S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/30/2018 - 01:23

జైపూర్, అక్టోబర్ 29: అసెంబ్లీ ఎన్నికల వేళ కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. రాజస్తాన్‌లో బీజేపీ మాజీ నేత హనుమాన్ బెనీవాల్ సోమవారం కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా భావసారుప్యత గల పార్టీలతో ఎన్నికల పొత్తు పెట్టుకుంటామని ఆయన ప్రకటించేశారు. రాజస్తాన్ అసెంబ్లీకి డిసెంబర్ 7న ఎన్నికలు జరుగనున్నాయి.

10/30/2018 - 00:48

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్‌డీఏను కోరింది. అలాగే తిత్లీ తుఫాన్‌కు నష్టపోయిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను ఆదుకోవాలని పార్టీ డిమాండ్ చేసింది.

10/30/2018 - 00:44

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోమవారం ఉజ్జయనీలోని మహాకాలేశ్వర ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. చిత్రంలో పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ జ్యోతిరాదిత్య సింధియా

10/29/2018 - 12:53

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని నాంగలోరుూ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మృతుల వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

10/29/2018 - 12:51

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను వైకాపా నేతలు కలిశారు. వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై కేంద్ర దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని వారు కోరారు. దాడి కేంద్రం ఆధ్వర్యంలోని విమానాశ్రయంలో జరిగింది కాబట్టి అది రాష్టప్రరిధిలోకి రాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నట్లు వైకాపా నేతలు కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు వెల్లడించారు.

10/29/2018 - 12:49

న్యూఢిల్లీ: వివాదాస్పదమైన రామజన్మ భూమి-బాబ్రీ మసీదు కేసు జనవరికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు వేశారు. జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్‌లు సంజయ్ కిషన్ కౌల్, కేఎం జోసఫ్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనున్నది.

10/29/2018 - 03:48

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: భారతీయ కుటుంబ వ్యవస్థ ఆదర్శప్రాయమైనదని, ఉమ్మడి కుటుంబాలను కాపాడుకోవాలని ఉపరాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు పిలుపు ఇచ్చారు. ఆదివారం తమ నివాసంలో రెండు రోజులపాటు నిర్వహించిన మిత్రుల ఆత్మీయ సంగమంలో ఆయన ప్రసంగించారు.

10/29/2018 - 03:42

శ్రీనగర్, అక్టోబర్ 28: జమ్మూకాశ్మీర్‌లో ఆదివారం ఉగ్రవాదులు జరిపిన వేర్వేరు దాడుల్లో ఒక పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)కి చెందిన ఒక కార్యకర్త మృతి చెందారు. శ్రీనగర్‌లో మిలిటెంట్లు 40 ఏళ్ల పీడీపీ కార్యకర్త మహ్మద్ అమీన్ దార్‌పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అమీన్‌ను ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడని అధికారులు తెలిపారు.

10/29/2018 - 03:41

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల (అత్యాచారాల నిరోధక) చట్టానికి చేసిన సవరణలను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో గట్టిగా సమర్థించుకుంది. ఈ చట్టం కింద అరెస్టులను నీరుగార్చేట్టుగా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టానికి సవరణలు చేసిన విషయం తెలిసిందే. చట్టాలకు ఇలాంటి సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందని కూడా ప్రభుత్వం పేర్కొంది.

10/29/2018 - 03:26

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్‌లాల్ ఖురానా శనివారం రాత్రి పొద్దుపోయాక కన్నుమూశారు. 82 ఏళ్ల వయస్సున్న ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఖురానా భౌతికకాయానికి బీజేపీ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. ఢిల్లీ ప్రభుత్వం రెండు రోజుల సంతాపదినాలను ప్రకటించింది. ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయ. బీజేపీ నాయకుడైనా ఖురానా 1993-1996లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

Pages