కడప

లోకేష్‌ను విమర్శించడం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూన్ 22:రాష్టమ్రంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్.లో కేష్ బాబును వైసిపి అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి విమర్శించే అర్హత లేదని మైనార్టీ రాష్టన్రేతలు జి.ఖాదర్‌బాషా, ఎస్.అల్లాబకష్, ఎస్సీ విభాగం నేత రామాంజనేయులు, రెడ్డేనాయక్, బిసి రాష్ట్ర మాజీ ప్రధానకార్యదర్శి రమణ తదితరులు గురువారం సాయంత్రం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. విశాఖ భూముల కుంభకోణం ఆ భూముల దురాక్రమణ పాపం జగన్ అనుచరగణాలవేనని రాష్ట్రంలో ఏ సంఘటన చోటుచేసుకున్నా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు, రాష్టమ్రంత్రి ఎన్.లోకేష్‌ను బాధ్యులను చేయడం ఆయనకు అలవాటై పోయిందని వారు పేర్కొన్నారు. లోకేష్‌పై జగన్ ఆరోపణలపై 48గంటల్లో నిరూపించుకోవాలని లోకేష్ బాబు విసిరిన సవాల్‌కు జగన్ సమాధానం చెప్పుకోవాలని లేనిపక్షంలో లోకేష్‌బాబుకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్‌చేశారు. దేశంలోనే అవినీతి అక్రమాల ఆరోపణలతో బరితెగించిన జగన్ 16నెలలు జైలుకు వెళ్లి సిబిఐ కేసు ఎదుర్కొనే వ్యక్తి కూడా తమ నాయకుడు లోకేష్‌ను విమర్శించడమా అని ప్రశ్నించారు. వివిధ రకాల సంఘటనలపై సిబిఐ దర్యాప్తునకు డిమాండ్ చేయ డం, ఆయన కేసుల విషయంలో సిబి ఐ ఏనాడైనా గౌరవించారా అని ప్రశ్నించారు..... 16కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ ఆ కేసుల నుంచి బయటపడి తమ నాయకుడు తప్పు చేసి వుంటే అప్పుడు సిబిఐకి డిమాండ్ చేయాలని వారు గుర్తుచేశారు. ఆయన తండ్రి హయాంలో భూ భాగోతాలు, భూ కుంభకోణాలు, సెజ్‌ల పేరుతో ఏడాది ఎకరాలు కబ్జాలు చేసిన వైసిపి నేతలు తమ నాయకుడిని విమర్శించడం గురివింద సామెతగా ఉందన్నారు. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞంగా మార్చి లక్షలాది కోట్లరూపాయలు లూఠీ చేసి తండ్రి అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని దోపిడీ చేసి మంత్రి లోకేష్‌పై అవాకులు చవాకులు అల్లడం వైసిపి నేతలకు షరామామూలైందన్నారు. అధికార దాహంతో ఇష్టమొచ్చినట్లు వైసిపి నేతలు మాట్లాడుతున్నారని ఎన్నటికీ వైసిపి అధికారంలోకి రాదని జోష్యం చెప్పారు. 2019 ఎన్నికలకు కడప జిల్లాలో 10అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌స్థానాలు టిడిపి అభ్యర్థులే దక్కించుకుంటారని ఘంటా పధంగా నొక్కిచెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌లు నిత్యం ప్రజలతో మమేకమై అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా పెట్టుకుని, రైతులకు పెద్దపీటవేసి , యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా విడుదలచేసి ఖరీఫ్ సీజన్‌కు పంటల సాగుకు ప్రభుత్వం చేయూతనిస్తోందని వారు గుర్తు చేశారు. ఏకకాలంలో జిల్లాకు ప్రత్యేక నిధులు విడుదల చేసి సాగునీటి సమస్య పరిష్కరించిన ఘనత లోకేష్‌దేనన్నారు. ఎండుదశలో ఉండే పండ్లతోటలకు ప్రభుత్వం నీటి ట్యాంకర్లు ఏర్పాటుచేసి పండ్లతోటలను రక్షించడం జరిగిందని వారు గుర్తు చేశారు. ఈపరిస్థితుల్లో మంత్రి లోకేష్‌ను విమర్శించే అర్హత ఏ ఒక్కరికీ లేదని లోకేష్ సవాల్‌ను వైసిపి నేతలు స్వీకరించి , విశాఖ భూకుంభకోణాలతోపాటు దేశంలో ఎక్కడైనా భూకుంభకోణాల్లో ప్రమేయం ఉంటే నిరూపించాలని లేనిపక్షంలో వైసిపి నేతలు రాజకీయ సన్యాసం పుచ్చుకోవాలని సవాల్ విసిరారు.