S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/30/2018 - 17:40

ముంబయి: మాలేగావ్ పేలుళ్ల కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురు నిందితులపై ఎన్‌ఐఏ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ సహా నిందితులపై ఉగ్రకుట్ర,హత్యానేరంతో పాటు పలు అభియోగాలను నమోదు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చేనెల 2వ తేదీకి వాయిదా వేసింది. ట్రయల్ కోర్టులో అభియోగాల నమోదు వాయిదా వేయాలంటూ నిన్న దాఖలైన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

10/30/2018 - 14:05

చెన్నై: బాణాసంచా కాల్చే సమయంపై బాణాసంచా తయారీదారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీపావళినాడు రెండు గంటలు మాత్రమే కాల్చాలని ఆంక్షలు విధించటం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని వారు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

10/30/2018 - 14:04

చత్తీస్‌గఢ్: దండేవాడలో మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. ఎన్నికల కవరేజీ కోసం వెళ్లిన బృందంపై దాడి చేయటంతో జర్నలిస్టుతో సహా ఇద్దరు జవాన్లు చనిపోయారు. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఆరాన్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

10/30/2018 - 12:50

హైదరాబాద్: ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు మగబిడ్డ పుట్టాడు. ఈ మేరకు భర్త షోయాబ్ మాలిక్ ట్విట్టర్‌లో తెలియజేశారు. అభిమానులకు, మా శ్రేయస్సు కోరేవారందరికీ ధన్యవాదాలు అంటూ తెలియజేశారు. తన కుమారుడు, భార్య సానియా ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేశారు.

10/30/2018 - 12:40

న్యూఢిల్లీ: ఇటాలియన్ ప్రధానమంత్రి గియూసెఫ్ కాంటే భారత పర్యటనకు నేడు వచ్చారు. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఆయన ప్రధాని మోదీతో సమావేశంకానున్నారు. ఇండియా-ఇటలీ టెక్నాలిజీ సమ్మిట్‌లో ఇరువురు ప్రధానులు పాల్గొననున్నారు.

10/30/2018 - 12:39

న్యూఢిల్లీ: బదిలీ అయిన మరో సీబీఐ అధికారి బస్సీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా అవినీతి కేసును విచారిస్తున్న ఏకే బస్సీతో సహా 13మంది అధికారులను బదిలీ చేసిన విషయం విదితమే. తన బదిలీని వ్యతిరేకిస్తూ బస్సీ నేడు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

10/30/2018 - 04:33

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై దాడి, అనంతరం రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు సరిగాలేదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత విమర్శించారు. సోమవారం ఆమె ఇక్కడ విలేఖరులతోమాట్లాడుతూ జగన్‌పై దాడి ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తుజరగాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సంస్కరణలపై ఈసీకి వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు.

10/30/2018 - 04:32

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: తెలంగాణలో ఎన్నికలు తేదీ దగ్గర పడుతున్నందున మహాకూటమీలో సీట్ల సర్దుబాటులో జాప్యం మంచిదికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ సర్దుబాట్లలో ఆలస్యం గెలుపుపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 9 స్థానాలు సీపీఐకి ఇవ్వమని కాంగ్రెస్‌ను కోరినట్టు నారాయణ వెల్లడించారు.

10/30/2018 - 04:21

లక్నో, అక్టోబర్ 29: తండ్రీకొడుకుల అనుబంధం కంటే వృత్త్ధిర్మం గొప్పది. ఆ వృత్తిలో భాగంగా నిర్వహించాల్సిన బాధ్యత మరింత ఉన్నతమైనది. మనం ఎన్నో సినిమాల్లో ఒక కొడుకు అధికారిగా, తండ్రి బంట్రోతుగా ఉన్న దృశ్యాలు చూశాం. ఆ అధికారికి ఆ బంట్రోతు సలామ్ కొట్టడాన్ని చూసే ఉంటాం. అది సినిమా కాబట్టి ఒకరినొకరు నొచ్చుకునే పరిస్థితి ఉండదు. నిజ జీవితంలో అలాంటి పరిస్థితే ఎదురైతే ఎలాంటి అనుభూతి కలుగుతుంది.

10/30/2018 - 01:25

ఉజ్జయినీ(ఎంపీ), అక్టోబర్ 29: ప్రధాని నరేంద్రమోదీ తప్పిదాల వల్లే జమ్మూకాశ్మీర్ మండిపోతోందని, తుపాకీల మోతకు ఆయనే కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. మధ్యప్రదేశ్‌లోని ఓ ఎన్నికల సభలో సోమవారం రాహుల్ మాట్లాడుతూ ‘వన్ ర్యాంక్- వన్ పెన్షన్’ పథకంపై మోదీ అబద్దాలాడుతున్నారని ధ్వజమెత్తారు. అసలు ఆ పథకం అమల్లో అనేక లొసుగులున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు ఎద్దేవా చేశారు.

Pages