గోపాల్ కృష్ణ గాంధీ కూడా చిత్రంలో ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ 122వ జయంతిని కోల్‌కతాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోస్ ఫొటోలు, క్లిప్పింగ్స్‌తో కూడిన డీవీడీలను అనితా బోస్‌కు అందించారు.

01/24/2019 - 04:11

లక్నో, జనవరి 23: కాంగ్రెస్ పార్టీ యూపీ తూర్పు ప్రాంతం ఎన్నికల వ్యవహారాల ఇన్‌చార్జీగా ప్రియాంక గాంధీని నియమించడాన్ని బీజేపీ స్వాగతించింది. ఈ నియామకం చూస్తే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పార్టీలో ప్రాధాన్యత తగ్గినట్లుగా సంకేతాలు వస్తున్నట్లు అర్థమవుతోందని బీజేపీ నేత, యూపీ మంత్రి సిద్ధార్ధ్ నాథ్ సింగ్ చెప్పారు. రాహుల్ గాంధీపై ఆధారపడి రాజకీయాలు చేయలేమనే విషయాన్ని ఆ పార్టీ గ్రహించినట్లుందన్నారు.

Pages