S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/04/2018 - 16:31

అల్వార్: రాఫెల్ ఒప్పందంపై మోదీ మాట్లాడేందుకు భయపడుతున్నారని, 30వేల కోట్ల రూపాయలను అనిల్ అంబానీకి లబ్ధిచేకూర్చారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఆయన రాజస్థాన్‌లోని అల్వార్ సభలో మాట్లాడుతూ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తే ఆల్వార్‌లో నలుగురు వ్యక్తులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారని అన్నారు.

12/04/2018 - 16:30

హనుమాన్‌గఢ్: రైతులను శక్తిప్రదాతులుగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

12/04/2018 - 13:30

వాషింగ్టన్‌: భవిష్యత్తులో ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ఈ పరిణామాలు సూచిక అని రక్షణశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఐదు రోజుల అమెరికా అధికారిక పర్యటనలో భాగంగా ఆ దేశ రక్షణశాఖ సెక్రటరీ జేమ్స్‌ మట్టీస్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తాజాగా జరిగిన ద్వైపాక్షిక సమావేశాల ద్వారా ఇరుదేశాలు మరింత సానుకూల దృక్పథంతో ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తాయని తెలిపారు.

12/04/2018 - 13:26

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బులెంద్‌పహర్‌లో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గోవధ జరుగుతుందని ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో పోలీసులపై రాళ్లురువ్వారు. ఈ ఘర్షణలో ఓ పోలీసు అధికారి మృతిచెందారు. ఈ ఘటనలో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి నలగురిని అరెస్టు చేశారు. కేసులు నమోదు అయనవారిలో బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు అధికంగా ఉన్నారు.

12/04/2018 - 04:47

జోధ్‌పూర్: రాజస్థాన్‌లో అధికారం తమదేనన్న కాంగ్రెస్ పార్టీ ఆశలు బెడిసి కొట్టడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒకే పార్టీ వరుసగా రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు కాబట్టే..ఈ సారి అధికారం తమకే దక్కుతుందని కాంగ్రెస్ ఆశిస్తోందని, కానీ సంప్రదాయానికి భిన్నంగా రాష్ట్ర ప్రజలు తీర్పునివ్వబోతున్నారని ఉద్ఘాటించారు.

12/04/2018 - 03:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిసా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. శాసనసభ పదవీకాలం వచ్చే ఏడాది మే, జూన్ నెలలతో ముగిసే ఈ రాష్ట్రాలతో పాటు జమ్మూకాశ్మీర్ శాసనసభకు సైతం ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ యోచిస్తోంది.

12/04/2018 - 03:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఎన్నికల్లో పోటీ చేస్తున్న పురుష అభ్యర్థుల కంటే మహిళలకే ఎక్కువ శాతం విజయాన్ని పొందారని, 2014 సాధారణ ఎన్నికలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయని, అయినా పది లోక్‌సభ సీట్లలో కేవలం ఒకరు (10 శాతం) మాత్రమే చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని సోమవారం ఆక్స్‌ఫర్డ్ ప్రెస్ విడుదల చేసిన ఒక పుస్తకం వెల్లడించింది.

12/04/2018 - 03:34

చెన్నై, డిసెంబర్ 3: రాజీవ్ గాంధీ హత్యకేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలంటూ సోమవారం తమిళనాడు రాజ్‌భవన్ ముట్టడికి యత్నించిన ఎండీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు వైగో సహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆర్. ముత్తరాసన్, డికే, వీసీకే నేతలు కే. వీరమణి, తొల్ తిరుమావలన్ తదితరులున్నారు.

12/04/2018 - 03:32

అవకాశం ఇస్తే ఎలాంటి అద్భుతాలనైనా దివ్యాంగులు సాధిస్తారన్న సంకేతాన్ని అందిస్తూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సోమవారం కోల్‌కతాలో ఓ ర్యాలీ నిర్వహిస్తున్న గిరిజనులు.. జైపూర్‌లో కూడా దివ్యాంగుల విద్యార్థులు ఓ ప్రదర్శన నిర్వహించి అందర్నీ ఆకట్టుకున్నారు..

12/04/2018 - 03:26

బులంద్‌షాహర్ (యూపీ) డిసెంబర్ 3: అక్రమంగా జంతువధ జరిగిందంటూ చేపట్టిన నిరసన హింసకు దారితీయడంతో మూకదాడిలో ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ మృతి చెందగా పోలీసు కాల్పుల్లో మరో యువకుడు మృత్యువాత పడిన ఘటన సోమవారం ఉత్తర్ ప్రదేశ్‌లోని బులంద్‌షాహర్‌లో చోటు చేసుకుంది. ఆందోళనకారులు పోలీస్ ఔట్‌పోస్టుపైకి దూసుకెళ్లి దాడికి దిగడంతో పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు.

Pages