S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/23/2019 - 17:06

న్యూఢిల్లీ: యూపీలో కాంగ్రెస్ పార్టీ తూర్పు విభాగం ఇంచార్జ్‌గా ప్రియాంక గాంధీని నియమించటంపై బీజేపీ స్పందించింది. ప్రియాంక నియామకం వల్ల రాహుల్‌గాంధీ పార్టీలో విఫలమైనట్లు భావించే రాహుల్‌కి ఊతకర్ర కోసం ఆమెను తీసుకువచ్చారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి పార్టీయే కుటుంబమని, కాని కాంగ్రెస్‌కు కుటుంబమే పార్టీ అని అన్నారు.

01/23/2019 - 16:57

న్యూఢిల్లీ:తూర్పు యూపీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌గా ప్రియాంక గాంధీ ఎంపిక చేయటం సంతోషాన్ని ఇచ్చిందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వెస్ట్ యూపీకి జ్యోతిరాధిత్య సింధియా మంచి పవర్‌ఫుల్ నేత అని అన్నారు. వీరిద్దరు యూపీ రాజకీయాలను మారుస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు.

01/23/2019 - 16:55

న్యూఢిల్లీ: ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంకగాంధీకి భర్త రాబర్ట్ వాద్రా అభినందించారు. యూపీలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించటంపై ఫేస్‌బుక్ వేదికగా స్పందించారు. ఎల్లప్పుడు నీకు తోడుగా ఉంటానని, ముందుకు దూసుకుపోవాలని అన్నారు.

01/23/2019 - 16:53

న్యూఢిల్లీ: సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకగాంధీకి యూపీ పార్టీ బాధ్యతలు అప్పగించారు. యూపీ తూర్పు ప్రాంత ఏఐసీసీ ఇంచార్జ్‌గా ఆమెకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. వెస్ట్ విభాగానికి జ్యోతిరాధిత్య సింధియా వ్యవహరిస్తారు. యూపీలో కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యతను పార్టీ ప్రియాంక గాంధీపై ఉంచింది.

01/23/2019 - 13:11

బెంగళూరు: కర్ణాటకలో బిడది ఈగల్టన్ రీసార్ట్‌లో విజయనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌పై మద్యం బాటిల్‌తో దాడిచేసిన కంప్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేశ్ కోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి విస్తత్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. గణేశ్ ఫోన్ స్విచ్ఛ్ఫా చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆనంద్‌సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు గణేశ్ కోసం గాలిస్తున్నారు.

01/23/2019 - 13:10

చెన్నై: మాజీ ముఖ్యమంత్రి పన్నీరసెల్వం ఈనెల 29న మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిటీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు కమిటీ సమన్లు జారీ చేసింది.

01/23/2019 - 13:08

ఒడిశా: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు లోయలోపడి దాదాపు 8మంది చనిపోయారు. గడాపూర్ నుంచి బ్రాహ్మణ్‌గావ్ వెళుతున్న ట్రక్కు బలిగూడ సమీపంలో పోయిగూడ ఘాట్ వద్ద ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవటంతో ఈ ఘటన జరిగింది. ట్రక్కులో 40మందికి పైగా ప్రయాణిస్తున్నారు. గాయపడిన 25మందిని ఆసుపత్రికి తరలించారు.

01/23/2019 - 13:02

పాట్నా: బ్యాలెట్ బాక్సుల కంటే ఈవీఎంల వాడకమే ఉత్తమమని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వీవీప్యాట్ మిషన్లు ఉంచిన తరువాత ఎవరికి ఓటు వేశారో స్పషంగా తెలుస్తుందని అన్నారు. ఈవీఎంలు వద్దు బ్యాలెట్ బాక్సులు ఏర్పాటుచేయాలనే డిమాండ్‌కు తాను మద్దతు ఇవ్వటం లేదని అన్నారు.

01/23/2019 - 13:00

ముంబయి: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసీస్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలో గణతంత్ర వేడుకలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వీరిలో 17 ఏళ్ల యువకుడు కూడా ఉన్నాడు. ఈ యువకులంతా ముంబ్రే, థానే, ఔరంగాబాద్ పట్టణాలకు చెందినవారు.

01/23/2019 - 12:58

భోపాల్: తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే సంక్షోభం తలెత్తుతుందని బీఎస్పీ ఎమ్మెల్యే రాంబాయి సింగ్ హెచ్చరించారు. ఆమె తన నియోజకవర్గమైన పథారియాలో విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో రెండు చోట్ల బిఎస్పీ గెలిచింది. కాంగ్రెస్‌కు చెందిన కమలనాథ్ ప్రభుత్వానికి ఈ ఇద్దరు మద్దతు ఇస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే కర్నాటకలో తలెత్తిన పరిస్థితులు ఇక్కడ ఏర్పడతాయని ఆమె హెచ్చరిస్తున్నారు.

Pages