కడప

జిల్లాకు రైతు రథాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూన్ 9: ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు రైతుల సంక్షేమం కోసం తాజాగా ప్రవేశపెట్టిన రైతు రథం పథకం కింద సబ్సిడీ ధరతో రైతులకు వ్యవసాయం నిమిత్తం జిల్లాకు వెయ్యి ట్రాక్టర్లు పైనే మంజూరుకానున్నాయి. ఈ ట్రాక్టర్లు నియోజకవర్గాల వారిగా కేటాయింపులు జరగనున్నాయి. శుక్రవారం ఏరువాక పున్నమి సేద్యంలో భాగంగా జిల్లా మంత్రి సి.ఆదినారాయణరెడ్డి రాష్టవ్య్రాప్తంగా 7వేల ట్రాక్టర్లు రైతులకు అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే రైతుమిత్ర గ్రూపుల కింద 50శాతం సబ్సిడీతో రైతులకు సేద్యం నిమిత్తం పరికరాలు అందజేస్తున్న తరహాలోనే ఈ ట్రాక్టర్లు కూడా అందజేయనున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో రాజకీయ పరపతి కలిగిన సేద్యం తెలియని రైతులకే ఈ ట్రాక్టర్లు లభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గతంలో రైతులకు సబ్సిడీ కింద పంపిణీ చేసిన పథకాలన్నీ పక్కదారిపట్టాయి. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమాలను అరికట్టేందుకు 1100 టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటుచేసి అవినీతి అక్రమాలకు చెక్‌పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. మొత్తంమీద రైతు రథాల ద్వారా కొంతమంది రైతులకు వ్యవసాయం చేసుకునేందుకు ప్రభుత్వం ఊరట కలిగించింది. ఏదేమైనా రైతు రథం పథకానికి తూట్లుపడకుండా నాయకులు, అధికారులు స్పందించి అర్హులకే ట్రాక్టర్లు దక్కేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.