ఫోకస్

సదుపాయాల్లేవ్.. విశ్వనగరం ఎలా సాధ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో మిగతా రాజకీయ పార్టీల కంటే అధికార టిఆర్‌ఎస్ పార్టీకి కొంత అవకాశం దొరికింది. డివిజన్ల రిజర్వేషన్లపై ఆ పార్టీ అధికారంలో ఉండటం వల్ల లోపాయికారికి ముందుగా తెలిసే అవకాశం ఏర్పడింది. దీంతో ఏ డివిజన్‌లో ఎవరిని బరిలోకి నిలబెట్టాలనే దానిపై టిఆర్‌ఎస్ పార్టీ ముందుగానే కసరత్తు చేసుకోగలిగింది. ఇలాంటి అవకాశం ఇతర పార్టీలకు లేకుండా పోయింది. అలాగే ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్ పార్టీ మూడు నెలల ముందుగానే బ్యానర్లు కట్టడం, హోర్డింగ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అధికారంలో ఉండటం వల్ల ఆ పార్టీకి లభించిన ఇది మరో అవకాశం. చెట్టు ఎక్కిన వాడికి మంచి పళ్లు దొరుకుతాయన్నది సామెత. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీది చెట్టు ఎక్కిన వైనం. మిగతా పార్టీల కంటే టిఆర్‌ఎస్ పార్టీకే జిహెచ్‌ఎంసి ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ నగరంపై రాజకీయంగా ఆధిపథ్యం కోసం టిఆర్‌ఎస్ పార్టీ సర్వశక్తులను ఒడ్డుతుంది. జిహెచ్‌ఎంసి పీఠాన్ని చేజిక్కించుకోవాల్సిన అవసరం ఇతర పార్టీల కంటే టిఆర్‌ఎస్‌కే ఎక్కువ అవసరం. టిడిపికి జిహెచ్‌ఎంసిలో గెలిచిన, ఓడినా పెద్దగా ఒరేగేది ఏమి ఉండదు. ఆ పార్టీ ఎలాగు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇంకా నిద్రాణమైనస్థితి నుంచి బయట పడలేదు. ఆ పార్టీకి నాయకత్వ లోపం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నైతిక విలువలు, నీతివంతమైన రాజకీయాలను కోరుకునే సిపిఐ, సిపిఎం, న్యూడెమాక్రసీ పార్టీలతో కలిసి లోక్‌సత్తా పార్టీ కూటమిగా పోటీ చేస్తుంది. తమ కూటమి ‘వన్ హైదరాబాద్’, ‘క్లీన్ పాలిటిక్స్’ నినాదంతో పోటీ ప్రచారం చేస్తుంది. ఇక ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ 60-70 సీట్లను గెలుచుకున్నా సరిపోతుంది. ఎలాగు ఆ పార్టీకి ఎంఐఎంతో అవగాహన ఉండటంతో ఈ రెండు పార్టీలు కలిసి జిహెచ్‌ఎంసి పీఠాన్ని దక్కించుకోవడం పెద్ద సమస్య ఏమి కాదు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని టిఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారం నెరవేరే కల కాదు. కనీస వౌలిక సదుపాయాలను కల్పించకుండా విశ్వనగరంగా తీర్చిదిద్దడం సాధ్యం కాదు. కేవలం ప్రచారం కోసం ఆ పార్టీ ఆ నినాదాన్ని ఎంచుకుంది తప్పితే, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నీతివంతమైన, నైతిక విలువలతో కూడిన తమ కూటమిని గెలిపిస్తే చిత్తశుద్ధితో నగరాభివృద్ధికి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాం.

- పాండురంగారావు అధ్యక్షుడు, లోక్‌సత్తా, తెలంగాణ రాష్ట్రం