ఫోకస్

వస్త్ర పరిశ్రమకు చావుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి ‘రోటి, కప్డా ఔర్ మకాన్’ రాజకీయ పార్టీలకు నినాదం. ఈ మూడింటిపై ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ పన్ను వేయలేదు. పౌరులకు ప్రాథమిక అవసరాలైన ఈ మూడింటిని పేద ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో పన్నుల జాబితా నుంచి మినహాయిస్తూ వచ్చాయి. జిఎస్‌టి కింద వస్త్ర పరిశ్రమను కూడా చేర్చడంవల్ల యావత్తు ప్రజానీకం ఆందోళనకు గురవుతోంది. జిఎస్‌టిలో వస్త్ర పరిశ్రమను చేర్చడాన్ని ఆల్ ఇండియా టెక్స్‌టైల్ ట్రెడర్స్ అసొసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణలోని వస్త్ర వ్యాపారుల సంఘం రాష్ట్రంలో మూడు రోజులపాటు వస్త్ర దుకాణాలను బంద్‌చేసి నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వాట్, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ పరిధిలోకి రాని వస్తువులను నుంచి మినహాయించాలని జిఎస్‌టి కౌన్సిల్ మొదట నిర్ణయించింది. అయితే చివరి నిమిషంలో దీనిని జిఎస్‌టిలో చేర్చడం వస్త్ర వ్యాపారులను దిగ్బ్రాంతికి గురిచేసింది. వస్త్ర పరిశ్రమలో 80 శాతం మంది అసంఘటితంగా, నిరక్ష్యరాస్యులు ఉన్నారు. నైపుణ్యతతో ప్రమేయం లేనివారు కూడా ఈ వృత్తిని తమ జీవనోపాధిగా ఎంచుకున్నారు. జిఎస్‌టి నియమావళి ప్రకారం వస్త్ర వ్యాపారులు తప్పనిసరిగా కంప్యూటర్ కలిగి ఉండాలి. ప్రస్తుతం వస్తవ్య్రాపారులు 11 శాతం మంది మాత్రమే కంప్యూటర్లు కలిగి ఉన్నారు. మిగతా 89 శాతం మంది వ్యాపారులకు కంప్యూటర్లు కానీ, వాటి పరిజ్ఞానం కానీ లేదు. గ్రామీణ ప్రాంతాలలో అత్యధిక మందికి జీవనోపాధిని కల్పించే వస్త్ర పరిశ్రమను జిఎస్‌టి నుంచి మినహాయించాలి.
- అమ్మనబోలు ప్రకాశ్
అధ్యక్షుడు, తెలంగాణ స్టేట్ ఫెడరేషన్
ఆఫ్ టెక్స్‌టైల్ అసొసియేషన్