సబ్ ఫీచర్

ఇదేం రాజనీతి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఐదుగురం.. కౌరవులు నూరుమంది. ఈ ఉ భయ పక్షాల మధ్య శత్రుత్వం ఉన్నా మనపై బ యటి వాళ్లు దాడికి వస్తే మనం నూటఐదుమందిమే! దు ర్యోధనుడిని గంధర్వుడు బంధించినప్పుడు ఆయనను విడిపించమని ధర్మరాజు తన సోదరుడైన భీముడికి హితవు పలుకుతాడు. అందుకు ‘ససేమిరా’ అని భీష్మించిన భీముడితో ధర్మరాజు చెప్పిన హితోక్తులివి! ఏపి రాజధాని అమరావతి నిర్మాణంపై రైతుల పేరుతో కొందరు చేస్తున్న అంతర్జాతీయ ఆగడాలు చూసిన తర్వాత, ఎవరికైనా ధర్మరాజు నీతి గుర్తుకొస్తుంది. ధర్మరాజు చెప్పిన ఈ సూత్రం మన నాయకమ్మన్యులు పాటించకపోవడం తెలుగుప్రజల దౌర్భాగ్యం.
రాజధాని లేకుండా కళ్లు తెరిచిన నవ్యాంధ్ర అనే పసికూనను చిదిమేస్తున్న విష రాజకీయాలు వెగటు పుట్టించేవే. అదే సమయంలో రాజధాని నిర్మాణాన్ని అవకాశంగా తీసుకుని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వందలకోట్లకు పడగలెత్తాలనుకుంటున్న మరికొందరు వ్యాపార సామ్రాట్టుల మాయాజాలమూ జుగుప్స కలిగించేదే. రాజధాని పేరుతో అధికార పార్టీ చేస్తున్న భూ దోపిడీని అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం, గతంలో ‘మహానేత’ బతికున్నప్పుడు జరిగిన భూ,జలదోపిడీని తెరపైకి తీసుకువచ్చి ఎదురుదాడి చేస్తున్న అధికారపక్ష రాజకీయ క్రీడ అమరావతి పరిధిలోనే సాగితే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ, ఇప్పుడు అధికార తెదేపాను రోడ్డున పడేసేందుకు ప్రత్యర్థులు రాష్ట్ర ప్రతిష్ఠను అమరావతిని దాటించి, విదేశాలకూ విస్తరించి భ్రష్ఠు పట్టించడం బాధాకరం. ఇది ప్రజలు మెచ్చే చర్యలు కావు. ఒకరకంగా తటస్థులు, విద్యావంతుల దృష్టిలో ఈ చర్యకు పాల్పడిన వారు, వారి వెనుక ఉండి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్న వారు నైతికంగా దిగజారినట్లే లెక్క.
అమరావతి నిర్మాణం కోసం సిఎం చంద్రబాబు ఎంత కష్టపడుతున్నారో, అంతే సమానంగా అందులో అవినీతి, రహస్య ఒప్పందాల మాయాజాలం, ‘ఆశ్రీతుల’కు అన్నీ కట్టబెట్టే మాయోపాయం ఉందన్న వ్యాఖ్యలు రహస్యమేమీ కావు. అవి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా జరిగిన చ ర్చనే. రాజధానిని అడ్డుపెట్టుకుని ఏ ప్రముఖులెంత భూమి కొన్నారు? ఎంతమందిని బెదిరించి కారుచౌకగా కొట్టేశారు? ఇందులో ఏయే వర్గాలు బాగుపడుతున్నాయన్నది బహిరంగ రహస్యమే. తాము కోరుకున్న దొనకొండ, ఒంగోలు పరిసర ప్రాంతాలు కాకుండా అమరావతిని రాజధానిగా ఎన్నుకోవడం సహజంగా వైకాపాకు ఇష్టం ఉండదు. అందుకే అమరావతి లోపాలపై దృష్టి సారించడాన్ని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని నెలల నుంచి ఆ లోపాల పుట్టలను బయటపెడుతున్న క్రమంలో ఆ పార్టీ లేవనెత్తుతున్న సందేహాలు, బయటపెడుతున్న తెరచాటు బాగోతాలను సామాన్య ప్రజానీకం నమ్ముతుందన్నదీ నిజం. అమరావతికి సంబంధించి ఇవన్నీ దాచినా దాగనివి. ఇప్పటికే అమరావతికి సంబంధించి 16 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వాటి గురించి చర్చించడం చర్వితచరణమే. రా బోయే అసెంబ్లీ ఎన్నికల్లోగా పోలవరం పూర్తి, అమరావతిలో కనీసం రెండు ఐకాన్ టవర్లు, విశాఖలో కొన్ని పెద్ద ఐటి కంపెనీలు, సీమలో కొన్ని పరిశ్రమలైనా తీసుకువచ్చి, ఓటరు దేవుళ్ల వద్దకు వెళ్లాలన్నది చంద్రబాబు లక్ష్యం. అందుకోసమే ఆయన కాళ్లకు బలపాలు కట్టుకుని దేశ, విదేశాలు తిరుగుతున్నారు. రాజకీయాల్లో తనకంటే జూనియర్ అయిన మోదీకి సగం వరకూ సాగిలపడాల్సిన అనివార్య పరిస్థితి. ఇన్ని అవమానాలు, అనివార్యతను తట్టుకుని రాజధాని కోసం పరితపిస్తున్న బాబుకు- చివరకు అదే తలనొప్పిలా పరిణమించింది. ఇప్పుడు బాబుకు బలం, బలహీనత- అమరావతే!
కొద్దిరోజుల క్రితం రైతుల పేరుతో అమరావతికి రుణం ఇవ్వవద్దంటూ వరల్డ్‌బ్యాంకుకు కొందరు రాసిన లేఖ సంచలనం సృష్టించింది. అదీ ఇంగ్లీషులో- వరల్డ్‌బ్యాంక్ ఇ-మెయిల్‌కు! అందులో రుణాలకు సంబంధించి బ్యాంకు పాటించే విధి విధానాలు, నిబంధనల డాక్యుమెంట్లను ఉటంకించారు. ప్రపంచబ్యాంకు అనుబంధంగా వాషింగ్టన్‌లో ప్రత్యేకంగా ఓ తనిఖీ విభాగం ఉందని చాలామందికి తెలియదు. కానీ, తుళ్లూరులోని అజ్ఞాత ఆంగ్ల రైతు రచయితలకు ఈ సంగతి తెలుసు! ఆ బ్యాంకు అప్పులివ్వడానికి ఎన్విరాల్‌మెంటల్ అండ్ సోషల్ ఫ్రేమ్‌వర్క్ అనేది ఒక ప్రాతిపదికగా ఉంటుందన్నది ఆర్థికమంత్రులతోపాటు, డిగ్రీలు, పీజీలు చదివిన వారికి తెలుసా? తెలియదు. కానీ తుళ్లూరులో పేరు కూడా చెప్పడానికి ఇష్టపడని రైతులకు మాత్రం ఇవన్నీ తెలుసు!
సహజంగా గ్రామీణ ప్రాం తాల్లో అంత ఆంగ్ల పాండిత్యం ఉన్న రైతులున్నారంటే నమ్మేంత వెర్రిబాగులెవరూ ఉండరు. ఇటీవల మన ‘ఇంజనీరింగు చిరంజీవుల’పై జాతీయ స్థాయిలో సర్వే నిర్వహిస్తే- మనబ్బాయిలు ఇంగ్లీషులో ‘వీక్’ అని, లాంగ్వేజీ స్కిల్సు బొత్తిగా లేవని తేలిందట! ఇక తుళ్లూరు ప్రాంతంలోని ఓ 1600 మంది సభ్యులున్న రాజధాని ప్రాంత రైతు సమాఖ్య సభ్యులు మాత్రం బహుశా కేంబ్రిడ్జి యూనివర్శిటీలో చదివినందుకే వారికి అంత ఆంగ్లవిజ్ఞానం, ప్రపంచబ్యాంకుపై అంత పట్టు అబ్బినట్లుంది! అమరావతి నిర్మాణానికి తాము భూములిచ్చేది లేదని ఒక వర్గం రైతాంగం చాలాకాలం నుంచీ బాహాటంగానే తిరస్కరిస్తోంది. మరికొందరు హైకోర్టు, ఇంకొందరు సుప్రీంకోర్టు, ఒకరిద్దరు గ్రీన్ ట్రైబ్యునల్‌కు వెళ్లారు. ఇవన్నీ రహస్యమేమీ కాదు. ఎందుకం టే వాళ్లందరి ఊరు, పేర్లతో సహా అన్నీ మీడియాలో వస్తున్నవే. జగన్ మీడియాలో సహజంగానే వీటికి ఎక్కువ ప్రా ధాన్యం ఉంటుంది. అమరావతిపై ఇప్పటివరకూ ఏ సం ఘాలు, ఏ వ్యక్తులు పోరాడుతున్నాయో ప్రజలు, పాత్రికేయులకూ తెలుసు. కానీ బ్యాంకు కోసమే కొత్తగా పేపరు మీద పుట్టుకొచ్చిన ఈ రైతు సమాఖ్య, అమరావతి సమస్యలపై ఎప్పుడు గజ్జె కట్టిందో ఆ జగన్నాథుడికే ఎరుక!
సరే- పైకి ఎన్ని మాట్లాడినా, ఎన్ని వాదనలు వినిపించినా వాటి వెనుక ఎవరున్నారన్నది సుస్పష్టం. అమరావతి నిర్మాణం ఆగిపోతే టిడిపికి నష్టం, వైసీపీకి లాభం. ఐదేళ్లయినా ఒక్క ఇటుక పేర్చని టిడిపికి మరో ఐదేళ్లు అవకాశమిచ్చినా ఇంకేం చేస్తుందని వైసీపీ రేపు ఎన్నికల ముందు ప్రచారం చేయవచ్చు. కోర్టు అడ్డంకులు, వైసీపీ కల్పిస్తున్న రాజకీయ చిక్కుల గురించి టిడిపి చెప్పినా అది ప్రజలకు అనవసరం. చెప్పినట్లు రాజధాని కట్టారా? లేదా? అన్నదే వారికి ముఖ్యం. అంటే అప్పుడు రాజకీయంగా నష్టపోయేది టిడిపి అయితే లాభపడేది వైసీపీ కదా? మరి ఇప్పుడు ఆ అజ్ఞాత ఆంగ్ల రైతుల వెనుక ఎవరున్నారు? ఏ పార్టీ ఉందన్నది కనుక్కోవడానికి పెద్ద మేధావులే కావాలా?
ఇలాంటి అనైతిక చర్యలకు ఏ పార్టీ పాల్పడినా ప్రజలు మెచ్చకపోగా ఛీత్కరిస్తారు. ఇప్పుడు రైతుల పేరిట వైసీపీ నేతలే రుణాలివ్వవద్దని లేఖలు రాశారని టిడిపి ఆరోపిస్తోంది. తమకు ఏ సంబంధం లేదని సహజంగానే వైసీపీ అడ్డంగా వాదిస్తోంది. ఈ రెండు వాదనల్లో ఏది నిజం, ఏది అబద్ధమని కాసేపు పక్కనపెడదాం. రేపు ఎన్నికల తర్వాత టిడిపి ప్రతిపక్షంగా, వైసీపీ అధికారపక్షంగా అవతరించిందనుకుందాం. అప్పుడు టిడిపి కూడా ఇదే విధానం పాటిస్తుంది కదా? ఎందుకంటే ఆంగ్ల పరిజ్ఞానం లేని రైతులకే వరల్డ్‌బ్యాంకు మెయిల్ ఐడి, వెబ్‌సైట్ల గురించి తెలిసినప్పుడు- ఇనే్నళ్ల అధికారంలో ఆ బ్యాంకుతో సంబంధాలుండి, దాని ఆనుపానులు తెలుసుకోవడం టిడిపికి పెద్ద పనికాదు కదా? అప్పుడు మరో రైతు సంఘం పేరుతో రుణాలివ్వవద్దని టిడిపి అజ్ఞాత పోరాటం చేస్తే నష్టపోయేది ఎవరు? అధికారంలో ఉన్న వైసీపీనా? ప్రతిపక్షంగా ఉండే టిడిపినా? ఇద్దరూ కాదు. ఆర్థికంగానే కాదు, ప్రపంచం దృష్టిలో పలచనై నష్టపోయేది రాష్టమ్రే! ఇప్పుడు ప్రపంచంలోని ఏ దేశానికైనా ప్రపంచ బ్యాంకు అప్పులే దిక్కు. కేంద్రం కూడా ఆర్థికంగా బలంగా ఏమీ లేదు. సీత బాధలు సీతవి, పీత బాధలు పీతవన్నట్లు కేంద్రం బాధలు కేంద్రానివి మరి. అందుకే స్వయంగా కేంద్రమే విదేశీ నిధులు తెచ్చుకోమని రాష్ట్రాలకు అనుమతిచ్చేసింది. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకోకుండా జగన్‌బాబు ఈ రాష్ట్రంలో ఎలాంటి పనులైనా చేయగలరా? లేకపోతే అసలు మాకు విదేశీ బ్యాంకులతో అవసరం లేదని చెప్పే ధైర్యం ఉందా?
ఇలాంటి అనైతిక చేష్టలతో రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నాలు ఎవరు చేసినా అది దివాళాకోరుతనమే. పోలవరం ఆపేందుకు పక్కనున్న ఒడిశా సర్కారుతో మంతనాలు, రుణాలు దక్కకుండా వరల్డ్‌బ్యాంకుకు పితూరీలు, ఏపి సీఎంను అరెస్టు చేయాలని అమెరికా పోలీసులకు లేఖలు, అమరావతిని ఆపేందుకు రకరకాల ముసుగుల్లో కోర్టుల్లో ఫిర్యాదులు.. ఇవన్నీ అరాజకీయమే. ఈ విషయంలో మనం తమిళనాడును చూసి ఎప్పుడు, ఎన్నాళ్లకు సిగ్గు తెచ్చుకుంటామో అర్థం కాదు. ద్రవిడ పార్టీల మధ్య ఎన్ని వైషమ్యాలున్నా, రాష్ట్రం కోసం అవి వినిపించే ఒకేమాట-ఒకేబాట సిద్ధాంతం మన పార్టీలకు అలవడాలంటే ఇంకెన్ని జన్మలు ఎత్తాలో?!

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144