ఫోకస్

అన్నిటికీ రిమోట్ మన చేతిలోనే ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీవిలో, సినిమాల్లో అశ్లీల దృశ్యాలు, టీవిల్లో సినిమా ప్రచార కార్యక్రమాల్లో ద్వంద్వార్థాలు మితిమీరిపోయాయి. వాళ్లు ఎంత మితిమీరినా రిమోట్ మన చేతిలోనే ఉంటుంది. టీవిల్లో ఇలాంటి అశ్లీల మాటలను నివారించాలి అనుకున్నప్పుడు రిమోట్ తీసుకుని చానల్ మార్చడం మంచిది. చానళ్లలో ఏ కార్యక్రమానికి రేటింగ్ ఎలా ఉంది అనే లెక్కలు ఉంటాయి. అశ్లీలతపై యుద్ధం ప్రకటించి చానల్ మార్చినప్పుడు సహజంగా రేటింగ్ పడిపోతుంది. అదే సమయంలో అశ్లీల కార్యక్రమాలను ఎక్కువమంది చూస్తే రేటింగ్ పెరుగుతుంది. ఏం చేయాలి అనేది మన చేతిలోనే ఉంది. టీవిల్లో, సినిమాల్లో కనిపిస్తున్న మితిమీరిన అశ్లీలం మన సంస్కృతి సంప్రదాయం కాదు. ఇది మనను మనమే కించపరుచుకోవడం. ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి వంటివారు సినిమాల్లో ఉన్నప్పుడు కళ్లతోనే భావాన్ని చూపించేవారు. ఇప్పటిలా పిచ్చి మాటలు, పిచ్చి వేషాలు, పిచ్చి దుస్తులు ఉండేవి కాదు. భాష అనేది మన సంస్కృతిని చాటి చెబుతుంది. ద్వంద్వార్థాలతో మాట్లాడటం ఎక్కువయింది. టీవి, సినిమాల్లో ఇలాంటి మాటలు దృశ్యాల ద్వారా నేర ప్రవృత్తి పెరుగుతుంది. సినిమాలోనే ఈ దృశ్యాలు అంటే ఆ సినిమాల ప్రమోషన్‌లో మరింత అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. ఇలాంటివి అప్పుడప్పుడు వివాదం అవుతున్నాయి. మాకిది కామన్ అన్నట్టుగా వారి వ్యవహారం సాగుతోంది.
సెన్సార్‌కన్నా ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడం అవసరం. సినిమా తీసేవారికి, సెన్సార్ వారికి, చివరకు చూసే ప్రేక్షకులకూ స్వీయ నియంత్రణ అవసరం. సెన్సార్ బోర్డులో ఇలాంటి వాటికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తే, హిందుత్వవాది అని విమర్శల దాడి చేస్తున్నారు. విలువలు పాటించే వారిని సెన్సాన్ బోర్డు సభ్యులుగా నియమించాలి. టీవిలో ప్రసారమయ్యే కార్యక్రమాలు ఇంట్లో అంతా కలిసి చూసే విధంగా ఉండాలి. దీనికి టీవి యాజమాన్యాలే స్వీయ నియంత్రణ పాటించాలి. రేటింగ్‌లే దేన్నయినా నిర్ణయించే పరిస్థితి ఉంది కాబట్టి ఈ అంశానే్న విలువలు కోరుకునేవారు కూడా ఆధారం చేసుకోవడం మంచి ఆయుధం. అశ్లీల దృశ్యాలు, అభ్యంతరకరమైన డైలుగులు ఉండే కార్యక్రమాలకు దూరంగా ఉండం మంచిది. వెంటనే రిమోట్‌తో చానల్ మార్చేయాలి. ఎవరూ చూడనప్పుడు ఆ టీవివాళ్లు కూడా అలాంటి కార్యక్రమాలు ప్రసారం చేయరు. అయితే సినిమా, టీవి అనే బలమైన మాధ్యమాన్ని సమాజ హితానికి ఉపయోగించాలి అనే ఆలోచన వారికి ఉండాలి.
త్రిపురనేని హనుమాన్ చౌదరి, ప్రజ్ఞ్భారతి