S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/06/2018 - 01:45

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర శాసనసభకు శుక్రవారం జరుగనున్న ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌దే పైచేయి అవుతుందని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విజయం దిశగా సాగుతున్నట్టు కనపడుతోందని ఇండియా టుడేకు చెందిన పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్ (పీఎస్‌ఈ) తన తాజా సర్వే ద్వారా తేల్చింది.

12/06/2018 - 00:51

న్యూఢిల్లీ: సాహిత్య రంగంలో సమున్నత శిఖరాలు అధిరోదించిన ప్రముఖ కవి, సాహితీవేత్త, విద్యాదాత పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. 2018 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తెలుగు భాషనుంచి ‘విమర్శిని’ పేరుతో ఇనాక్ రచించిన వ్యాస సంకలనానికి

12/06/2018 - 00:09

బెంగళూరు, డిసెంబర్ 5: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు అందించాలన్న లక్ష్యంతో ప్రయోగించిన అత్యంత బరువైన జీశాట్-11 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఫ్రెంచి గుయానాలోని అంతరిక్ష సంస్థ నుంచి ఈ ఉపగ్రహాన్ని బుధవారం తెల్లవారుజామున ప్రయోగించినట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ చెప్పారు. జీశాట్ ప్రయోగించిన 33 నిమిషాల ద్వారా అంతరిక్షంలోని కక్ష్యలో ప్రవేశించింది.

12/05/2018 - 22:26

చెన్నై, డిసెంబర్ 5: సుమారు నాలుగేళ్ల పాటు శ్రమించి, రూ. 6వందల కోట్లకుపైనే పెట్టుబడి పెట్టి ఓ సినిమా తీశారంటే.. ఆ ప్రయత్నానికి , సాహసానికీ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అది రజనీకాంత్ సినిమా. అందులోనూ సాంకేతికంగా అద్భుతాలు సృష్టించే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కితే.. ఇక ఆ సినిమా గురించి చెప్పేదేముంది? అందుకే రోబో ‘2.ఓ’పై అన్ని అంచనాలు పెంచుకున్నారు సినీ అభిమానులు. తరచూ వాయిదా పడుతూ వస్తున్నా..

12/05/2018 - 13:53

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రెండవ వర్ధంతి సందర్భంగా అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు చెన్నైలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం నేతృత్వంలో ఈ ర్యాలీ జరిగింది.
పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య అన్నా సలై నుంచి మెరీనా బీచ్‌లోని జయలలిత మెమోరియల్ వరకు ర్యాలీ జరిగింది. అనంతరం ఆమె సమాధి వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.

12/05/2018 - 13:51

తిరువనంతపురం: శబరిమలలో నిషేదాజ్ఞలను ఈ నెల 8 అర్థరాత్రి వరకు పొగిస్తున్నట్టు పతనందిట్ట జిల్లా కలెక్టర్ పీబీ నూహ్ వెల్లడించారు. పోలీస్ కమిషనర్ సహా ఇతర అధికారుల నుంచి అందిన నివేదికల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.

12/05/2018 - 13:17

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఉపగ్రహాన్ని రోదసీలోకి విజయవంతంగా పంపింది. బ్యాడ్‌బ్రాండ్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు, కొత్తతరం అప్లికేషన్ రూపకల్పన కోసం సమాచార ఉపగ్రహం జీశాట్-11ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. బిగ్‌బర్డ్‌గా పిలుచుకునే ఈ ఉపగ్రహ తయారీకి రూ.600 కోట్లు వెచ్చించింది.

12/05/2018 - 13:15

జైపూర్: రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం చివరి రోజుకు చేరుకోవటంతో అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జైపూర్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ లేదని, కనీసం ప్రధాని అభ్యర్థిని కూడా ప్రచారం చేసుకోలేని పరిస్థితి నెలకొందని అన్నారు. రాజస్థాన్‌లో మళ్లీ అధికారంలోకి వచ్చి అద్భుతమైన రాష్ట్రంగా తీర్చుదిద్దుతామని అన్నారు.

12/05/2018 - 03:53

హనుమాన్‌గర్ (రాజస్థాన్), డిసెంబర్ 4: ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో ఉన్న కర్తాపూర్ వాస్తవానికి భారత్ భూభాగంలోనిదని, స్వాతంత్య్ర సమయంలో అప్పటి నేతలకు ముందు చూపులేకపోవడం, సిక్కుల మనోభావాలను గౌరవించకపోవడం వల్ల అది ఆ దేశానికి వెళ్లిపోయిందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు.

12/05/2018 - 03:35

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: దేశ రాజధానిలో తెలంగాణ ముఖ్యమంత్రి కాన్వాయ్‌కోసం భవన్ అధికారులు నాలుగు కొత్త టయోటా ఫార్చ్యూనర్ వాహనాలను కొనుగోలు చేశారు. టయోటా కంపెనీ మంగళవారం తెలంగాణ భవన్ అధికారులకు వాహనాలను అప్పగించారు. ఈ వాహనాలు వచ్చే ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి కాన్వాయ్‌గా ఉపయోగించనున్నారు.

Pages