పర్యాటకం

కొడకంచిలో కొలువైన ఆదినారాయణుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరాకారుడు, నిస్సంగుడు అయిన భగవంతుడు తనను కొలిచేవారి కోరికననుసరించి వ్యక్తస్వరూపుడయ్యాడు. అన్నింటికి కారణుడైన ఆ స్వామి ఓ సారి అల్లాణి వంశస్థుల్లో ఒకరికి స్వప్న దర్శనం ఇచ్చారు. నేను తెలంగాణా ప్రాంతాలలోని మంబాపూర్ అడవుల్లో వున్నానని తనకు ఓ ఆలయం కట్టించమని ఆదేశించాడట. ఆ యువకుడు తనకు వచ్చిన స్వప్నాన్ని పెద్దలతో చెప్పాడు. అందరూ కలసి ఆ అడవికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అడవిలో స్వామివారిని వెదకడమెలాగో అని మళ్లీ స్వామివారినే మాకు దారిచూపండి అనిఅందరూ కలసి ప్రార్థించారు. భక్తదయాళు అయిన స్వామి మీకు ఓ గరుడేంద్రుడు సాయం చేస్తాడు. మీరు తెల్లవారగనే ఆ గరుడునితో పాటు వెళ్లండి ఆయన ఎక్కడ ఆగితే అక్కడే నేను ఉంటాను అని చెప్పాడట. అందరూ ఆత్రంగా గరుడుని కోసం ఎదురుచూశారు.
గరుడుడు రానే వచ్చాడు. ఆ గరుడినితోపాటుగా ఊరి వారితోకలసి అల్లాణి వంశస్థులు బయలుదేరారు. ఆ గరుడ పక్షి వీరికి దారిచూపుతూ ముందుకు వెళ్లిఅడవిలోని ఓ చెట్టుకింద ఉన్న పుట్టపై వాలిందట. అందరూ కలసి ఆ పుట్టను అభిషేకించగా స్వామి చిరునవ్వుతో భూదేవి శ్రీదేవి సమేతంగా వారికి దర్శనం ఇచ్చాడట. వారంతా మహదానందపడి దేవేరులతో ఉన్న ఆదినారాయణ స్వామిని బండిపై ఎక్కించుకుని బయలుదేరారట. ఆ బండి కొడకంచి ప్రాంతంలోని ఓ కొండ దగ్గర నిలిచిపోయిందట. ‘ఓహో స్వామివారు ఇక్కడే తనకు ఆలయం కట్టమని ఆదేశిస్తున్నట్టు ఉంది’ అనుకొన్నారట. వెంటనే అక్కడ అందరూ కలసి అల్లాణ్ణి వంశస్థుల కోరిక మేరకు అక్కడే ఆదినారాయణునకు, అఖిలభువనాలను ఏలువానికి ఆలయం నిర్మించారట. అందులో స్వామివారిని అమ్మవార్లను కూడా ప్రతిష్ఠించి నాటి నుంచి నేటి వరకు అంగరంగవైభోగంగా స్వామివారికి సేవలు చేస్తున్నారు. కాని కాలమహాత్మ్యంతో నేటికీ ఈ మెదక్ జిల్లాలోని కొడకంచి ఆదినారాయణుని ఆలయం ఇంకా అభివృద్ధిచెందాల్సిన దశలోనే ఉంది. మాఘమాసంలో స్వామివారి ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని మాఘ శుద్ధతదియ నాడు బ్రహ్మోత్సవాలు ఆరంభంచేస్తారు. అశ్వ,గజ, సింహ వాహనాదులతో స్వామి వారిని ఊరేగిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లోనే అత్యంత వేడుకగా రథోత్సవాన్ని నిర్వహిస్తారు. స్వామిని సేవించడానికి వచ్చిన ఆళ్వారులను స్మరించడం కోసం ఇక్కడున్న ఉపాలయాల్లో ఆళ్వారులను కూడా ప్రతిష్ఠించారు. కొడకంచిలోని ఆదినారయణ స్వామి వారి ఆలయానికున్న కప్పుపైన రాతిబల్లులు కూడా దర్శనమిస్తాయి. వీటిని తాకినట్లయితే బల్లిదోషాలు నివారణ అవుతాయని ఇక్కడి నివాసితుల నమ్మకం. కంచి బల్లులలాగే ఈ బల్లులు కూడా మహిమాన్వితమైనవి అంటారు.
ఇక్కడ స్వామి వారిని అమ్మవార్లను దర్శించుకున్నా కంచి వరదరాజస్వామి, ఏకాంబరేశ్వరులను, కంచి కామాక్షిని దర్శించుకున్న పుణ్యాన్ని పొందేటట్లుగా ఈ ఆదినారాయణ స్వామి వరం ఇచ్చినట్టు అల్లాణి వంశస్థులు చెబుతారు.
ఈ కొడకంచి మార్గంలోనే బీరంగూడ మల్లికార్జున స్వామి ఆలయం కూడా ఉంది. కనుక ఈ ఆదినారాయణ స్వామిని దర్శించిన వారు మల్లికార్జునుని ఆశీర్వాదం కూడా తీసుకొంటారు. ఇక్కడ తొలి ఏకాదశికి, భీష్మ ఏకాదశికి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. పర్వదినాల్లో ధనుర్మాసంలోను స్వామివారికి నిత్యకైంకర్యాలతోపాటుగా విశేషపూజలు నిర్వహిస్తారు. హైదరాబాదుకు సుమారు 40. కి.మీదూరంలో ఉన్న ఈ కొడకంచికి సులభంగానేచేరుకోవచ్చు. తెలంగాణా ప్రభుత్వం వారు రవాణా సదుపాయాలను కూడా కల్పించారు. ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కనుక ఈ భూదేవి, శ్రీదేవి సమేత ఆదినారాయణ స్వామి దర్శనం సర్వ పుణ్యప్రదం అంటారు.

ఏకాదశి - ఉపవాసం
‘‘తొలి ఏకాదశిన ఉపవాసము ఉండువారికి పునర్జన్మ లేకుండా ముక్తికలగాలి. నక్తము చేసేవారికి సమానమైన ఫలం ఉండాలని’’ అని కోరి వరాలను పొందిన వరకన్య ఏకాదశి. మురాసుర సంహారంలో ఉద్భవించిన ఈ కన్యారత్నం విష్ణువు ప్రీతిపాత్రమైంది. పక్షానికి ఒకటి చొప్పున సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయ. తొలి ఏకాదశిని ‘‘హరివాసరము,’’ శయనైకాదశిగా సంభావిస్తారు. మహావిష్ణువు పాలకడలిలో పవ్వళింపు సేవాసక్తుడైన ఈ దినమే తొలి ఏకాదశి. చాతుర్మాసవ్రతారంభదినం. నియమానుసారంగా ఏకాదశి వ్రతాలు ఆచరిస్తే మంచి ఫలితాలు పొందుతారు - పద్మ పురాణం
ఏకాదశి- గోపూజ
గోపూజ ఏకాదశి ప్రత్యేకత. సర్వదేవతాస్వరూపిణి, సర్వతీర్థ స్వరూపిణిగా గోవు మనిషికి ఎంతో మేలు చేస్తుంది. గోవిశిష్టతను అనేక పురాణాలు ఉద్ఘోషిస్తున్నాయ. గోవిశిష్టతను పురస్కరించుకుని గోపద్మవ్రతం తొలైకాదశిన ఆచరిస్తారు. గోశాలను శుభ్రపరిచి ముప్పైమూడు పద్మాల ముగ్గులువేస్తారు. దానిమీద శ్రీమహాలక్ష్మీసమేత శ్రీ మహావిష్ణువు ప్రతిమనుపెట్టి శాస్త్రోకంగా పూజచేస్తారు. లక్ష్మీదేవికి ప్రతిరూపంగా తులసిని సేవిస్తారు. తులసి ముందర పద్మం ముగ్గువేసి దీపం వెలిగిస్తారు. వివిధ రకాల పండ్లను నివేదిస్తారు.
ఏకాదశి- శివపూజ
శివాచారపరాయణులు శివశయన వ్రతం చేస్తారు. భక్తుల పాపాలను తన జటాజూటంలో బంధించి శివుడు వ్యాఘ్ర చర్మం మీద ఈరోజునుంచి పడుకొని నాలుగునెలలు నిద్రిస్తాడు.

- చివుకుల రామమోహన్