ఫోకస్

గురుకులాలతో విద్యా విప్లవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చదువు మధ్య తరగతికి పెనుభారంగా మారింది. తమలా తమ పిల్లలు ఇబ్బందులపాలు కావద్దని బాగా చదువుకొని జీవితంలో ఎదగాలి అనే కోరికతో మధ్య తరగత ఎంతటి ఖర్చునైనా భరించి పిల్లలకు మంచి చదువు అందించాలని ప్రయత్నిస్తోంది. దీంతో కొందరికి విద్యా లాభసాటి వ్యాపారంగా మారింది. ప్రభుత్వ రంగంలోని విద్యా వ్యవస్థను నాణ్యతా ప్రమాణాలు పెంచడమే దీనికి మార్గం.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి దాదాపు నాలుగువందల గురుకులాలు రాష్ట్రంలో ప్రారంభం అయ్యాయి. నాగార్జున సాగర్‌లోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ఎంతో ప్రభావం చూపింది. అక్కడ చదివిన వారిలో ఎంతో మంది ఐఎఎస్‌లు అయ్యారు. ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ గురుకులాలను ప్రారంభించగానే అనేక ప్రాంతాల్లో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి గురుకులాల వైపు వస్తున్నారు. గురుకులాల్లో ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి ఏటా లక్షా 25వేల రూపాయల వరకు వ్యయం చేసి చక్కని విద్యను అందిస్తోంది. మంచి ఆహారం, చక్కని వాతావరణం, నాణ్యమైన విద్య అందించిన తరువాత ఆరోగ్యవంతమైన భవిష్యత్తు తరం తయారు అవుతుంది. దీన్ని వ్యయంగా చూడవద్దు మానవ వనరుల అభివృద్ధికి పెట్టుబడిగా భావించాలి. ప్రైవేటు విద్యా సంస్థలను మించి నాణ్యమైన విద్యను గురుకులాలు అందిస్తాయి. 202 మైనారిటీ గురుకులాల్లో 40 వేల మంది మైనారిటీ పిల్లలకు నాణ్యమైన విద్య అందనుంది. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ గురుకులాను ఏర్పాటు చేసినా ఈ గురుకులాల్లో అన్ని కులాల వారికి కొంత ఓపెన్ కోటా కూడా ఉంటుంది కాబట్టి అందరికీ అవకాశం లభిస్తుంది. ఇప్పుడు ప్రతి నియోజక వర్గంలో గురుకులాలు ఉన్నాయి. కొన్ని నియోజక వర్గాల్లో మూడు నాలుగు గురుకులాలు కూడా ఉన్నాయి. ఎంతో ఇబ్బంది పడి హైదరాబాద్‌కు వచ్చి చదువుకుందామంటే కొందరికి గదులు అద్దెకు కూడా దొరకని పరిస్థితి. ఇలాంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. దాంతో జూనియర్ కాలేజీలను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు మహిళలకోసం 30 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ప్రారంభించడం ద్వారా మహిళల విద్యకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఎంతో ముందు చూపుతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన గురుకుల విద్య తెలంగాణలో విద్యా రంగంలో ఒక విప్లవం.
- పల్లా రాజేశ్వర్‌రెడ్డి
టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్