కడప

ఇంటి వద్దకే పశువైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూన్ 22:జిల్లాలో పాడిరైతులకు తెలుగుదేశం ప్రభుత్వం పశువైద్య సంచార వాహనాలు ప్రవేశపెట్టిందని దీని ద్వారా ఇంటివద్దే పశువులకు వైద్యం అందుతుందని రాష్టప్రాడి పరిశ్రమ, పశుసంవర్థకశాఖ, మత్స్యశాఖ, మార్కెటింగ్, గిడ్డంగులశాఖ మంత్రి సి.ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో 5 పశువైద్య సంచార వాహనాలు ప్రారంభించారు. ఈ వాహనాలు కడప , రాజంపేట, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు డివిజన్లలో సంచరిస్తూ రోజుకు మూడు గ్రామాలు చొప్పున గ్రామాలు తిరుగుతూ పశువులకు ఇంటి వద్దే వైద్యం అందిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ పశువైద్యసంచార వాహనాలను పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ తరపున పశువుల ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్నామని జిల్లాకు మొత్తం 12వాహనాలు మంజూరుకాగా ఇప్పటికీ 5వాహనాలు నడుపుతున్నామని ,మరో 7వాహనాలు త్వరలో తెచ్చి ప్రతినియోజకవర్గానికి ఒక వాహనాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. ఈ వాహనాల ద్వారా పశువులకు అనారోగ్యం వస్తే సత్వరం వైద్యం అందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. గత కొద్దిరోజుల కిందట అమరావతి రాజధానిలో వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డితో కలిసి రాష్ట్రంలో ఉన్న పశువులకు ఆధార్ నెంబర్ కేటాయించి అందులో రైతు వివరాలు తెలియజేసే విధంగా ఓ సిస్టమ్‌రూపకల్పన చేశామని పేర్కొన్నారు. ప్రతి గ్రామం లో పశుగ్రాస క్షేత్రాల్లో ఏర్పాటుచేస్తున్నామని గుర్తు చేస్తూ ఆ గ్రామంలోనే 5 ఎకరాలు చొప్పున పశుగ్రాసం గడ్డిని పెంచేందుకు ఎకరాకు రూ.20వేలుచొప్పున రైతులకు ఇచ్చి 5 ఎకరాల్లో పశుగ్రాసం పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఉత్పత్తి అయిన పశుగ్రాసాన్ని కిలో ఒక్కరూపాయ చొప్పున ఆ గ్రామ రైతులకు విక్రయిస్తామని పేర్కొంటూ పాల ఉత్పత్తిని పెంచే శైలేజ గడ్డి జాతి మొక్కలను ఎక్కువగా పెంపొందిస్తామన్నారు. దీని వల్ల రైతులు పశువుల పెంపకం వల్ల అధిక ఆదాయాన్ని పెంపొందించుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చునన్నారు. అలాగే రైతులకు ఇంటి ఆవరణంలో పశువులవకోసం షెడ్యూల్డు ఏర్పాటుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చిస్తామన్నారు. ఈసమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి (వాసు), జిల్లాకార్యదర్శి హరిప్రసాద్, నాయకులు ఎస్.గోవర్దన్‌రెడ్డి, సుభాన్‌బాషా, పశుసంవర్థకశాఖ జెడి జయకుమార్, డిఆర్వో నరసింహారావు, పశువైద్యులు శ్రీనివాసులురెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రవికుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.