S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/01/2018 - 04:59

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని జాతీయ నాయకులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరించారు.

11/01/2018 - 05:48

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని తిత్లి తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.229.05 కోట్లు విడుదల చేసింది. ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధి నుండి కేంద్రం వాటాగా 2018-10 సంవత్సరానికి అడ్వాన్సుగా ఈ మొత్తం విడుదల చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. తిత్లి తుపాను అక్టోబర్ 11న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో బీభత్సం సృష్టించటం తెలిసిందే.

11/01/2018 - 01:31

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణ శాసన సభకు పోటీచేసే పార్టీ అభ్యర్థుల జాబితాను ఒకటి, రెండు రోజులు లేదా దీపావళి మరుసటి రోజు ప్రకటించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితాతోపాటు మిత్రపక్షాల జాబితాను కూడా ప్రకటించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

11/01/2018 - 04:52

* ప్రపంచంలో ఎతె్తైన 182 మీటర్ల విగ్రహం ఆవిష్కరణ * 70 వేల టన్నుల సిమెంట్, 18,500 టన్నుల స్టీలు
* 1700 మెట్రక్ టన్నుల కాంస్యం వినియోగం

11/01/2018 - 04:53

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఈ ఏడాది దేశంలోని వివిధ రాష్ట్రాల పోలీసు డీజీపీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారుల సమావేశాలు ప్రపంచంలోనే ఎత్తయన 182 మీటర్ల పటేల్ విగ్రహం వద్ద ఉన్న భవనంలో జరుగుతాయి. ఈ వివరాలను కేంద్రం వెల్లడించింది. ప్రపంచంలోనే ఎత్తయన పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ఆవిష్కరించిన విషయం విదితమే. ప్రతి ఏడాది పోలీసు ఉన్నతాధికారుల వార్షిక సమావేశాన్ని కేంద్ర హోంశాఖ నిర్వహిస్తుంది.

10/31/2018 - 22:42

ధర్మశాల, అక్టోబర్ 31: దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ధర్మశాలలోని హోటళ్లు దీపావళి సందర్భంగా భారీ డిస్కౌంట్లతో ముందుకొస్తున్నాయి. పర్యాటకులను ఆకట్టుకునేందుకు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. పర్వత ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్‌లో ధర్మాశాల టూరిస్ట్ హబ్‌గా విరాజిల్లుతోంది. అయితే ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు హోటల్ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపింది.

10/31/2018 - 22:41

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: మోదీ ప్రభుత్వ ‘అవినీతి నావ’ ఇక ఎంతోకాలం పయనించలేదని అది మనగడం ఖాయమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.

10/31/2018 - 22:41

జైపూర్, అక్టోబర్ 31: రాజస్థాన్ ఎన్నికల నేపథ్యంలో నగదు తరలిస్తున్న వారిపై పోలీసులు నిఘా అధికం చేశారు. లెక్కలు చూపని 18 లక్షల నగదును పోలీసులు బుధవారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు హవాలా వ్యాపారులను వారు అదుపులోకి తీసుకున్నారు. భిల్‌వారా జిల్లా పోలీసుల కథనం ప్రకారం గోల్‌ప్యా, నాగౌరి గార్డెన్ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఈ మొత్తాన్ని పట్టుకున్నారు.

10/31/2018 - 22:40

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఎయిర్‌సెల్- మాక్సిస్ మనీల్యాండరింగ్ కేసులో నిందితుడైన మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం ఆంటిసిపేటరీ బెయిల్ కోసం పెట్టుకున్న విజ్ఞప్తిని తిరస్కరించాలని ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఢిల్లీ కోర్టును కోరింది. అంతేగాక విచారణ నిమిత్తం చిదంబరాన్ని తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది.

10/31/2018 - 22:38

ఇస్లామాబాద్, అక్టోబర్ 31: దైవదూషణకు పాల్పడిందన్న ఆరోపణపై మరణశిక్ష విధించబడిన ఒక క్రైస్తవ మహిళపై ఆరోపణలను కొట్టివేస్తూ ఆమెను నిర్దోషిగా విడుదల చేస్తూ పాకిస్తాన్ సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మతపరమైన చట్టాలపై మైలురాయి అనదగ్గ ఈ తీర్పు వచ్చిన నేపథ్యంలో దేశంలో ఎలాంటి అల్లర్లు, నిరసనలు జరగకుండా అదికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Pages