S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/24/2018 - 02:05

తిరువనంతపురం, అక్టోబర్ 23: శబరిమల దేవాలయం పవిత్రతకు భంగం కలిగించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పడానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తున్నాయని, మహిళా భక్తులను అడ్డుకోవడం వెనుక కుట్ర దాగి ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు.

10/24/2018 - 02:02

ముంబయి, అక్టోబర్ 23: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందే జాతీయస్థాయిలో బీజేపీయేతర పక్షాలతో కూటమిని ఏర్పాటు చేయడం బహుశా సాధ్యం కాకపోవచ్చునని, అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఆ పార్టీలన్నింటినీ ఒక వేదికమీదకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాన ని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్‌పవార్ అన్నారు.

10/24/2018 - 02:00

శ్రీనగర్, అక్టోబర్ 23: కాశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పడానికి పాకిస్తాన్ సహా ఎవరితోనైనా చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ఇక్కడ ప్రకటించారు. అయితే ఒకపక్క ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతుంటే చర్చలు కొనసాగవని, ఈ రెంటికీ ఎప్పుడూ పొంతన కుదరదని తేల్చి చెప్పారు.

10/24/2018 - 01:57

ముంబయి, అక్టోబర్ 23: శరణార్థులు, అక్రమ వలసదారుల మధ్య తేడా ఉందని, ఈ విషయాన్ని గుర్తించాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. అస్సాంలో జాతీయ పౌరరిజిస్టర్ పౌరసత్వం (సవరణ) బిల్లు అంశంపై మాట్లాడుతూ పై విధంగా అన్నారు. కొన్ని నెలల క్రితమే జాతీయ పౌరరిజిస్టర్ ముసాయిదాను ప్రచురించినట్లు చెప్పారు.

10/24/2018 - 01:55

చైనా ప్రజా భద్రత వ్యవహారాల మంత్రి ఝావోకేఝీ మంగళవారం ఢిల్లీలో
ప్రధాని నరేంద్రమోదీని కలుసుకొని కరచాలనం చేస్తున్న దృశ్యం

10/24/2018 - 01:48

గువాహటి, అక్టోబర్ 23: ఈనెల 25 నుంచి అసోంలోని గువాహటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండో ఎడిషన్‌లో 50 దేశాలకు చెందిన 108 చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. ఏడురోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఎనిమిది మంది అంబాసిడర్లు సహా 45 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొంటారు.

10/24/2018 - 01:28

జైపూర్, అక్టోబర్ 23: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధే తన అజెండా అని, అభివృద్ధి గురించి ఈ ఎన్నికల్లో మాట్లాడే సత్తా కాంగ్రెస్‌కు ఎంతమాత్రం లేదని కేంద్ర మంత్రి, రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాష్ జావడేకర్ అన్నారు.

10/24/2018 - 01:25

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: దేశంలో ప్రతిష్టాత్మకమైన వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. సీబీఐ ప్రతిష్ట మసకబారే విధంగా కేంద్రం చర్యలు ఉన్నాయన్నారు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేశారు. దేశాన్ని, వ్యవస్థలను బలహీనపరిచేందుకు బీజేపీ చేస్తున్న ఎత్తుగడలను ఓడించాలన్నారు.

10/24/2018 - 01:24

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: చత్తీస్‌గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పెద్ద మెజార్టీతో గెలుస్తుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి సరోజ్ పాండే ఆశాభావం వ్యక్తం చేశారు. అజిత్ జోగీ పార్టీ, బీఎస్పీ పార్టీల మధ్య ఉన్న పొత్తు వల్ల కాంగ్రెస్ ఓటుబ్యాంకుకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. వరుసగా నాల్గవసారి బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.

10/24/2018 - 01:12

న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను వచ్చేనెల మొదటి వారంలో విడుదల చేస్తామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆర్‌సీ కుంతియా వెల్లడించారు. ఢిల్లీలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)ని ఓడించడమే మహాకూటమి ఉమ్మడి లక్ష్యమని స్పష్టం చేశారు.

Pages