S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/04/2018 - 03:24

చెన్నై, డిసెంబర్ 3: బ్యాంకులకు ఆరువేల కోట్ల రూపాయలమేర రుణాలు ఎగ్గొట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ రాజ్యసభ సభ్యుడు వై సుజనాచౌదరి సోమవారం ఇక్కడ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. తనకు ఈడీ జారీ చేసిన సమన్లు రద్దుచేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో చెన్నైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు.

12/04/2018 - 03:22

తిరువనంతపురం, డిసెంబర్ 3: శబరిమల వివాదం అంశం సోమవారం కేరళ అసెంబ్లీని కుదిపేసింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వరుసగా నాలుగోరోజూ సభలో ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టలేదు. యూడీఎఫ్ ఎమ్మెల్యేలు ముగ్గురు అసెంబ్లీ ఎదుట సత్యాగ్రహం మొదలెట్టారు. సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ ఎమ్మెల్యేలు బిగ్గరగా నినాదాలు ప్రారంభించారు.

12/04/2018 - 03:21

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: సమాజంలోని దివ్యాంగులకు తగిన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించి వారికి సాధికారిత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ వెల్లడించారు. ఎన్‌సిపిఇడిపి-మైండ్ ట్రీ హెలెన్‌కిల్లర్ అవార్డ్సు -2018 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల్లో ఒక శాతం మంది మాత్రమే పాఠశాలలకు వెళ్తున్నారని చెప్పారు.

12/04/2018 - 03:20

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: అపార్థాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ నిర్భయంగా భావ వ్యక్తీకరణ చేసేలా విద్యావిధానం ఉండాలని మాజీ రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ సూచించారు. ఇక్కడి ఆనంద్‌పర్బత్‌లోని రామ్‌జాస్ స్కూల్ వార్షికోత్సవ సభలో సోమవారం ఆయన పాల్గొని ప్రసంగించారు. వేగంగా పరుగెడుతున్న ప్రపంచాన్ని మార్చగలిగే శక్తివంతమైన ఆయుధం విద్యేనని అన్నారు.

12/04/2018 - 02:53

లక్నో, డిసెంబర్ 3: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీజేపీకి స్టార్ కాంపెయినర్‌గా మారాడు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయనే అత్యధికంగా బహిరంగ సభల్లో, ర్యాలీల్లో పాల్గొంటూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో దాదాపు 50 సభలు, ర్యాలీల్లో పాల్గొన్న యోగి కాషాయ పార్టీ వర్గాల్లో హుషారును రేకెత్తిస్తున్నారు.

12/04/2018 - 02:34

జైపూర్, డిసెంబర్ 3: రాజస్థాన్‌లో ‘రాణీ శకం’ముగిసిందని, బీజేపీ ఎంత ప్రచారం చేసినా మళ్లీ అధికారంలోకి రావడం కల్లని పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి వసుంధరరాజేను ఎవరూ కాపాడలేరని, ఆమె రాచరికపునేపథ్యం కూడా ఈ ఎన్నికల్లో పనిచేయదని ఆయన స్పష్టం చేశారు. ఎడారి రాష్ట్రం కాంగ్రెస్ వశం కావడం తథ్యమని పైలట్ ధీమా వ్యక్తం చేశారు.

12/04/2018 - 01:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దివ్యాంగులకు అన్ని రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం మొదట స్థానంలో నిలిచింది. సోమవారం విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును దివ్యాంగుల కార్పొరేషన్ కమిషనర్ శైలజ, ప్రిన్సిపల్ సెక్రటరీ జగదీశ్వర్ అందుకున్నారు.

12/03/2018 - 02:11

అళ్వార్, డిసెంబర్ 2: ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజస్థాన్ రాష్ట్రంలో ప్రచారం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్-బీజేపీ నువ్వానేనా అనే రీతిలో ప్రచారం సాగిస్తున్నాయి. ఈ రెండు పార్టీలతో పాటు పలు చిన్నపార్టీలు సైతం ఈసారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. రాష్టవ్య్రాప్తంగా కేవలం ఒక్క అభ్యర్థిని మాత్రమే బరిలోకి దింపిన పార్టీలు ఇక్కడ 20 వరకు ఉన్నాయి.

12/03/2018 - 01:41

జైపూర్, డిసెంబర్ 2: పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచివేసే శక్తి లేని పక్షంలో భారత్ సహకారం తీసుకోవాలని కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. గత నాలుగేళ్లలో ఎన్డీఏ హయాంలో దేశంలో ఉగ్రవాద సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో రాజీలేని పోరు చేస్తున్నామన్నారు. ఆఫ్గనిస్తాన్ ఉగ్రవాద సంస్థ తాలిబాన్లను అణచివేసేందుకు అమెరికా సాయం తీసుకుందన్నారు.

12/02/2018 - 23:28

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: దేశంలో ఎన్నికలను సజావుగా, స్వేచ్ఛగా, నిజాయితీగా నిర్వహించేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సునీల్ ఆరోరా అన్నారు. ఆయన 23వ ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.

Pages