S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/31/2018 - 06:28

న్యూఢిల్లీ: సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాపై అవినీతి కేసులో ఏ-2గా ఉన్న హైదరాబాద్ వ్యాపారవేత్త సానా సతీష్‌పై విచారణ నిలుపుదల చేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తనకు రక్షణ కల్పించాలని, అరెస్టు చేయకుండా చూడాలన్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం విచారించింది.

10/31/2018 - 05:20

జైపూర్: ఎన్నికల ప్రచార ర్యాలీలో రెండు వర్గాల మధ్య వైషమ్యాలకు ఆజ్యం పోసేలా వ్యాఖ్యానాలు చేసిన ఆరోపణలపై రాజస్థాన్‌కు చెంది న మంత్రిపై ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదైంది. గత శనివారం జరిగిన ఈ ర్యాలీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధన్‌సింగ్ రా వత్ వివాదాస్పద ప్రసంగానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

11/01/2018 - 21:36

భోపాల్/ఇండోర్, అక్టోబర్ 30: తనను పన్ను ఎగవేతదారుడని నిందించడమే కాకుండా తన పేరు పనామా పేపర్ల జాబితాలో ఉన్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించడం తగదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ అన్నారు. స్ధానిక కోర్టులో క్రిమినల్ కేసు కింద పరువునష్టం దావా దాఖలు చేసినట్లు ఆయన చెప్పారు. తనను ఉద్దేశ్యపూర్వకంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కించపరిచారన్నారు.

10/31/2018 - 05:11

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై హత్యాయత్నం విషయంలో వాస్తవాలు బయటకు రావాలంటే థర్డ్ పార్టీ చేత విచారణ జరిపించాల్సిందేనని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఢిల్లీలో మంగళవారం ఆ పార్టీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, బొత్స సత్యనారాయణ, విజయ సాయిరెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడారు.

10/30/2018 - 23:12

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని గియసెప్పే కాంటేతో మంగళవారం నాడిక్కడ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాభివృద్ధి, వివిధ రంగాల్లో పెట్టుబడుల వంటి ప్రధాన అంశాలపై ఈ సందర్భంగా ఇద్దరి మధ్య చర్చలు సాగాయి. ఇటలీ ప్రధాన మంత్రి కాంటే మంగళవారం ఉదయం ఇక్కడుకు చేరుకోగా భారత ప్రధాని మోదీ ఆయనకు సాదర స్వాగతం పలికారు.

10/30/2018 - 22:25

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని సీబీఐ డైరెక్టర్ అస్థానా లంచం కేసులో అరెస్టయిన మధ్యవర్తి మనోజ్ ప్రసాద్ కేసును నవంబర్ ఒకటిన విచారిస్తామని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ప్రకటించింది.

10/30/2018 - 23:14

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: ఢిల్లీలో వాతావరణ కాలుష్య తీవ్రత రికార్డు స్థాయిలో నమోదుకావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరించింది. పొరుగు రాష్ట్రాల్లో రైతులు పొలాల్లో పంట ఉత్పత్తుల చెత్తను కాల్చుతున్నారు. దీంతో వాయు నాణ్యత సూచిక 401 నమోదైంది. ఈ సీజన్‌లో గరిష్ట స్థాయిలో నమోదు కావడం ఇది తొలిసారి.

10/30/2018 - 23:13

ముంబయి, అక్టోబర్ 30: మాలెగావ్‌లో 2008లో జరిగిన పేలుళ్లలో నిందితులుగా లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, మరో ఐదుగురిపై అభియోగాలను ప్రత్యేక కోర్టు నిర్ధారిస్తూ విచారణకు శ్రీకారం చుట్టింది. నేరపూరిత కుట్ర, హత్య, ఉగ్రవాద కార్యకలాపాలు, ఇతర ఆరోపణలపై ప్రత్యేక నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) కోర్టులో ఏడుగురిపై కేసు దాఖలైంది.

10/31/2018 - 01:47

న్యూఢిల్లీ: దీపావళి పండుగ రోజుబాణా సంచాను కాల్చేందుకు సంబంధించి తమిళనాడు, పాండిచ్ఛేరి ప్రభుత్వాలు తమకు అనుకూలమైన వేళలను నిర్ణయించుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. కాని రెండు గంటలకు మించి సమయం ఇవ్వరాదని స్పష్టం చేసింది. దీపావళి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణా సంచాను కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన విషయం విదితమే.

10/30/2018 - 22:20

ఢాకా, అక్టోబర్ 30: అవినీతి కేసుల్లో జైలు శిక్షను అనుభవిస్తు న్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీ దా జియాకు వచ్చే ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హతను కోల్పోయా రు. ఆమెకు రెండు అవినీతికేసుల్లో 17 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు లు తీర్పులు ఇచ్చాయి. ఈ శిక్షలను కోర్టు రద్దుచేస్తే ఖలీద్ జియాకు పోటీ చేసేందుకు అవకాశం వస్తుంది. ఈ వివరాలను అటార్నీ జనరల్ మెహబూబ్ అలాం చెప్పారు.

Pages