చిత్తూరు

రామాపురం అభివృద్ధి బాధ్యత నాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రాపురం, జూన్ 25: రామాపురం అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటా, ఇక్కడ ఏ సమస్య ఉన్నా దానిని నేను పరిష్కరించే బాధ్యత తీసుకుంటా, తిరుపతి నుంచి తరలిస్తున్న చెత్తను అడ్డుకోవద్దు అంటూ జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న చేసిన విజ్ఞప్తిని ఆప్రాంత ప్రజలు అంగీకరించడంతో గత కొద్ది రోజులుగా ఉద్రిక్తంగా మారిన చెత్త తరలింపు వ్యవహారం ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 7గంటల వరకు ఎంపి శివప్రసాద్, తిరుపతి నగరపాలక సంస్థ కమీషర్ హరికిరణ్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నలు రామాపురం గ్రామానికి చెందిన దాదాపు 500 మంది ప్రజలతో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఆందోళన జరుగుతున్న ప్రాంతంలోనే ఈ చర్చలు జరిగాయి. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న రామాపురంలో విస్తృతంగా పర్యటించారు. ప్రతి బోరు నుంచి నీటి నమూనాలను సేకరించారు. వాటిని ల్యాబ్ పరీక్షలకు పంపించారు. వాటి ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సి.రామాపురం సహా 5 గ్రామాలకు తాగునీటి సౌకర్యం, వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈప్రాంతంలోని ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం భరోసా ఇస్తోందని అన్నారు. తిరుపతి నుంచి సేకరిస్తున్న చెత్తను 14 రోజులుగా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని, ఏవైనా సమస్యలుంటే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడం జరుగుతుందన్నారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో తిరుపతి 9వ స్థానంలో నిలిచిందని, తిరుపతిని అందరం కలిసి నవనందన నగరంగా నిర్మించుకోవాలని చెప్పారు. చెత్త సమస్యకు శాశ్విత పరిష్కారం చూపేందుకు ఇటీవల జింధాల్ కంపినీ ద్వారా వేస్ట్ ఎనర్జీ ప్రాజెక్టును నిర్మించడానికి స్థల సేకరణ చేస్తున్నామన్నారు. విద్యుత్‌ప్లాంట్‌కు 20 ఎకరాలు అవసరమని అవసరమైన స్థల సేకరణకు సైతం పరిశీలన జరుగుతోందని వివరించారు. ఒకటిన్నర సంవత్సరం తరువాత రామచంద్రాపురం డంపింగ్ యార్డు వేస్ట్ ఎనర్జీప్లాంట్ ఉత్పత్తి చేసే నాటికి తరలిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందుకు ప్రజలు సహకరించాలని అన్నారు. అంత వరకు ఎవరూ చెత్తను తరలిస్తున్న వాహనాలను అడ్డుకోవద్దని అన్నారు. ఇది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే అవుతుందని, ఇందువల్ల అనేక సమస్యలు వస్తాయన్నారు. రాజకీయాలకు అతీతంగా తాము మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. ఈసందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ హరికిరణ్ మాట్లాడేందుకు ప్రయత్నించగా ప్రజలు ఆయన్ను అడ్డుకున్నారు. మీవల్లే మాకు ఇన్ని సమస్యలని ప్రజలు అడ్డుపడటంతో కలెక్టర్ ప్రద్యుమ్న జోక్యం చేసుకుని జరిగిన విషయాలను అర్థం చేసుకోకుండా తానేం చేయాలని ప్రభుత్వ అధికారిగా ఆయన చెప్పేది కూడా వినాలని ప్రజలను వారించారు. ఆతరువాత ఎంపి శివప్రసాద్ మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడమే తమ ఉద్దేశ్యమని అన్నారు. ఎవరో చెప్పిన మాటలు విని ఇబ్బందులు పడవద్దని సూచించారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మాట్లాడుతూ ఈప్రాంత సమస్యను తాను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లానని దీనిని పరిష్కరించడం కోసమే అందరూ ప్రయత్నిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన వారు వెలుపలికి రాగానే అందరితో కూర్చుని మాట్లాడుకుందామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ప్రజలు అంగీకరించారు. కాగా గల్లా అరుణ కుమారి మాట్లాడుతున్న సమయంలో కొందరు ఆమెను అడ్డుకున్నారు. తమ ప్రాంత ప్రజలు జైల్లో ఉంటే వారిని పలుకరించకుండా వచ్చి మాతో ఎలా మాట్లాడుతారంటూ కేకలువేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ భాగ్యలక్ష్మి, డి ఎస్పీ నంజుండప్ప, సర్పంచ్ చంద్రమ్మ, మాజీ ఎంపికి కేశవులు నాయుడు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.