ఫోకస్

నియంత్రణకు అథారిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత విద్య కోర్సుల వరకు ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలి. తల్లితండ్రులు తమ పిల్లలను పోటీపడి అప్పులు చేసి కార్పొరేట్ కానె్వంట్ స్కూళ్లలో చేరుస్తున్నారు. దీనివల్ల సమాజంలో అసమానతలు నెలకొంటున్నాయి. పెద్ద గ్రామాలకు కూడా కార్పొరేట్ పాఠశాలలు విస్తరించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన వ్యవస్థ కుప్పకూలింది. ఈ వ్యవస్థను బాగు చేసేందుకు ప్రభుత్వం మొత్తం విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాల్సి ఉంటుంది. పాఠశాలల్లో కనీస వౌలిక సదుపాయాలను కల్పించాలి. మరుగుదొడ్లు, ఆటస్థలం సదుపాయాలను కల్పించాలి. మంచి ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితులున్నాయి. ఆరవ తరగతి నుంచే ఐఐటి, మెడిసెన్ ఎంట్రెన్స్‌కు ఫౌండేషన్ పేరిట కోచింగ్‌లు ఇచ్చే సంస్థలు వెలిశాయి. వీరుకూడా భారీఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నారు. కొన్ని కానె్వంట్లలో ఎల్‌కెజికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. సమాజంలో అసమానతలు పెచ్చుమీరి అశాంతికి దారితీసే ప్రమాదం ఉంది. ప్రభుత్వం బేషజాలకు పోకుండా విద్యారంగంలో ఫీజుల మహమ్మారినుంచి ప్రజలను రక్షించేందుకు ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారు చేసేందుకు చర్యలకు ఉపక్రమించాలి. ఫీజుల పేరిట దళితులు, గిరిజనులతోపాటు అన్ని వర్గాల ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. ఫీజుల నియంత్రణకు కచ్చితంగా రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేసి, నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై వేటు వేయాలి.
- విశే్వశ్వరరెడ్డి
వైకాపా శాసనసభాపక్ష ఉపనేత, ఏపి