S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/23/2018 - 02:57

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుపై తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. విష్ణువర్థన్ రెడ్డి సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు.

10/23/2018 - 02:01

పంబ(కేరళ), అక్టోబర్ 22: సుప్రీం కోర్టు తీర్పు అనంతరం శబరిమలలో తలెత్తిన ఉద్రిక్తతలు కొనసాగాయి. సోమవారం ఓ మహిళ శబరిమల కొండపైకి ఎక్కేందుకు విఫలయత్నం చేసింది. అయ్యప్ప భక్తులు ఆమె ప్రయత్నాలను వమ్ముచేశారు. నెలవారీ పూజల తరువాత రాత్రి పది గంటలకు ఆలయం ద్వారాలు మూసివేయనున్నట్టు ప్రకటించిన దృష్ట్యా ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. బిందు అనే దళిత కార్యకర్త కొండపైకి వెళ్లేందుకు యత్నించింది.

10/23/2018 - 02:00

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ప్రధాని మోదీ ప్రభుత్వం మోసగాళ్లను ప్రోత్సహిస్తోందని, వారు దేశం వదలిపోవడానికి సహాయం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.

10/23/2018 - 02:05

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలోని పెట్రోలు, సీఎన్‌జీ డీలర్లు బంద్ పాటించారు. దీనిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, పెట్రోలు బంక్ యాజమాన్యాలపై కేంద్రం ఐటీ దాడులు చేయిస్తోందని, దీనికి భయపడే బంద్ పాటిస్తున్నారని వెల్లడించారు.

10/23/2018 - 01:56

తిరువనంతపురం, అక్టోబర్ 22: కేంద్ర ప్రభుత్వం వరదలు, భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడంలో వివక్ష చూపుతోందని కేరళ ముఖ్యమంత్రి పీ విజయన్ విమర్శించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకు కేంద్రం తగిన సాయం చేయడం లేదని సోమవారం ఇక్కడ ఆరోపించారు. అమ్మపెట్టదు, అడుక్కు తిననీయదన్న సామెతగా కేంద్రం తీరు ఉందని ఆయన ధ్వజమెత్తారు.

10/23/2018 - 01:54

జైపూర్, అక్టోబర్ 22: వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిన రాఫెల్ ఒప్పందమే మోదీ ప్రభుత్వాన్ని ముంచుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు.

10/23/2018 - 01:52

దక్షిణ కాశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఓ పేలుడులో ఏడుగురు పౌరుల మరణానికి నిరసనగా
వేర్పాటు వాదులు ఇచ్చిన బంద్ పిలుపు కారణంగా నిర్మానుష్యమైన రోడ్లు.

10/23/2018 - 01:42

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడలు బళ్లవుతాయా? బళ్లు ఓడలవుతాయా? అన్న రాజకీయ ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

10/23/2018 - 00:42

న్యూఢిల్లీ: తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ రిజర్వ్‌డ్ స్థానాల అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుంది. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలోని వార్‌రూమ్‌లో దళిత, గిరిజన నాయకులతో విడివిడిగా సమావేశమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత భక్త చరణ్‌దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నేతలతో సమాలోచనలు జరిపింది.

10/22/2018 - 14:14

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో ఈ రోజ ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 3 పాయింట్లుగా నమోదైంది. ఈ భూకంపం కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదు.

Pages