ఫోకస్

ఎంతో చేశాం.. ఇంకా చేయాల్సి ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిథిలో ఎంతో అభివృద్ధి చేశాం. ఇంకా చేయాల్సిందీ చాలా ఉంది. హైదరాబాద్ అభివృద్ధిలో మా మజ్లిస్ పార్టీ కీలకపాత్ర పోషించింది. లోగడ ప్రకాశ్‌రావు, ఎ.సత్యనారాయణ, ఆలంపల్లి పోచయ్య, మాజిద్ హుస్సేన్ మేయర్లుగా ఉన్నప్పుడు రోడ్ల వెడల్పు కార్యక్రమాన్ని వేగవంతం చేశాం. మా హయాంలోనే డబీర్‌పురా, ఖైరతాబాద్ వంతెనల నిర్మాణం జరిగింది. నాడు ఎంసిహెచ్‌కు తక్కువ బడ్జెట్ ఉన్నా, ఇటువంటివి ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. ఐదేళ్ళూ ఆస్థి పన్ను పెంచనీయకుండా చూశాం. ఫ్లైవోవర్ల నిర్మాణం చేశాం, టాయ్‌లెట్ల నిర్మాణం, ఫంక్షన్ హాళ్ళ నిర్మాణానికి అనుమతి ఇచ్చాం, మాడ్రన్ లైటింగ్‌ను తీసుకుని వచ్చాం. గత జిహెచ్‌ఎంసి స్టాండింగ్ కమిటీ చేసిన 3 సిఫార్సులను ఇటీవల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముందు పెట్టడంతో ఆయన వెంటనే అంగీకరించారు. ఏటా 1200 రూపాయలలోపు ఆస్థి పన్ను చెల్లిస్తున్న వారికి 101 రూపాయలు నామమాత్రంగా తీసుకోవాలని, మురికివాడల్లో నల్లా బకాయిలను, విద్యుత్తు బకాయిలను మాఫీ చేయాలని తాము చేసిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి అంగీకరించారు.
ఇలాఉండగా ఎంసిహెచ్‌లో నగర శివారులోని 12 మున్సిపాలిటీలను విలీనం చేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌గా ప్రభుత్వం మార్పు చేసింది. అప్పట్లో స్టాండింగ్ కమిటీ మజ్లిస్ అధీనంలో ఉండేది. స్టాండింగ్ కమిటీకి అధికారాలు ఉన్నందున, వాటికి కత్తెర వేసేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చట్ట సవరణ చేసి, మేయర్‌కే స్టాండింగ్ కమిటీ ఎక్స్-అఫిషియో చైర్మన్‌గా విధులు, నిధులు అప్పగించారు. 12 మున్సిపాలిటీల విలీనంతో గ్రేటర్ హైదరాబాద్ పరిథి 169 నుంచి 650 మీటర్లకు పెరిగింది. జనాభా రెండింతలు అయ్యింది. అందుకు అనుగుణంగా వౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవశ్యకత ఉంది. నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మార్చాల్సి ఉంది. ఒక్క గంట పాటు వర్షం కురిస్తే రోడ్లు జలమయమై ప్రయాణికులు నానాఅవస్థలు పడుతున్నారు. ఇటువంటివి ఎనె్నన్నో చేపట్టాల్సి ఉంది. ఎంసిహెచ్‌లో వంద డివిజన్లు ఉన్నప్పుడు 38 డివిజన్లను కైవసం చేసుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడ్డాం. 2002లో జరిగిన ఎన్నికల్లో 36 స్థానాలు కైవసం చేసుకున్నాం. జిహెచ్‌ఎంసి ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ 52, టిడిపి 45, మజ్లిస్ 43 స్థానాల్లో విజయం సాధించింది. ఈ దఫా 60 స్థానాలకు పోటీ చేసి, అన్నింటినీ సునాయసంగా కైవసం చేసుకోబోతున్నాం.

సయ్యద్ ఆమీన్ జాఫ్రీ, ఎమ్మెల్సీ, మజ్లిస్ పార్టీ సీనియర్ నాయకుడు