ఫోకస్

మతాల మధ్య చిచ్చుపెట్టడమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిజర్వేషన్లు పెంచాలన్నా, తగ్గించాలన్నా నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి మాత్రమే ఉంటుంది. కేంద్ర అనుమతి లేకుండా ప్రస్తుతం అమలు జరుగుతున్న రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు. తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామనడం మతాల మధ్య చిచ్చు పెట్టడమే. మతపరమైన రిజర్వేషన్లను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిందే. సమాజంలో అసమానతలు పోవాలని, సమ సమాజ స్థాపన జరుగాలని ఒకవైపు కోరుకుంటూ మరోవైపు రిజర్వేషన్ల శాతాన్ని పెంచుకోవడంలో అర్థం లేదు. మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తే ఎట్టి పరిస్థితిలో అంగీకరించేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకోవాలి. లేకుంటే న్యాయపోరాటంతో పాటు పెద్దఎత్తున ఆందోళన చేయడానికైనా సిద్ధమే. ముస్లింలను విద్యాపరంగా కానీ ఆర్థికంగా కానీ అభివృద్ధి చేయడానికి కొత్త పథకాలను ప్రవేశ పెట్టవచ్చు, నిధులు కేటాయించవచ్చు కానీ మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగం అంగీకరించదు. దీనిని న్యాయస్థానాలు కూడా అంగీకరించవు. ఒక మతానికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించడాన్ని రాజ్యాంగం అంగీకరించదని తెలిసి కూడా రిజర్వేషన్లు ప్రవేశపెడుతామని ఆశలు కల్పించడం ఓట్ల రాజకీయమే తప్ప మరొకటి కాదు.

- డాక్టర్ పొనగోటి కిషన్‌రావు అసిస్టెంట్ ప్రొఫెసర్, నిజాం కళాశాల ఎబివిపి జిల్లా ప్రముఖ్