ఫోకస్

సంస్కారమే ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో మహిళలకు సమాన గౌరవం లభించాలి. టివీల్లోనూ సినిమాల్లోనూ, ఇతర మాధ్యమాల్లోనూ స్ర్తిలను కించపరిచే విధంగా డైలాగులు, సన్నివేశాలు ఉండటం సముచితం కాదు. చట్టం ఎలా ఉన్నప్పటికీ, మహిళల అంశంలో సామాజిక కోణమే ముఖ్యమైంది. సినిమాలు తీసేవారు, టివీల్లో కార్యక్రమాలు రూపొందించేవారు, పుస్తకాలు రాసేవారు తదితరులంతా తమ కుటుంబంలో తల్లి, భార్య, అక్కాచెల్లెళ్లు, కూతుళ్లు తదితరుల మధ్య జీవిస్తుంటారు. మహిళలు కించపరిస్తే తమ కుటుంబంలోని వారినే కించపరచినట్టు అవుతుందని అర్థం చేసుకోవాలి. అందుకే జాగ్రత్తగా డైలాగులు, కథాంశాలు, ప్రసంగాలు ఉండేలా చూసుకోవాలి. మహిళ అంటే సమాజంలో ఒక భాగం. ప్రతి ఇంట్లో పురుషులు, స్ర్తిలు ఉంటారు. ఒక మహిళకు తండ్రి, అన్నాతమ్ములు, భర్త, కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు ఉంటారు. అంటే ఒక మహిళ మగవారి మధ్యనే జీవించాల్సి ఉంటుంది. తల్లి తన పిల్లలకు చిన్నప్పటినుండే సంస్కారం నేర్పించాలి. ఈనాటి చదువులు భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలకు అనువుగా లేవు. రామాయణం, మహాభారతం తదితర పుస్తకాలతో పాటు భారతీయ జీవన విధానంలో మనిషి మనిషిగా తీర్చిదిద్దేందుకు వీలుగా కథలు, చరిత్ర ఉన్నాయి. వీటి గురించి పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత పెద్దలపై ఉంటుంది. తల్లిదండ్రులు లేదా ఇంట్లోని ఇతర పెద్దలు తమ పిల్లలను చిన్నప్పటి నుండే క్రమశిక్షణ కలిగిన వారిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించాలి. ఆదర్శజీవనాన్ని కొనసాగించిన అనేక పాత్రలు మన పురాణాలు, చరిత్రలో ఉన్నాయి. వాటి గురించి పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది. సమాజానికి ఉపయోగపడేవారిగా, మంచి వ్యక్తిత్వం ఉన్న వారిగా మగపిల్లలను రూపొందించే బాధ్యత కుటుంబం సభ్యులదేనని గుర్తించుకోవాలి.
- సి. సుమలత, డైరెక్టర్, జుడీషియల్ అకాడమి